MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Tourist Scam: యూరోపియన్ యూనియన్‌నే బురిడీ కొట్టించాడు.. ఇటలీలో బయటపడ్డ విచిత్రమైన స్కామ్

Tourist Scam: యూరోపియన్ యూనియన్‌నే బురిడీ కొట్టించాడు.. ఇటలీలో బయటపడ్డ విచిత్రమైన స్కామ్

Fake Historical Site Scam: ఇటలీలో పేపర్లతో నకిలీ రోమన్ థియేటర్ కట్టి, అసలైనదని నమ్మించి కోట్లు నొక్కేశాడు ఒక కేటుగాడు. జూలియట్ ఇక్కడే ఉండేదంటూ కొత్త కథతో నకిలీ పర్యాటక ప్రాంతంతో మైండ్ బ్లాక్ అయ్యే మోసం ఇప్పుడు బయటపడింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 26 2026, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రూ.4 వేల టికెట్.. నకిలీ చారిత్రక ప్రదేశం! ఇటలీలో బిగ్ స్కామ్
Image Credit : Gemini

రూ.4 వేల టికెట్.. నకిలీ చారిత్రక ప్రదేశం! ఇటలీలో బిగ్ స్కామ్

పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి? సరిగ్గా ఇలాంటి ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు ఒక కేటుగాడు. ప్లాస్టిక్, ఫైబర్, పేపర్లతో ఒక నకిలీ రోమన్ థియేటర్ కట్టేశాడు. అది వేల ఏళ్ల నాటి చారిత్రక ప్రదేశమని నమ్మించి పర్యాటకుల దగ్గర నుంచి వేలకు వేలు గుంజాడు. చివరికి అసలు విషయం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. ఈ విచిత్రమైన ఉదంతం ఇటలీలో వెలుగు చూసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేల ఏళ్ల నాటి చరిత్ర అని బురిడీ
Image Credit : Chatgpt

వేల ఏళ్ల నాటి చరిత్ర అని బురిడీ

రిపోర్టుల ప్రకారం.. ఈ విచిత్రమైన మోసం ఇటలీలోని విచెంజా నగరం సమీపంలో జరిగింది. ఫ్రాంకో మాలోసో 'వాన్ రోజెన్‌ఫ్రాంజ్' అనే 69 ఏళ్ల వ్యక్తి ఈ కథనంతటికీ సూత్రధారి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రోమన్ యాంఫీథియేటర్‌ను (ఓపెన్ ఎయిర్ థియేటర్) తాను కనుగొన్నానని ఈ కేటుగాడు ప్రచారం చేసుకున్నాడు. అది క్రీస్తు శకం 393 కంటే ముందటిదని గట్టిగా చెప్పేవాడు. నిజానికి అదంతా అతను సొంతంగా తయారు చేసుకున్న సెట్టింగ్ అని ఎవరూ ఊహించలేకపోయారు.

Related Articles

Related image1
CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
Related image2
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
34
టికెట్ ధర రూ. 4 వేలు.. కల్పిత కథలు
Image Credit : our own

టికెట్ ధర రూ. 4 వేలు.. కల్పిత కథలు

ఈ ప్రదేశాన్ని చూడటానికి వచ్చే ప్రతి పర్యాటక విజిటర్ నుంచి ఫ్రాంకో ఏకంగా 35 పౌండ్లు (మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.4,000) ఎంట్రీ ఫీజుగా వసూలు చేసేవాడు. అక్కడికి వచ్చే పర్యాటకులకు రాతి స్తంభాలు, రాతి మెట్లు, పురాతన విగ్రహాలు, పక్కనే ఉన్న సరస్సును చూపిస్తూ బిల్డప్ ఇచ్చేవాడు. విజిటర్స్ పూర్తిగా నమ్మడానికి పెద్ద పెద్ద కల్పిత కథలు కూడా చెప్పేవాడు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కూడా ఈ ప్రదేశానికి వచ్చేవారని చెప్పేవాడు. అంతేకాదు, ప్రసిద్ధ నాటకం 'రోమియో అండ్ జూలియట్' లోని జూలియట్ కాపులెట్ తన యంగేజ్ ను ఈ ప్రదేశంలోనే గడిపిందని కథలు అల్లేశాడు.

ఈయూ యాప్‌లోనూ చోటు

ఫ్రాంకో తనను తాను ఒక సామాజిక కార్యకర్తగా, వ్యాపారవేత్తగా, ఆర్కెస్ట్రా కండక్టర్ అని చెప్పుకునేవాడు. అతను చెప్పే కథలు ఎంత ప్రభావవంతంగా ఉండేవి అంటే.. స్థానిక అధికారులు కూడా అతని మాటలు నమ్మి మోసపోయారు. చివరికి ఈ నకిలీ ప్రదేశాన్ని యూరోపియన్ యూనియన్ ఫండ్ చేసిన ఒక అధికారిక టూరిజం యాప్‌లో కూడా చేర్చారంటే అతను ఏ స్థాయిలో బురిడీ కొట్టించాడో అర్థం చేసుకోవచ్చు. 2005లో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రాచీన ప్రాంతం బయటపడిందని, ఇక్కడ గ్రీక్, రోమన్ కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రచారం చేశాడు.

44
అసలు రంగు బయటపడిందిలా..
Image Credit : Chatgpt

అసలు రంగు బయటపడిందిలా..

అయితే 2016లో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ ప్రారంభించారు. పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగి పరిశోధించగా అసలు కుట్ర బయటపడింది. అక్కడ ఉన్న ఏ ఒక్క నిర్మాణం కూడా పురాతనమైనది కాదని తేలింది. విగ్రహాలు, స్తంభాలు అన్నీ ఫైబర్ గ్లాస్, పేపర్-మాషే వంటి ఆధునిక వస్తువులతో తయారు చేసినవి. పాతవిగా కనిపించడానికి వాటికి అలా రంగులు వేశారు. అక్కడ ఉన్న సరస్సును, కొండను కూడా అతనే సొంతంగా సమతలం చేయించాడని విచారణలో తేలింది.

పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం.. చివరకు జైలు శిక్ష

మాఫియా తనపై దాడి చేసిందని, కొడుకు తప్పిపోయాడని రకరకాల డ్రామాలు ఆడినా ఫ్రాంకోను చట్టం వదిలిపెట్టలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. ఫ్రాంకో మాలోసోకి రెండు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష, 3,000 యూరోల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, అక్కడ ఉన్న నకిలీ నిర్మాణాలన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణం, నకిలీ కళాఖండాల తయారీ వంటి ఆరోపణలు నిరూపితం కావడంతో అతనికి ఈ శిక్ష పడింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్‌లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?
Recommended image2
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Recommended image3
ర‌మ్ వ‌ర్సెస్ విస్కీ... ఈ రెండింటి మ‌ధ్య అస‌లు తేడా ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
Recommended image2
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved