Health tips: రాత్రిపూట ఈ 6 రకాల ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది!
ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో.. తినే టైమింగ్స్ కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రిపూట తినడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి మెరుగైన ఆరోగ్యం కోసం రాత్రి పడుకునే ముందు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టీ, కాఫీ వద్దు
టీ, కాఫీలో కెఫీన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ కెఫీన్ ఉత్తేజకారిగా పనిచేస్తుంది. కాబట్టి రాత్రి టీ, కాఫీ తాగడం వల్ల నిద్ర రావడం ఆలస్యం కావచ్చు లేదా నిద్ర నాణ్యత తగ్గవచ్చు. పడుకునే కొన్ని గంటల ముందు వీటిని తాగకపోవడమే మంచిది. కొన్ని హెర్బల్ టీ లలో కెఫీన్ ఉండదు. కాబట్టి అలాంటివి మితంగా తాగచ్చు.
మైదా వద్దు
మైదా శుద్ధి చేసిన గోధుమల నుంచి తయారవుతుంది. ఇందులో ఫైబర్ చాలా తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి మైదాతో చేసిన ఆహారాలు (చపాతీ, పరోఠా, బిస్కెట్లు వంటివి) తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.
పెరుగు వద్దు
పెరుగు ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ.. రాత్రి తీసుకోవడం వల్ల కొంతమందికి సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం, రాత్రి పెరుగు తినడం వల్ల కఫం పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు. జీర్ణ సమస్యలు లేనివారు మధ్యాహ్నం పెరుగు తినడం మంచిది.
కీరా వద్దు
కీరా చాలా పోషకమైన ఆహారం అనడంలో సందేహం లేదు. కానీ.. ఇందులో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. కొంతమందికి కడుపు బరువుగా అనిపించవచ్చు. కీరలోని కొన్ని అంశాలు నిద్రను ప్రభావితం చేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొబ్బరి వద్దు
కొబ్బరిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రి కొబ్బరి లేదా కొబ్బరిపాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, అసౌకర్యం కలుగుతుంది. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది.
బంగాళాదుంప వద్దు
బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొంతమందికి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. చిలగడదుంపలు వంటివి తక్కువ మోతాదులో తీసుకుంటే పర్వాలేదు కానీ.. బంగాళాదుంపను రాత్రి తినకపోవడమే మంచిది.