Cold and Cough: ఈ చిన్న గింజలు ఇలా తీసుకుంటే...జలుబు, దగ్గు పరార్ అవ్వాల్సిందే..!
Cold and Cough: వాములో యాంటీ బాక్టీరియాల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఇతర ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. మనం ఆ వాము ని ఉపయోగించి.... జలుబు, ఇన్ఫెక్షన్ల సమస్యలను తగ్గించడంలో, ఉపశమనం కలిగించడంలో బాగా సహాయపడతాయి.

Ajwain seeds
వాతావరణంలో మార్పులు జరగడం సహజం. మరీ ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో తొందరగా అందరికీ జలుబు, దగ్గు వచ్చేస్తూ ఉంటాయి. ఈ జలుబు, దగ్గు అంత తొందరగా తగ్గవు. వారాలపాటు మందులు వాడినా కూడా ఈ జలుబు, దగ్గు తొందరగా తగ్గవు. అయితే.. మీ కిచెన్ లో లభించే వాము ( Ajwain Seeds) ఒక్కటి ఉంటే చాలు.... ఎంత జలుబు, దగ్గు కీ అయినా చెక్ పెట్టేయవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
వాముతో ప్రయోజనాలు...
వాములో యాంటీ బాక్టీరియాల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఇతర ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. మనం ఆ వాము ని ఉపయోగించి.... జలుబు, ఇన్ఫెక్షన్ల సమస్యలను తగ్గించడంలో, ఉపశమనం కలిగించడంలో బాగా సహాయపడతాయి. వాము వాడటం వల్ల ముక్కు, గొంతు క్లియర్ అవుతుంది. కఫం బయటకు పంపడానికి, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి, సైనస్ సమస్యలను తగ్గించడానికి, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది. శ్వాస కోస సమస్యలను నయం చేయడానికి, చాలా తొందరగా జలుబు నుంచి ఉపశమనం కలిగించడానికి హెల్ప్ చేస్తుంది.
వాము కషాయం....
వాము కషాయం తీసుకోవడం వల్ల మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడానికి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి వాము కషాయాన్ని తీసుకోవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ పసుపు, ఒక చిన్న అల్లం ముక్కను వేసి మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత...గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కషాయం తాగితే సరిపోతుంది. చాలా తక్కువ సమయంలోనే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
వాముతో ఆవిరి....
ఒక వెడల్పు పాత్రలో 1 లీటరు నీటిని తీసుకోండి. 1 నుండి 2 టీస్పూన్ల ఓంకాను నీటిలో వేసి మరిగించండి. మీ తలను టవల్‌తో కప్పి 10 నిమిషాలు ఆవిరిని పీల్చుకోండి. ఇది మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడానికి, సైనస్‌లను తగ్గించడానికి, గొంతులో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.
వామును ఇలా కూడా వాడొచ్చు....
2 టేబుల్ స్పూన్ల వామును గింజలను పాన్‌లో సువాసన వచ్చే వరకు వేయించాలి. విత్తనాలను కాటన్ గుడ్డలో చుట్టి కట్టాలి. దానిని మీ ముక్కు దగ్గర పట్టుకుని దాని వెచ్చని వాసనను పీల్చుకోవాలి. ఇది మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడానికి, గొంతు , శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి , గొంతులో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు.
ఇది ముక్కును క్లియర్ చేయడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో వాపును తగ్గించడానికి.. జలుబు నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో వాము గింజలను వేసుకొని తాగినా కూడా... చాలా బాగా సహాయపడుతుంది.