Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Kitchen Hack: ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి త్వరగా వాడిపోవడం ఒక పెద్ద సమస్య. రెండు రోజులకే కుళ్లిపోవడం, నల్లగా అయిపోవడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆకు కూరలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.

సరిగ్గా క్లీన్ చేయకపోతే ఫ్రిజ్‌లో పెట్టకూడదు
పాలకూర, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు మన వంటింట్లో దాదాపు ప్రతిరోజూ వాడుతాం. ఆకు కూరలు కొనుగోలు చేసే సమయంలోనే జాగ్రత్తగా ఎంచుకోవాలి. పచ్చగా, గట్టిగా ఉండే ఆకులు తీసుకోవాలి. పసుపు మచ్చలు, వాడిపోయిన భాగాలు ఉన్నవాటిని తీసుకోకూడదు. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే కూరలను సరిగ్గా క్లీన్ చేయకపోతే ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
పూర్తిగా ఆరబెట్టడం
చాలామంది కూరలను కడిగి నేరుగా ఫ్రిజ్‌లో పెడతారు. ఇది బిగ్ తప్పు. ఆకులపై తేమ ఉండటం వల్ల అవి త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి ముందుగా కూరలను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వడకట్టాలి. తర్వాత ఒక కాటన్ గుడ్డపై లేదా టిష్యూ పేపర్‌పై విస్తరించి 20–30 నిమిషాలు ఆరబెట్టాలి. తడి పూర్తిగా పోయిన తర్వాతే నిల్వ చేయాలి.
నిల్వ చేసే సరైన విధానం
ఆరిన ఆకు కూరలను టిష్యూ పేపర్‌లో చుట్టి, ఎయిర్‌టైట్ కంటైనర్ లేదా జిప్ లాక్ కవర్‌లో పెట్టాలి. టిష్యూ పేపర్ అదనపు తేమను పీల్చి ఆకులను తాజాగా ఉంచుతుంది. ఫ్రిజ్‌లో వెజిటబుల్ ట్రేలో ఉంచితే ఇంకా మంచిది. ఈ విధంగా ఉంచితే 5–7 రోజుల వరకు కూరలు ఫ్రెష్‌గా ఉంటాయి.
ఫ్రిజ్‌లో ఉంచితే ఫ్రెష్ గా ఉంటాయి
కొత్తిమీర, పుదీనా లాంటివి అయితే కాడ భాగాన్ని కత్తిరించి ఒక గ్లాస్ నీటిలో నిలబెట్టి, పైభాగాన్ని లైట్‌గా కవర్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
ఫ్రిజ్ టెంపరేచర్ కూడా ముఖ్యం
ఫ్రిజ్‌లో టెంపరేచర్ ఉంటే కూడా ఆకులు నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి మోస్తరు టెంపరేచర్‌లో ఉంచడం మంచిది. తరచుగా ఫ్రిజ్ తలుపు తెరవడం కూడా తేమ మార్పులకు కారణమవుతుంది.
ఆకు కూరలను పెద్ద కట్టలా ఉంచకుండా అవసరమైనంత మాత్రమే బయటకు తీసుకోవాలి. మిగతావి అలాగే కవర్ చేసి ఉంచాలి. ఇలా చేస్తే వాటి ఫ్రెష్ నెస్ ఎక్కువ కాలం ఉంటుంది.
ఆకు కూరలను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచడం కష్టం కాదు. సరైన శుభ్రపరచడం, పూర్తిగా ఆరబెట్టడం, టిష్యూ పేపర్‌తో నిల్వ చేయడం ఈ 3 స్టెప్స్ పాటిస్తే చాలాసేపు తాజాదనం ఉంటుంది. ఇకపై కూరలు వృథా కాకుండా ఈ సింపుల్ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి.

