MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Stars: ఆకాశంలో కాదు... భూమి మీద నక్షత్రాలు కనిపించే ఏకైక ప్రదేశం ఇది, ఎక్కడ ఉందో తెలుసా?

Stars: ఆకాశంలో కాదు... భూమి మీద నక్షత్రాలు కనిపించే ఏకైక ప్రదేశం ఇది, ఎక్కడ ఉందో తెలుసా?

Stars: ఆకాశంలో నక్షత్రాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వాటిని దూరం నుంచి మాత్రమే చూడగలం. కానీ, భూమి మీద నక్షత్రాలను అది కూడా మనం దగ్గర నుంచి చూసే అవకాశం ఉందని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 18 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భూమిపై నక్షత్రాలు..
Image Credit : geminiai

భూమిపై నక్షత్రాలు..

రాత్రిపూట ఆకాశంలో మెరుస్తూ కనిపించే నక్షత్రాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఒకేసారి, ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైకి వస్తే ఎలా ఉంటుంది? అది కూడా సముద్ర తీరంలో మీ పాదాల కింద మెరుస్తూ కనిపిస్తే ఇంకెంత అందంగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ నిజంగానే భూమిపై ఉంది.

సాధారణంగా మనం బీచ్ కి వెళ్తే.. తెల్లటి ఇసుక, చిన్న చిన్న పెంకులు, గవ్వలు కనిపిస్తాయి. కానీ, జపాన్ లోని ఓ బీచ్ కి వెళ్తే.. మనకు ఇసుకలో నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ బీచ్ ఇసుక సాధారణంగా అన్ని బీచ్ ల్లా ఉండదు. అచ్చం చిన్న చిన్న నక్షత్రాల ఆకారంలో ఆ బీచ్ లోని ఇసుక మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే, ఈ బీచ్ ని స్టార్ శాండ్ అని పిలుస్తారు. జపనీస్ లో హోషిజునా అని కూడా పిలుస్తారు. అసలు, నక్షత్రాలు భూమి మీద ఎలా కనిపిస్తాయి? ఒకటి, రెండు కాదు.. ఆ బీచ్ లోని ఇసుక మొత్తం ఈ నక్షత్రాలతోనే కనిపిస్తుంది.. అదెలా సాధ్యం..? దీని వెనక సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అసలు ఆ ఇసుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
Image Credit : geminiai

అసలు ఆ ఇసుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

సైన్స్ ప్రకారం ఇవి ఏ రాళ్లు రప్పలు నలగడం వల్ల ఏర్పడినవి కావు. ఇవి సముద్రంలో నివసించే 'ఫోరామినిఫెరా' (Foraminifera) అనే సూక్ష్మ జీవుల అస్థిపంజర అవశేషాలు. ఈ చిన్న జీవులు చనిపోయిన తర్వాత వాటి గట్టి కెంపైన పైభాగం లేదా పెంకులు అలల తాకిడికి కొట్టుకొచ్చి తీరానికి చేరుకుంటాయి. చూడటానికి అచ్చం చిన్న నక్షత్రాల లాంటి ఆకారంలో ఉండే ఈ రేణువులు ఆ ప్రాంతంలోని నీటిని కూడా ఎమరాల్డ్ గ్రీన్ (పచ్చని) రంగులో కనిపించేలా చేస్తాయి.

33
స్థానిక పురాణ గాథ:
Image Credit : geminiai

స్థానిక పురాణ గాథ:

ఇక స్థానికుల నమ్మకం ప్రకారం.. సముద్రంలో భారీ సర్పం తిని వదిలేసిన స్టార్ ఫిష్ పిల్లల ఎముకలే ఈ రూపంలో తీరానికి కొట్టుకొస్తాయని ఒక అందమైన నమ్మకం ప్రచారంలో ఉంది.

ఈ బీచ్ ఎక్కడుంది?

జపాన్‌లోని ఒకినావా ప్రిఫెక్చర్‌లోని యాయామా దీవులలో ఉన్న తకేటోమి ద్వీపంలోని కైజి బీచ్ (Star Sand Beach) దీనికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే ప్రకృతి అందాన్ని, ఆ వాతావరణాన్ని కాపాడుకోవడానికి టూరిస్టులు అక్కడి ఇసుకను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం కఠినంగా నిషేధించింది. ప్రకృతి తనలో దాచుకున్న ఈ అద్భుతమైన వింత నిజంగా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదూ!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Village: ఈ గ్రామంలోకి చెప్పులతో అడుగు పెడితే అంతే సంగతులు.. కలెక్టర్ అయినా చెప్పులు విప్పాల్సిందే
Recommended image2
Fruits: తెలుగు వారికి పోర్చుగీస్ వారు పరిచయం చేసిన పండు పేరేమిటో తెలుసా?
Recommended image3
Mirchi Capital: మనదేశ మిరపకాయల రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఇక్కడే ఉంది
Related Stories
Recommended image1
Frogs: ఈ దేశంలో పాలల్లో బతికి ఉన్న కప్పలు వేస్తారు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved