MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Motivational Story: బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి

Motivational Story: బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి

Motivational Story: ఉద్యోగం ముఖ్యమే కానీ అంతకన్నా ఆరోగ్యం, ప్రాణం ముఖ్యం. మనదేశంలో ఎంతోమంది ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్రమైన పనిఒత్తిడిని తట్టుకోలేక మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి ఆ ఉద్యోగం ఉంటేనే బతకగలరా? ఒక్కసారి ఆలోచించండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 26 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మానసికంగా కుంగిపోతున్న ఉద్యోగులు
Image Credit : Gemini AI

మానసికంగా కుంగిపోతున్న ఉద్యోగులు

ప్రపంచం వేగంగా మారిపోయింది. ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో పాటూ ఇతర ప్రైవేటు ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ప్రతిరోజూ డెడ్‌లైన్లు, టార్గెట్లు, నైట్ షిఫ్ట్‌లతో ఆరోగ్యం చెడిపోతోంది. ఇక అధికజీతాల ఆ ఉద్యాగాలను వదులుకోలేక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతో మంది ఉద్యోగులు. ఈ ఉద్యోగం పోతే నా జీవితం ముగిసిపోయినట్లే లేదా ఉద్యోగం తప్ప నాకు వేరే దిక్కు లేదు అనే భ్రమలోనే బతుకుతున్నారు. రోజుకు 14 నుండి 16 గంటలు పనిచేస్తే మానసికంగా కుంగిపోతున్నారు. ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల నిరాశ, డిప్రెషన్‌కు లోనై, చివరికి ప్రాణాలు తీసుకునేంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ మనిషి జీవితం ఒక కార్పొరేట్ కంపెనీ ఐడీ కార్డ్ కంటే చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చిన్న వ్యాపారం చేసుకోండి
Image Credit : Gemini AI

చిన్న వ్యాపారం చేసుకోండి

బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు అనే నానుడి ఊరికే పుట్టలేదు. జీవితంలో బతకడానికి వెయ్యి మార్గాలు ఉన్నాయి. అధిక జీతాలు, విలాసవంతమైన జీవితం కోసం ఆశపడి ఉన్న ప్రాణాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. లక్షల్లో జీతం ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగమే జీవితం కాదు. ఆ ఉద్యోగం ఊడినా, లేదా ఒత్తిడి తట్టుకోలేక వదిలేసినా సరే... మన ప్రతిభకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు. లేదా స్వయంగా చిన్న వ్యాపారం ప్రారంభించి గౌరవంగా జీవించవచ్చు. నెలకు వచ్చే కొన్ని లక్షల రూపాయల కన్నా మనశాంతిగా తింటూ కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో ఆనందకరమైనది. డబ్బు కోసం ఆరాటపడితే జీవితంలో మనశ్శాంతి దూరమైపోతుంది.

Related Articles

Related image1
Hindu Temple: హిందూ ఆలయాల్లో గడియారాలు ఎందుకుండవో తెలుసా?
Related image2
Human Fridge: మనుషుల ఫ్రిజ్ వచ్చేసింది, వేడిగా అనిపిస్తే అందులో కూర్చుంటే చాలు.. ధర ఎంతంటే?
33
ఉద్యోగమే జీవితం కాదు
Image Credit : Gemini AI

ఉద్యోగమే జీవితం కాదు

ఉద్యోగం అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ అదే పూర్తి జీవితం కాదు. అది లేకపోతే బతకలేమనే ఆలోచన నుంచి బయటికి రండి. మిమ్మల్ని నమ్ముకుని, మీ నవ్వును ప్రేమించే మీ తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలు ఉన్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు లేకపోతే కంపెనీలు మరో వ్యక్తిని ఆ స్థానంలో తెచ్చుకుంటాయి. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కాబట్టి పని ఒత్తిడి మిమ్మల్ని కుంగదీస్తుంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. అవసరమైతే ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రశాంతమైన మరొక ఆదాయ మార్గాన్ని ఎంచుకోండి. చావడంలో కాదు బతికి సాధించడంలోనే అసలైన గెలుపు ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Recommended image2
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image3
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
Hindu Temple: హిందూ ఆలయాల్లో గడియారాలు ఎందుకుండవో తెలుసా?
Recommended image2
Human Fridge: మనుషుల ఫ్రిజ్ వచ్చేసింది, వేడిగా అనిపిస్తే అందులో కూర్చుంటే చాలు.. ధర ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved