MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UPI: ఇక ఫోన్‌పేలో డ‌బ్బులు ఉచితంగా పంప‌లేమా.. ఆ లిమిట్ దాటితే ఛార్జీలు.?

UPI: ఇక ఫోన్‌పేలో డ‌బ్బులు ఉచితంగా పంప‌లేమా.. ఆ లిమిట్ దాటితే ఛార్జీలు.?

UPI: ప్ర‌స్తుతం ప్ర‌తీ ఒక్క‌రూ యూపీఐ పేమెంట్స్ ఉప‌యోగిస్తున్నారు. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్ వ‌ర‌కు యూపీఐ పేమెంట్స్ స్వీక‌రిస్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉచితంగా ఉన్న ఈ సేవలకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 24 2026, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైర‌ల్ అవుతోన్న న్యూస్
Image Credit : Getty

వైర‌ల్ అవుతోన్న న్యూస్

సోష‌ల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్క‌ర్లు కొడుతోంది. త్వ‌ర‌లోనే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్‌పై ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్నార‌నేది స‌ర‌దు వార్త సారాంశం. ముఖ్యంగా రూ. 1000కిపైగా చేసే లావాదేదీల‌పై ఛార్జీలు ప‌డ‌నున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై భారత ప్రభుత్వంతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేశాయి. UPI ద్వారా చేసే లావాదేవీలపై సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని తేల్చి చెప్పింది. ఎంత పంపించినా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించే ప్రణాళిక కూడా లేదని ప్రభుత్వం తెలిపింది.

25
UPI ట్రాన్సాక్షన్లపై RBI ఏం చెప్పింది?
Image Credit : PR

UPI ట్రాన్సాక్షన్లపై RBI ఏం చెప్పింది?

ఇటీవల ఈ విషయం పై వస్తున్న వార్తలపై RBI కూడా స్పందించింది. UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించేలా ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన లేదని RBI తెలిపింది. అయితే పేమెంట్ సిస్టమ్‌ల నిర్వహణకు కొంత ఖర్చు ఉంటుందని, భవిష్యత్తులో ఆపరేషన్ ఖర్చులను ఎలా నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. కానీ UPI ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు విధించే తేదీ లేదా ప్రణాళిక ఏదీ ప్రకటించలేదు.

Related Articles

Related image1
Mini AC: కిర్రాక్ ఆఫ‌ర్‌.. రూ. 2 వేల‌కే ఏసీ. ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా
Related image2
Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెల‌కు లక్ష సంపాదించొచ్చు
35
NPCI ప్రకారం ఎప్పుడు ఛార్జీలు ఉండొచ్చు?
Image Credit : Google

NPCI ప్రకారం ఎప్పుడు ఛార్జీలు ఉండొచ్చు?

NPCI ప్రకారం సాధారణంగా బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు UPI ద్వారా డబ్బు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఛార్జీలు ఉండొచ్చు. ఉదాహరణకు బ్యాంక్ ఖాతా నుంచి డిజిటల్ వాలెట్ (PPI) కు డబ్బు పంపితే ఆ ట్రాన్సాక్షన్ రూ. 2000 కంటే ఎక్కువ అయితే అప్పుడు కొంత ఫీజు ఉండొచ్చు. అయితే ఈ ఛార్జీలు కస్టమర్‌పై కాకుండా వ్యాపారులు లేదా పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై పడతాయి.

45
UPI ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత?
Image Credit : Google

UPI ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత?

ప్రస్తుతం చాలా UPI ట్రాన్సాక్షన్లకు రోజుకు రూ. 1 లక్ష వరకు పరిమితి ఉంది. కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో మాత్రం ఈ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి సేవల కోసం రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది. ఈ పరిమితి భద్రత కోసం మాత్రమే పెట్టారు. ఈ లిమిట్ దాటితే ఛార్జీలు పడతాయనే అర్థం కాదు.

55
UPI ఛార్జీలపై రూమర్లు ఎందుకు వస్తున్నాయి?
Image Credit : Asianet News

UPI ఛార్జీలపై రూమర్లు ఎందుకు వస్తున్నాయి?

UPI చెల్లింపుల సమయంలో వ్యాపారులకు NPCI కొన్ని ఇంటర్‌చేంజ్ ఫీజులు విధిస్తుంది. కొంతమంది వ్యాపారులు ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చెప్పడంతో, అది తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించాయి. దీంతో రూ. 1000కి పైగా ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు వస్తాయనే రూమర్లు పెరిగాయి. మొత్తం యూపీఐ ద్వారా డబ్బు పంపితే వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. రూ. 1000 దాటితే ఫీజు పడుతుందన్న వార్తలు పూర్తిగా తప్పు. కొన్ని వాలెట్ లేదా వ్యాపారి ట్రాన్సాక్షన్లలో మాత్రమే ఫీజులు ఉండొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్‌ను నమ్మకుండా ప్రభుత్వం, RBI, NPCI అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెల‌కు లక్ష సంపాదించొచ్చు
Recommended image2
Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి
Recommended image3
Mini AC: కిర్రాక్ ఆఫ‌ర్‌.. రూ. 2 వేల‌కే ఏసీ. ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా
Related Stories
Recommended image1
Mini AC: కిర్రాక్ ఆఫ‌ర్‌.. రూ. 2 వేల‌కే ఏసీ. ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా
Recommended image2
Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెల‌కు లక్ష సంపాదించొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved