MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?

Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?

Free Education: భారత్‌లో చదువులు భారం అవుతున్నాయి. మరీ రూపాయి ఖర్చు లేకుండా ఉచిత విద్యను అందించే ప్రపంచ దేశాలు ఉన్నాయని మీకు తెలుసా? ఫ్రీగా చదువును అందించే ఆ దేశాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 07 2026, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఒక్క రూపాయి లేకుండా విదేశాల్లో చదువుకోండి.. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే దేశాలు ఇవే
Image Credit : Gemini

ఒక్క రూపాయి లేకుండా విదేశాల్లో చదువుకోండి.. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే దేశాలు ఇవే

మన దేశంలో నాణ్యమైన విద్యను పొందడం రోజురోజుకూ ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులు తమ పిల్లలను పెద్ద చదువులు చదివించడం ఒక కలగా మారుతోంది. ఎల్ కేజీ నుంచే ఇప్పుడు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

భారత్‌లోని చాలా స్కూళ్లు విదేశీ విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాయి. కానీ ఫీజులు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉచితంగా విద్యను అందించే దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఉచిత విద్యను అందిస్తున్న ఆ ప్రముఖ దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నార్వే, జర్మనీ
Image Credit : Chatgpt

నార్వే, జర్మనీ

నార్వేలో స్థానిక విద్యార్థులకే కాకుండా విదేశీ విద్యార్థులకు కూడా విద్య పూర్తి ఉచితం. ఇక్కడ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ (డాక్టరేట్) వరకు రూపాయి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అన్ని సదుపాయాలతో ఇక్కడ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోంది.

అలాగే జర్మనీలో కూడా ఉన్నత విద్య ఉచితంగా అందుతుంది. ఇక్కడ స్థానిక, అంతర్జాతీయ విద్యార్థులందరికీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా బోధన అందిస్తారు.

Related Articles

Related image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Related image2
Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ
36
ఫిన్‌లాండ్, స్వీడన్
Image Credit : abhyudayup.in

ఫిన్‌లాండ్, స్వీడన్

ఫిన్‌లాండ్ చిన్న యూరోపియన్ దేశమే అయినప్పటికీ, విద్యకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. యువతను ప్రోత్సహించడానికి బ్యాచిలర్స్, మాస్టర్స్ కోర్సులకు ఎటువంటి ఫీజు వసూలు చేయదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో ఉండే విధంగా ఇక్కడ సదుపాయాలు ఉంటాయి.

స్వీడన్ విషయానికి వస్తే, యూరోపియన్ యూనియన్ (EU), ఈఈఏ (EEA) ప్రాంతాల వారికి, శాశ్వత నివాసితులకు విద్య ఉచితం. ఇతర విదేశీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు.

46
ఆస్ట్రియా, ఫ్రాన్స్
Image Credit : Gemini AI

ఆస్ట్రియా, ఫ్రాన్స్

ఆస్ట్రియా పౌరులు ఏ డిగ్రీ లేదా కోర్సునైనా ఉచితంగా చదువుకోవచ్చు. ఇక్కడ చదువు అంతా కూడా ఉచితం. అలాగే, ఫ్రాన్స్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య దాదాపు ఉచితంగానే లభిస్తుంది. అయితే కొన్ని వర్సిటీలలో మాత్రం స్వల్పంగా ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

56
చెక్ రిపబ్లిక్, గ్రీస్
Image Credit : PR

చెక్ రిపబ్లిక్, గ్రీస్

చెక్ రిపబ్లిక్ తన పౌరులకు ఉచిత విద్యను అందిస్తుంది. అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడ ఉచితంగా చదవాలంటే ఆ దేశపు స్థానిక భాష అయిన 'చెక్' భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది.

గ్రీస్‌లో విద్య పూర్తిగా ఉచితం కాకపోయినప్పటికీ, ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. స్థానిక, విదేశీ విద్యార్థులు తక్కువ ఖర్చుతోనే తమ చదువులను పూర్తి చేయవచ్చు.

66
స్పెయిన్, ఇటలీ
Image Credit : Getty

స్పెయిన్, ఇటలీ

స్పెయిన్‌లో చదువుకోవడానికి విద్యార్థులు నామమాత్రపు రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం విద్యార్థుల ట్యూషన్ ఫీజులో 80 శాతాన్ని తానే భరిస్తుంది. అందానికి, ఫ్యాషన్‌కు పేరుగాంచిన ఇటలీలో కూడా విద్య ఉచితం. ఉన్నత విద్యకు ఫీజులు ఉన్నప్పటికీ, అవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. చాలా దేశాల నుంచి విద్యార్థులు చదువుల కోసం ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్లో ఇటలీ కూడా ఒకటి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Seed Ganesha Idols: చిరంజీవి మెచ్చిన సీడ్ గణేష.. సీడ్ వినాయకుడితో మనకు వచ్చే 5 మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ ఇవే
Recommended image2
Dogs: పెంపుడు కుక్కలు నిజంగానే మనిషిలో ఉన్న క్యాన్సర్ వ్యాధిని గుర్తుపడతాయా?
Recommended image3
Parrots: మీ ఇంట్లో పెంచుతున్న చిలుకలు ఆడవో, మగవో ఇలా సింపుల్ గా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Recommended image2
Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved