MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే

Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే

Colour: పొరపాటున కూడా మగ పిల్లలు పింక్ కలర్ షర్ట్ కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే.. అది అమ్మాయిల కలర్ అని చెబుతుంటారు. అసలు.. పింక్ కలర్ అమ్మాయిలకు, బ్లూ కలర్ అబ్బాయిలకు అని ఎవరు ఫిక్స్ చేశారు?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 18 2026, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పింక్ కలర్ అమ్మాయిలే ఎందుకు వేసుకుంటారు?
Image Credit : geminiai

పింక్ కలర్ అమ్మాయిలే ఎందుకు వేసుకుంటారు?

ఇంట్లో ఆడపిల్ల పుడితే.. వెంటనే ఎవరైనా పింక్ కలర్ డ్రెస్ తెచ్చేస్తారు. అదే అబ్బాయి పుడితే వెంటనే బ్లూ కలర్ డ్రెస్సులు కొనేస్తారు. ఎందుకంటే, పింక్ అంటే అమ్మాయిల రంగు, బ్లూ అంటే అబ్బాయిల రంగు అనేది మన సమాజంలో ఒక బలమైన నియమంగా మారిపోయింది. ఎంతలా అంటే.. మగవారు కనీసం పింక్ కలర్ షర్ట్ వేసుకోవడానికి కూడా వెనుకాడే అంతలా. కనీ, అసలు.. ఈ రెండు రంగుల్లో పింక్ అమ్మాయిలకు, బ్లూ అబ్బాయిలకు అని ఎవరు ఫిక్స్ చేశారు? దీని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒకప్పుడు పింక్ అబ్బాయిలకే సొంతం..
Image Credit : geminiai

ఒకప్పుడు పింక్ అబ్బాయిలకే సొంతం..

1900ల ప్రారంభంలో అమెరికా, యూరప్ లలోని ప్రముఖ ఫ్యాషన్ మ్యాగ్నజైన్లు పింక్ రంగు అబ్బాయిలకు పర్ఫెక్ట్ అని, బ్లూ కలర్ అమ్మాయిలకు అనుకూలం అని చెప్పారు. దానికి ఒక బలమైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది.

పింక్.. 'రెడ్' కలర్ అంటే రక్తం, యుద్ధం, అగ్రెసివ్ నేచర్, పవర్‌కి ప్రతీక. ఆ రెడ్ రంగు నుంచే పింక్ పుట్టుకొచ్చింది. ఇందులో ఉండే తీవ్రత, బలం మగవారి తత్వానికి సరిపోతాయని, అందుకే పింక్ అబ్బాయిల రంగు అని భావించేవారు.

బ్లూ : 'బ్లూ' రంగు చూడగానే ప్రశాంతత, స్వచ్ఛత, నాజూకుతనం గుర్తుకొస్తాయి. అందుకే బ్లూ రంగును అమ్మాయిల మనస్తత్వానికి కనెక్ట్ చేశారు.

33
మరి, ఇది ఎలా మారింది...?
Image Credit : geminiai

మరి, ఇది ఎలా మారింది...?

మరి ఇంతగా అనుసరించిన ఈ విధానం అకస్మాత్తుగా ఎలా మారిపోయిందో తెలుసా? దీని వెనుక ఉన్నది ఏ శాస్త్రీయ కారణమో కాదు.. కేవలం బట్టల కంపెనీల 'మార్గెటింగ్ స్టంట్' కూడా ఉంది.

1940ల కాలంలో పెద్ద పెద్ద దుస్తుల తయారీ సంస్థలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్లు తమ వ్యాపారాన్ని, లాభాలను పెంచుకోవడానికి ఒక కొత్త ప్లాన్ వేశాయి. అంతకుముందు వరకు ఒకే ఇంట్లో ఉండే అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒకరి బట్టలు మరొకరు (జెండర్ న్యూట్రల్) వేసుకునేవారు. దీనివల్ల కంపెనీలకు సేల్స్ తగ్గేవి. ఈ పరిస్థితిని మార్చడానికి "పింక్ అమ్మాయిలది - బ్లూ అబ్బాయిలది" అని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఆఖరికి బొమ్మలు, బెడ్ షీట్లు, సబ్బుల నుంచి ప్రతీ వస్తువును ఈ రంగుల ఆధారంగానే విక్రయించడం ప్రారంభించాయి. ఒక అబ్బాయి పింక్ డ్రెస్ వేసుకుంటే విచిత్రంగా చూసేలా ప్రజలలో నెమ్మదిగా సైకాలజికల్ బ్రెయిన్ వాష్ చేశాయి.

ఒక్క మార్కెటింగ్ ట్రిక్.. ప్రపంచ ట్రెండ్!

కంపెనీలు స్వార్థంతో మొదలుపెట్టిన ఈ మార్కెటింగ్ గిమ్మిక్, కాలక్రమేణా ప్రపంచమంతటా ఒక బలమైన ఆచారంగా మారిపోయింది. ఈ రోజుకీ చాలామంది అబ్బాయిలు పింక్ కలర్ వేసుకోవడానికి సంకోచించడానికి కారణం శతాబ్దం కిందట జరిగిన ఈ వ్యాపార ట్రిక్కే కావడం గమనార్హం. అప్పటి నుంచి అమ్మాయిలు పింక్ కలర్, అబ్బాయిలు బ్లూ కలర్ వాడటం మొదలుపెట్టారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బంగారం పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
Indian Tourist Places: మనదేశంలోని ఈ టూరిస్ట్ ప్రాంతాలకు వెళితే స్విట్జర్లాండ్, మాల్దీవులు వెళ్లినంత ఫీల్ కలుగుతుంది
Recommended image3
Worlds Most Expensive Luxury Bus: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సు ఇదే.. ధర తెలిస్తే షాకే !
Related Stories
Recommended image1
Stars: ఆకాశంలో కాదు... భూమి మీద నక్షత్రాలు కనిపించే ఏకైక ప్రదేశం ఇది, ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image2
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved