MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facts: చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తే ఏమౌతుంది? మనకు తిండి కూడా దొరకదా?

Facts: చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తే ఏమౌతుంది? మనకు తిండి కూడా దొరకదా?

Facts: నెలంతా కష్టపడితేనే మనకు జీతం వస్తుంది. ఆ డబ్బుతోనే మనం బతుకుతూ ఉంటాం. అలాంటి డబ్బు.. ఎలాంటి కష్టం లేకుండా.. చెట్లకు డబ్బులు కాస్తే ఏం జరుగుతుంది? మన జీవితం ఎలా మారుతుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 19 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డబ్బులు చెట్లకు కాస్తే...
Image Credit : chat gpt

డబ్బులు చెట్లకు కాస్తే...

మన అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. రూపాయి సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాత్రి అనకా, పగలు అనకా కష్టపడుతూనే ఉంటారు. డబ్బు ఉన్నవారు లగ్జరీ లైఫ్ గడుపుతుంటే.. పేదవాళ్లు.. మూడు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు, మన ఇళ్ల్లో పెద్దవారి నోట్లో ఎక్కువగా ‘ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా?’ అనే మాట మీరు వినే ఉంటారు. ఒకవేళ.. అదే నిజమైతే.. రాత్రి పడుకొని.. ఉదయం లేచే సరికి.. మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లకు పండ్లు, పూలు కాకుండా.. డబ్బులు కాస్తే ఏం జరుగుతుంది? ప్రపంచమంతా ఇదే జరిగితే... జీవితం ఎలా మారుతుంది? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారా? లేక ప్రపంచమే తలకిందులు అవుతుందా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అందరి దగ్గరా డబ్బు ఉంటే ఏమౌతుంది?
Image Credit : gemini ai

అందరి దగ్గరా డబ్బు ఉంటే ఏమౌతుంది?

ఒకవేళ చెట్లకు డబ్బులు వస్తే, ప్రతి ఒక్కరూ సంచులు పట్టుకెళ్లి కావాల్సినంత డబ్బు కోసుకొని ఇంటికి తెచ్చేసుకుంటారు. ఎవరి దగ్గరా డబ్బు కొరత ఉండదు. అందరూ కుబేరులే అవుతారు. పేద, ధనిక అనే తేడా ఉండదు. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలౌతుంది. ప్రతి ఒక్కరి దగ్గరా నిండుగా డబ్బు ఉన్నప్పుడు.. ఎవరూ తమ పని చేయడానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పని చేస్తారు.. కావాల్సినంత డబ్బు ఉన్నప్పుడు ఎవరికీ పని చేయాలి అనే ఉత్సాహం కూడా రాదు.

33
ఎవరూ పని చేయకపోతే...
Image Credit : chat gpt

ఎవరూ పని చేయకపోతే...

పంటలు పండించే రైతు "నా దగ్గర డబ్బు ఉంది కదా, నేనెందుకు ఎండనక వాననక కష్టపడి వరి వేయాలి?" అనుకుంటాడు. పాలు పోసే వ్యక్తి "నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేనెందుకు పొద్దున్నే లేచి పాలు అమ్మాలి?" అనుకుంటాడు. దీని వల్ల ఎవరూ పని చేయకపోతే.. ఏ పనీ ముందుకు సాగదు. ఎవరికీ తిండి దొరకదు. డబ్బు ఉన్నా కూడా.. తిండి దొరకక ప్రజలు అలమటించి పోయే అవకాశం ఉంది. అదొక్కటే కాదు.. చాలా పనులు ముందుకు సాగవు. ఎవరి కిందా ఎవరూ పని చేయడానికి కూడా ఇష్టపడరు.

డబ్బును తిని బతకలేం కదా..

మనకు ఎంత డబ్బు ఉన్నా, తిండి దొరకాలన్నా, ఇతర నిత్యవసరాలు తీరాలన్నా ఎవరో ఒకరు కష్టపడి పని చేయాల్సిందే. సమాజంలో ఎవరూ పని చేయకపోతే వ్యవస్థ అంతా స్తంభించిపోతుంది. చివరకు కోట్లకు కోట్లు డబ్బులున్నా.. కొనుక్కోవడానికి ఏమీ దొరకని పరిస్థితి వస్తుంది. మనం ఎంత ఆకలిగా ఉన్నా డబ్బును తిని బతకలేం కదా!

మనిషి శ్రమ, పనికి ఉన్న విలువే సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. డబ్బు అనేది కేవలం మనం చేసే పనికి, వస్తువులకు ఇచ్చే మార్పిడి మాత్రమే. అందుకే ప్రకృతి ధర్మం ప్రకారం డబ్బు చెట్లకు కాయదు.. కాయకూడదు కూడా. మనిషి చేసే కష్టమే అసలైన సంపద. కష్టం మీద మాత్రమే ఆధారపడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Facts: ఒక పాము మరో పామును కాటేస్తే ఏమవుతుంది?
Recommended image2
Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే
Recommended image3
బంగారం పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? కార‌ణం ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే
Recommended image2
Stars: ఆకాశంలో కాదు... భూమి మీద నక్షత్రాలు కనిపించే ఏకైక ప్రదేశం ఇది, ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved