MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Urrak Drink : గోవా స్పెషల్ మందు 'ఉర్రక్'.. ఏడాదిలో కేవలం 8 వారాలే దొరుకుతుంది.. ఎందుకింత స్పెషల్..?

Urrak Drink : గోవా స్పెషల్ మందు 'ఉర్రక్'.. ఏడాదిలో కేవలం 8 వారాలే దొరుకుతుంది.. ఎందుకింత స్పెషల్..?

కేవలం దేశీయ మధ్యమే కాదు ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్స్ కూడా గోవాలో లభిస్తాయి. కానీ ఎప్పుడైనా గోవాలో మాత్రమే లభించే ‘ఉర్రక్’' రుచిచూశారా…? ఇది కేవలం 8 వారాలు మాత్రమే దొరుకుతుందట… ఎందుకింత ప్రత్యేకమో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : May 01 2026, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోవా స్పెషల్ డ్రింక్ ఏది..?
Image Credit : Gemini AI

గోవా స్పెషల్ డ్రింక్ ఏది..?

గోవా (GOA) ఈ పేరు వినగానే యువతలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అక్కడి బీచ్ ల అందాలు కనువిందు చేస్తాయి... అక్కడి కల్చర్ విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలిగిస్తుంది... మరీముఖ్యంగా అక్కడ మందు చాలా చౌకగా లభిస్తుంది... అందుకే స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ వెళ్లడాన్ని యువత ఇష్టపడతారు.

అయితే గోవాలో మందు చీఫ్ గా దొరుకుతుందని అందరికీ తెలుసు... కానీ కేవలం అక్కడ మాత్రమే దొరికే సాంప్రదాయ ఆల్కహాల్ గురించి తెలుసా...? అదే ఉర్రక్. ఇది కేవలం గోవాలో... అదీ వేసవిలోనే లభిస్తుంది. ఈ ఉర్రక్ డ్రింక్ ఇంత ప్రత్యేకం ఎందుకో తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కేవలం 8 వారాలే లభించే మధ్యపానీయం...
Image Credit : Getty

కేవలం 8 వారాలే లభించే మధ్యపానీయం...

గోవా కల్చర్ భాగమైన 'ఉర్రక్' ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. మరికొద్దిరోజులు గడిస్తే ఇది లభించదు. ఎందుకంటే ఈ పానీయంను కేవలం లేత జీడిపండ్లు అదీ అప్పుడే కోసినవాటితో తయారుచేస్తారు. ఈ జీడిపండ్ల సీజన్ మార్చి, ఏప్రిల్... కాబట్టి ఈ రెండునెలల్లోనే ఉర్రక్ విరివిగా లభిస్తుంది.

లేత జీడిపండ్లను సేకరించి దాని రసంతో ఉర్రక్ తయారుచేస్తారు. దీన్ని అప్పటికప్పుడే తాగాల్సి ఉంటుంది... సమయం గడిచేకొద్ది రుచి తగ్గి పాడయిపోతుంటుంది. ఇలా త్వరగా పాడైపోతుంది కాబట్టే ఇది కేవలం కొన్ని వారాలు మాత్రమే లభిస్తుంది. అందుకే ఉర్రక్ గోవాలో చాలా అరుదైన డ్రింక్‌గా ఫేమస్.

Related Articles

Related image1
Alcohol: మందు తాగ‌డానికి స‌రైన స‌మ‌యం అదేనా? 8 PM బ్రాండ్ పేరు ఎందుకొచ్చింది.?
Related image2
Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?
35
ఉర్రక్ ఎలా తయారుచేస్తారు..?
Image Credit : Gemini AI

ఉర్రక్ ఎలా తయారుచేస్తారు..?

గోవాలో వేసవిలో కాసే జీడిపండ్ల నుండి రసాన్ని సేకరించి పులియబెడతారు. దీన్ని సాంప్రదాయ పద్దతులు ఉపయోగించి ఉర్రక్ పానీయాన్ని రెడీ చేస్తారు. దీని రుచి చాలా తాజాగా, పండ్ల ఫ్లేవర్‌తో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ఘాటైన 'ఫెని'కి పూర్తి భిన్నంగా ఉంటుంది.

ఈ డ్రింక్ గోవాలో ప్రతి ఏటా కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇలా కొద్ది కాలమే దొరకడం వల్ల స్థానికులకు, పర్యాటకులకు ఉర్రక్ తాగడం ఓ ప్రత్యేకమైన సంప్రదాయంగా మారింది.

బాటిళ్లలో అమ్మే ఇతర డ్రింక్స్‌లా కాకుండా, ఉర్రక్‌ను తయారు చేసిన వెంటనే తాగాలి. దీని సువాసన, రుచి త్వరగా పోతాయి. అందుకే ఇది గోవా దాటి బయటకు రావడం చాలా అరుదు… కేవలం అక్కడే లభిస్తుంది. 

45
ఉర్రక్ ను మరింత రుచిగా మార్చండి...
Image Credit : Getty

ఉర్రక్ ను మరింత రుచిగా మార్చండి...

గోవాలో చాలామంది స్థానికులు ఉర్రక్‌ను చల్లగా సోడా, నిమ్మరసం, పచ్చిమిర్చితో కలిపి తాగుతారు. గోవాలోని వేడి, తేమ వాతావరణంలో ఈ కాంబినేషన్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

ఉర్రక్ కేవలం ఓ డ్రింక్ మాత్రమే కాదు, గోవా ఆహార సంస్కృతిని, వ్యవసాయాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి గ్లాసులోనూ ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే ఓ సంప్రదాయం కనిపిస్తుంది.

55
ఉర్రక్ ఆరోగ్య ప్రయోజనాలు..
Image Credit : Getty

ఉర్రక్ ఆరోగ్య ప్రయోజనాలు..

ఉర్రక్ మత్తునిచ్చే పానీయం కాదు... ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే డ్రింక్. జీడిపళ్లలో విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటితో తయారుచేసిన ఉర్రక్ తాగడంవల్ల శరీరానికి ఇవి లభిస్తాయి.

ఇక వేసవికాలంలో ఈ ఉర్రక్ శరీరాన్ని చల్లబరుస్తుంది... తద్వారా వేడి నుండి ఉపశమనం పొందవచ్చు. వేడిగాలులు, ఉక్కపోత కారణంగా వడదెబ్బ బారిన పడకుండా ఈ గోవా కల్చరల్ డ్రింక్ ఉర్రక్ ఉపయోగపడుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Recommended image2
Fastest Animals : అబ్బా ఏం స్పీడ్ రా బాబు! బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే
Recommended image3
Sukanya Samriddhi Yojana : మీ కూతురి కోసం సుకన్య స్కీమ్ లో కట్టిన డబ్బు.. 21 ఏళ్లకు ముందే తీసుకోవచ్చా?
Related Stories
Recommended image1
Alcohol: మందు తాగ‌డానికి స‌రైన స‌మ‌యం అదేనా? 8 PM బ్రాండ్ పేరు ఎందుకొచ్చింది.?
Recommended image2
Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved