MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Baking Soda Vs Baking Powder: బేకింగ్ పౌడర్, బేగింగ్ సోడాకు తేడా ఏంటి? ఏది దేనికి వాడాలి?

Baking Soda Vs Baking Powder: బేకింగ్ పౌడర్, బేగింగ్ సోడాకు తేడా ఏంటి? ఏది దేనికి వాడాలి?

Baking Soda Vs Baking Powder: బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండింటినీ వంటకు వాడతారు. కానీ, దేనిని ఎక్కడ వాడాలో చాలా మందికి తెలీదు.. అసలు, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 27 2026, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వంటకు బేకింగ్ సోడా వాడుతున్నారా?
Image Credit : Gemini AI

వంటకు బేకింగ్ సోడా వాడుతున్నారా?

బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ రెండింటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. ఈ రెండింటి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. దీంతో.. దేని కోసం ఏది వాడాలో తెలీక అయోమయానికి గురౌతూ ఉంటారు. అసలు.. ఈ రెండింటికీ తేడా ఏంటి? దేనిని దేనికి వాడాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బేకింగ్ సోడా అంటే ఏమిటి..?
Image Credit : our own

బేకింగ్ సోడా అంటే ఏమిటి..?

బేకింగ్ సోడా ఒక క్షార పదార్థం. ఇది పెరుగు, మజ్జిగ, నిమ్మరసం, వెనిగర్ లాంటి యాసిడ్స్ ఉన్న పదార్థాలతో కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ మొదలౌతుంది. దీని వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పిండి తొందరగా పులుస్తుంది. దీంతో.. కేక్, ఢోక్లా వంటి వంటకాలు రుచిగా వస్తాయి. అయితే.. బేకింగ్ సోడా కలిపిన పిండిని ఎక్కువసేపు అలా వదిలేయకూడదు. వెంటనే వండేయాలి. ఇది తొందరగా పొంగుతుంది. ఇది ఎక్కువ వేస్తే రుచి చేదుగా మారే అవకాశం ఉంది.

బేకింగ్ పౌడర్ అంటే ఏంటి?

బేకింగ్ పౌడర్ లో ఆల్రెడీ యాసిడ్స్ ఉంటాయి. మనం బేకింగ్ పౌడర్ ని వాడేటప్పుడు మనం స్పెషల్ గా నిమ్మరసం, పెరుగు లాంటివి కలపాల్సిన అవసరం లేదు. ఇదొక్క పొడి.. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నెమ్మదిగా, సమానంగా పొంగుతుంది.ఇది కాస్త ఎక్కువ వేసినా పెద్దగా రుచిలో తేడా ఏమీ రాదు.

బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ దేనిని ఎప్పుడు వాడాలి?

ఢోక్లా, పకోడీలు, పాన్ కేకులు, అరటిపండుతో చేసే బ్రెడ్, కోకో పౌడర్ తో చేసే చాక్లెట్ కేకులను తయారు చేయడానికి బేకింగ్ సోడా వాడాలి.

వెనీలా కేక్, స్పాంజ్ కేక్, కప్ కేకులు, మఫిన్లు, బిస్కెట్లు వీటికి బేకింగ్ పౌడర్ వాడాలి. ఇక.. పెరుగు, కోడిగుడ్డు వేయకుండా చేసే కేకుల్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వేయాలి.

Related Articles

Related image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Related image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
33
ఒక దానికి బదులు మరొకటి వాడితే ఏమౌతుంది..?
Image Credit : others

ఒక దానికి బదులు మరొకటి వాడితే ఏమౌతుంది..?

చాలా మంది దేనిని దేనికి వాడాలో తెలీక.. ఒక దానికి బదులు మరొటి వాడేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. కానీ, బేకింగ్ సోడా స్థానంలో బేకింగ్ పౌడర్ వాడొచ్చు. అయితే.. 2 నుంచి 3 రెట్లు ఎక్కువ వేయాల్సి ఉంటుంది. బేకింగ్ పౌడర్ స్థానంలో బేకింగ్ సోడా వాడాలంటే.. పెరుగు, నిమ్మరసం, వెనిగర్ లాంటివి కలపాల్సి ఉంటుంది.

మీరు చేసిన కేకు రుచిలో చేదుగా అనిపించింది అంటే.. బేకింగ్ సోడా ఎక్కువ అయ్యిందని అర్థం. లేదు.. కేక్ సరిగా పొంగలేదు అంటే.. మీరు వాడిన బేకింగ్ పౌడర్ పాతది అయ్యిండొచ్చు. మీరు చేసిన కేకు బయట మాత్రం గోధుమ రంగులో మారి.. లోపల సరిగా ఉండకలేదు అంటే బేకింగ్ సోడా ఎక్కువ వేశారు అని అర్థం. పకోడీలు నూనె ఎక్కువగా పీల్చుకున్నాయి అంటే.. మీరు బేకింగ్ ఎక్కువ వేశారు అని అర్థం. అందుకే.. వీటిని చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే వేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Recommended image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved