MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Sukanya Samriddhi Yojana : మీ కూతురి కోసం సుకన్య స్కీమ్ లో కట్టిన డబ్బు.. 21 ఏళ్లకు ముందే తీసుకోవచ్చా?

Sukanya Samriddhi Yojana : మీ కూతురి కోసం సుకన్య స్కీమ్ లో కట్టిన డబ్బు.. 21 ఏళ్లకు ముందే తీసుకోవచ్చా?

మీ కూతురు పేరిట సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులు జమ చేస్తున్నారా..? అయితే మధ్యలో అవసరమైనప్పుడు ఈ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా..? . 21 ఏళ్లు ఆగాల్సిందేనా..? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. మరి ఈ స్కీమ్ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 23 2026, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏమిటీ సుకన్య సమృద్ధి యోజన..?
Image Credit : Getty

ఏమిటీ సుకన్య సమృద్ధి యోజన..?

తమ ఇంటి ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు చాలామంది తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను ఎంచుకుంటున్నారు. ఎక్కువ వడ్డీ, తక్కువ మొత్తంలో దీర్ఘకాలిక పొదుపు అవకాశం, ప్రభుత్వ సపోర్ట్ ఉండటంతో ఈ స్కీమ్‌పై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అయితే ఈ స్కీమ్ లో జమచేసిన డబ్బులు ముందుగానే అంటే అమ్మాయి 21 ఏళ్లు నిండకముందే విత్ డ్రా తీసుకోవచ్చా..? అనేదే ఇప్పుడు అందరిలోనూ ఉన్న పెద్ద సందేహం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెచ్యూరిటీ కంటే ముందే సుకన్య డబ్బులు తీసుకోవచ్చా..?
Image Credit : iSTOCK

మెచ్యూరిటీ కంటే ముందే సుకన్య డబ్బులు తీసుకోవచ్చా..?

సాధారణంగా సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక దీర్ఘకాలిక పొదుపు పథకం. అకౌంట్ తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యాకే పూర్తిమొత్తం మెచ్యూర్ అవుతుంది… అంటే జమచేసిన డబ్బులు, వడ్డీ డబ్బులు చేతికి వస్తాయి. 

చాలామంది అనుకున్నట్లు ఇది మామూలు సేవింగ్స్ అకౌంట్ కాదు. మనకు కావాల్సినప్పుడు డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇందులో ఉండదు… సుకన్య యోజన స్కీమ్ నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

Related Articles

Related image1
Sukanya samriddhi yojana: మీ బిడ్డ కోసం సుకన్య సమృద్ధి యోజన మొదలుపెట్టారా? ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Related image2
Sukanya Samriddhi Yojana: నెలకు రూ.250 కడితే చాలు 21 ఏళ్లకు మీ కూతురు లక్షాధికారి అవుతుంది. ఎలాగంటే..
35
 ఉన్నత చదువుల కోసం తీసుకోవచ్చు..
Image Credit : Getty

ఉన్నత చదువుల కోసం తీసుకోవచ్చు..

అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమె ఉన్నత చదువుల కోసం అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాలేజీ అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బును వాడుకోవచ్చు. దీనికోసం అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు వివరాలు వంటి డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

45
 అకౌంట్ క్లోజ్ చేసినా డబ్బులు పొందవచ్చు..
Image Credit : Gemini

అకౌంట్ క్లోజ్ చేసినా డబ్బులు పొందవచ్చు..

మరో ముఖ్యమైన విషయం అకౌంట్‌ను ముందుగానే క్లోజ్ చేసినా డబ్బులు పొందవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేస్తే, కొన్ని నిబంధనల ప్రకారం అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు అనుమతిస్తారు. అంతేకాదు అకౌంట్ హోల్డర్ చనిపోయినా లేదా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అకౌంట్‌ను ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు ముందుగానే డబ్బులు పొందవచ్చు. 

55
ప్రభుత్వ పొదుపు పథకంతో ఆడపిల్లలకు భరోసా..
Image Credit : Getty

ప్రభుత్వ పొదుపు పథకంతో ఆడపిల్లలకు భరోసా..

చాలామంది తల్లిదండ్రులు సుకన్య స్కీమ్‌ను 'డబ్బులు వేసి మర్చిపోయే పొదుపు' అనుకుంటారు. కానీ ఇందులో చాలా రూల్స్ ఉన్నాయి. అందుకే డబ్బు పెట్టే ముందూ, మధ్యలో డబ్బు తీయాలనుకున్నా.. ఈ స్కీమ్ కండిషన్స్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన సమాచారంతో ముందుకెళ్తే సుకన్య సమృద్ధి యోజన మీ కూతురి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image2
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
Sukanya samriddhi yojana: మీ బిడ్డ కోసం సుకన్య సమృద్ధి యోజన మొదలుపెట్టారా? ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Recommended image2
Sukanya Samriddhi Yojana: నెలకు రూ.250 కడితే చాలు 21 ఏళ్లకు మీ కూతురు లక్షాధికారి అవుతుంది. ఎలాగంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved