MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే

EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే

EPFO New Rules 2026: ఈపీఎఫ్‌ఓ 2026లో 5 కొత్త రూల్స్ తెచ్చింది. క్లెయిమ్ సెటిల్మెంట్, ఆటో ట్రాన్స్‌ఫర్, కేవైసీ ప్రాసెస్ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 23 2026, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌ఓ కొత్త అప్‌డేట్స్ చూశారా?
Image Credit : ChatGPT

పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌ఓ కొత్త అప్‌డేట్స్ చూశారా?

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) అనేది కేవలం ఒక సేవింగ్స్ అకౌంట్ మాత్రమే కాదు. ఈపీఎఫ్‌ఓ వారి భవిష్యత్తుకు పెద్ద ఆర్థిక భద్రత. అయితే చాలామందికి పీఎఫ్ క్లెయిమ్ ఆలస్యం కావడం, కేవైసీ ప్రాసెస్ కష్టంగా ఉండటం, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.

ఈ ఇబ్బందులను తీర్చడానికి ఈపీఎఫ్‌ఓ 2026లో పెద్ద మార్పులు చేసింది. తమ ఐటీ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. దీనివల్ల ఉమంగ్ యాప్, యునిఫైడ్ మెంబర్ పోర్టల్ సర్వర్లు రద్దీ సమయంలో కూడా డౌన్ కావు. ఇప్పుడు పాస్‌వర్డ్ రీసెట్ చేయడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయడం చాలా వేగంగా జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆటో సెటిల్మెంట్ సిస్టమ్: 3 నుంచి 4 రోజుల్లోనే డబ్బులు జమా
Image Credit : Gemini

ఆటో సెటిల్మెంట్ సిస్టమ్: 3 నుంచి 4 రోజుల్లోనే డబ్బులు జమా

గతంలో పీఎఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లోకి రావడానికి 7 నుండి 20 రోజుల సమయం పట్టేది. కానీ కొత్త ఆటో సెటిల్మెంట్ సిస్టమ్‌తో అర్హత ఉన్న క్లెయిమ్‌లు చాలా ఫాస్ట్‌గా పూర్తవుతున్నాయి. మీ డేటా అంతా సరగ్గా ఉంటే అనారోగ్యం, చదువు, పెళ్లి లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాల కోసం పెట్టే అడ్వాన్స్ క్లెయిమ్‌లు కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతాయి. మనుషుల ప్రమేయం లేకుండానే ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. దీనివల్ల క్లెయిమ్ డబ్బులు కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

36
సులభమైన పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ అండ్ ఎనీవేర్ సర్వీస్
Image Credit : Gemini AI

సులభమైన పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ అండ్ ఎనీవేర్ సర్వీస్

ఒక కంపెనీ వదిలి మరో కంపెనీలో చేరినప్పుడు పాత పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త అకౌంట్‌కి మార్చడం పెద్ద ప్రహసనంగా ఉండేది. పాత కంపెనీ ఆమోదం కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పడింది. మీరు ఉద్యోగం మారిన వెంటనే పాత పీఎఫ్ బ్యాలెన్స్ మీ యుఏఎన్ కింద కొత్త కంపెనీకి ఆటోమేటిక్‌గా లింక్, ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. మళ్లీ మళ్లీ ఆన్‌లైన్ ఫారమ్ 13 నింపాల్సిన పనిలేదు. అలాగే ఈపీఎఫ్‌ఓ 'ఎనీవేర్ సర్వీస్' ప్రారంభించింది. మీరు ఏ నగరంలో ఉన్నా, మీ ఇంటికి దగ్గరలోని ఏ ఈపీఎఫ్‌ఓ ఆఫీస్‌కైనా వెళ్లి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పాత రీజినల్ ఆఫీస్ పరిమితులు ఇక చెల్లవు.

46
సింపుల్ కేవైసీ అప్‌గ్రేడ్ ప్రాసెస్
Image Credit : Gemini AI

సింపుల్ కేవైసీ అప్‌గ్రేడ్ ప్రాసెస్

పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీయాలన్నా లేదా ప్రొఫైల్ వివరాలు మార్చాలన్నా కేవైసీ చాలా అవసరం. గతంలో పేరు స్పెల్లింగ్, పుట్టిన తేదీ లేదా తల్లిదండ్రుల పేర్లలో చిన్న తేడా ఉన్నా కేవైసీ రిజెక్ట్ అయ్యేది. కానీ ఈ కొత్త మార్పుల తర్వాత బ్యాంక్ వివరాలు, పాన్, ఇతర వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ఈజీగా మారింది. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయగానే సిస్టమ్ వెంటనే వెరిఫై చేస్తుంది. దీనివల్ల పెండింగ్ రిక్వెస్ట్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది.

56
కొత్త పెన్షన్ స్కీమ్ (EPFO 3.0) ప్లాన్స్
Image Credit : Asianet News

కొత్త పెన్షన్ స్కీమ్ (EPFO 3.0) ప్లాన్స్

భారత ప్రభుత్వం 'ఈపీఎఫ్‌ఓ 3.0' పేరుతో ఒక కొత్త పెన్షన్ రంగాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది కంట్రిబ్యూటరీ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ఉద్యోగి, యాజమాన్యం, ప్రభుత్వం, గిగ్ వర్కర్ల ప్లాట్‌ఫారమ్‌లు, సీఎస్ఆర్ ఫండ్స్ కలిసి భాగస్వామ్యం వహిస్తాయి. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి రాని గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫారమ్ వర్కర్లు, అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. ఇది టార్గెట్ రిటైర్మెంట్ సమ్ విధానంలో పనిచేస్తుంది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు కావాలో ముందే ప్లాన్ చేసుకోవచ్చు.

66
పీఎఫ్ ఖాతాలో 25% కనీస బ్యాలెన్స్ నిబంధన
Image Credit : Gemini AI

పీఎఫ్ ఖాతాలో 25% కనీస బ్యాలెన్స్ నిబంధన

పీఎఫ్ బ్యాలెన్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్ల దాదాపు 48.7 శాతం మంది ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయానికి తమ ఖాతాలో కేవలం 10,000 నుండి 20,000 రూపాయల బ్యాలెన్స్ మాత్రమే కలిగి ఉంటున్నారని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. ఈ సమస్యను నివారించడానికి జూలై 1, 2026 నుండి కొత్త ఈపీఎఫ్ స్కీమ్ అమల్లోకి వచ్చింది.

దీని ప్రకారం ప్రతి ఉద్యోగి తమ పీఎఫ్ ఖాతాలో మొత్తం జమ అయిన సొమ్ములో కనీసం 25% నిల్వ ఉంచడం తప్పనిసరి. 12 నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత చదువు, పెళ్లి, వైద్యం కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు, కానీ 25% బ్యాలెన్స్ మాత్రం ఖాతాలోనే ఉంచాలి. ఒక ఉద్యోగి నెలకు 15,000 జీతంతో 20 ఏళ్లు పనిచేస్తే దాదాపు 14 లక్షలు జమ అవుతాయి. మధ్యలో 75% తీసేసుకున్నా, చివర్లో 3.5 లక్షలు బ్యాలెన్స్ మిగులుతుంది. ఇది రిటైర్మెంట్ సమయానికి గొప్ప ఆర్థిక రక్షణనిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
Recommended image2
Thalliki Vandanam: తల్లికి వందనం రూ.13,000 డబ్బులు ఇంకా పడలేదా? నో టెన్షన్.. ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved