MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • UPI Rules : యూపిఐ పేమెంట్స్ లో 'గోల్డెన్ అవర్' .. ఏమిటీ కొత్త రూల్..?

UPI Rules : యూపిఐ పేమెంట్స్ లో 'గోల్డెన్ అవర్' .. ఏమిటీ కొత్త రూల్..?

సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపిఐ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్ తీసుకువస్తోంది. ఈ రూల్ ఏమిటి..? దీనివల్ల సైబర్ నేరాలు ఆగుతాయా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 11 2026, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇకపై యూపిఐ పేమెంట్స్ మరింత సేఫ్..
Image Credit : Asianet News

ఇకపై యూపిఐ పేమెంట్స్ మరింత సేఫ్..

UPI New Rules : డిజిటల్ లావాదేవీల వేగం కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారుతోంది. యూపిఐ పేమెంట్స్ వేగం పెరిగేకొద్ది సైబర్ నేరగాళ్లు అంతే వేగంగా బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటివాటి ద్వారా క్షణాల్లో నగదు బదిలీ చేయవచ్చు... అయితే ఒక్కసారి డబ్బు బదిలీ అయ్యాక వెనక్కి తీసుకోలేం. ఇదే సైబర్ నేరగాళ్ళు అమాయకులను ఆర్థికంగా మోసంచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూపిఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. సైబర్ నేరగాళ్ల బారినపడిన బాధితులు వెంటనే స్పందిస్తే కోల్పోయిన సొమ్మును వెనక్కి తెచ్చుకునే 'గోల్డెన్ అవర్' (Golden Hour) అవకాశాన్ని ఆర్బీఐ కల్పించబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏమిటీ గోల్డెన్ అవర్ రూల్..?
Image Credit : PR

ఏమిటీ గోల్డెన్ అవర్ రూల్..?

ఇప్పటివరకు యూపీఐ అంటే 'క్లిక్ - సెండ్ - డన్'.. అంటే ఒక్క క్లిక్ తో వెంటనే డబ్బులు బదిలీ అయిపోతాయన్నమాట. అయితే ఇకపై ఇలా కాదు... కొన్ని యూపిఐ పేమెంట్స్ విషయంలో 'క్లిక్ - వెయిట్ - వెరిఫై - డన్' అనే సూత్రం అమలులోకి రానుంది. అంటే డబ్బులు బదిలీ అయ్యేందుకు సమయం పడుతుంది... దీంతో ఏదైనా మోసం జరిగినట్లు గ్రహిస్తే వెంటనే అలర్ట్ కావచ్చు. లావాదేవీని నిలిపివేయవచ్చు. ఇలా ఇకపై రూ.10000 కంటే ఎక్కువ డబ్బులు యూపిఐ ద్వారా బదిలీ కావాలంటే గంట సమయం పడుతుంది... ఇదే 'గోల్డెన్ అవర్' రూల్.

Related Articles

Related image1
UPI: మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఉందా.? మీ చేతిలో రూ. 5 వేలు ఉన్న‌ట్లే.
Related image2
UPI: ఇక ఫోన్‌పేలో డ‌బ్బులు ఉచితంగా పంప‌లేమా.. ఆ లిమిట్ దాటితే ఛార్జీలు.?
35
 ఎందుకు ఈ గంట విరామం..?
Image Credit : Getty

ఎందుకు ఈ గంట విరామం..?

సాధారణంగా సైబర్ నేరగాళ్ళ ప్రధాన అస్త్రమే వేగం. ఎంత తొందరగా అమాయకుల నుండి డబ్బులు తమ ఖాతాల్లో బదిలీ చేసుకుంటే అంత లాభమని భావిస్తారు. కాబట్టి సైబర్ మోసానికి గురైన వ్యక్తి ఆ నిజాన్ని గ్రహించేలోపే డబ్బు పది చేతులు మారిపోతోంది. ఇలా జరక్కుండా ఉండేందుకే గోల్డెన్ అవర్ రూల్ తీసుకువస్తున్నారు. ఈ 60 నిమిషాల సమయం సైబర్ మోసాల నుండి 'అలర్ట్' అయ్యే సమయాన్నిస్తుంది. ఒకవేళ పొరపాటున డబ్బులు పంపినా లేదా మోసపోయామని తెలిసినా ఆ గంటలోపు లావాదేవీని ఆపేసే వెసులుబాటు కలుగుతుంది.

45
ఈ రూల్ తో ఎవరికి ఇబ్బంది.. ఎవరికి ఊరట..?
Image Credit : Gemini AI

ఈ రూల్ తో ఎవరికి ఇబ్బంది.. ఎవరికి ఊరట..?

1. రెగ్యులర్ లావాదేవీలు : మీరు రోజూ చేసే రీఛార్జ్‌లు, కరెంట్ బిల్లులు లేదా ఇప్పటికే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారితో చేసే ఆర్థిక లావాదేవీలకు ఈ గోల్డెన్ అవర్ రూల్ వర్తించదు. కాబట్టి మీ నిత్యావసరాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.

2. అపరిచిత లావాదేవీలు : కొత్త వ్యక్తికి లేదా మొదటిసారి పెద్ద మొత్తంలో డబ్బులు (₹10k+) పంపేటప్పుడు మాత్రమే ఈ 'హోల్డ్' పీరియడ్ ఉంటుంది. ఇది ముఖ్యంగా 'అర్జెంట్' అని నమ్మించి మోసం చేసే కేటుగాళ్ల పాలిట శాపంగా మారనుంది.

55
సైబర్ క్రైమ్స్ కి చెక్ మేట్..
Image Credit : Gemini

సైబర్ క్రైమ్స్ కి చెక్ మేట్..

సైబర్ నేరాల విషయంలో చాలామంది బాధితులు తమ అకౌంట్లోంచి డబ్బు కట్ అయిన 15-20 నిమిషాల తర్వాత గానీ మోసపోయామని గుర్తించలేకపోతున్నారు. ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ గోల్డెన్ అవర్ రూల్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి పోలీసులకు, బ్యాంకులకు ఒక బలమైన ఆయుధం కాబోతోంది.

అయితే ప్రస్తుతం ఈ గోల్డెన్ అవర్ నిబంధన ప్రయోగదశలో ఉంది... మే 8 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే డిజిటల్ ఇండియాలో 'భయం లేని లావాదేవీల' కొత్త శకం మొదలైనట్లే..!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం
పర్సనల్ పైనాన్స్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Recommended image2
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image3
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
UPI: మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఉందా.? మీ చేతిలో రూ. 5 వేలు ఉన్న‌ట్లే.
Recommended image2
UPI: ఇక ఫోన్‌పేలో డ‌బ్బులు ఉచితంగా పంప‌లేమా.. ఆ లిమిట్ దాటితే ఛార్జీలు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved