MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Dog Behavior : కుక్కలు బైక్, కారు టైర్లపైనే మూత్రం ఎందుకు పోస్తాయి?

Dog Behavior : కుక్కలు బైక్, కారు టైర్లపైనే మూత్రం ఎందుకు పోస్తాయి?

కుక్కలు తమ భూభాగాన్ని గుర్తించడానికి, ఇతర కుక్కలకు సంకేతాలు పంపడానికి వాహనాల టైర్లను ఎంచుకుంటాయి. ఈ ప్రవర్తన వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడం పెంపుడు జంతువుల యజమానులకు చాలా ముఖ్యం.  

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 07 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుక్కలు వాహనాలపై మూత్రం ఎందుకు పోస్తాయి?
Image Credit : Gemini AI

కుక్కలు వాహనాలపై మూత్రం ఎందుకు పోస్తాయి?

మనం ఇంటిముందు లేదంటే ఎక్కడైనా బయట బైక్ లేదా కారు పార్క్ చేసినప్పుడు టైర్లపై కుక్కలు మూత్రం పోయడం గమనిస్తుంటాం. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉన్నా కుక్కలు వాహనాల టైర్లపైనే ఈ పని చేస్తుంటాయి. కుక్కల ఈ వింత ప్రవర్తన వెనకున్న కారణాలేంటో తెలుసుకుందాం.

కుక్కలు తమ భూభాగాన్ని గుర్తించడానికి, ఇతర కుక్కలకు తమ ఉనికిని తెలియజేయడానికి మూత్రాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తాయి. వాహనాల టైర్లపై మూత్రం పోయడం ద్వారా ఓ సందేశాన్ని ఇతర కుక్కలకు చేరవేస్తాయట. ఇలా ఒక కుక్క టైర్‌పై మూత్రం పోయడం వెనక తన పరిధిని విస్తరింపజేసుకోవడమే ప్రధాన కారణం. ఇది వాటికి ఒక సహజసిద్ధమైన ప్రవృత్తి. ఈ ప్రవర్తన ముఖ్యంగా మగ కుక్కలలో ఎక్కువగా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుక్కలు నేలపై మూత్రం చేయడానకి ఎందుకు ఇష్టపడవు?
Image Credit : AI

కుక్కలు నేలపై మూత్రం చేయడానకి ఎందుకు ఇష్టపడవు?

వాహనాల టైర్లు చాలా ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి ఉంటాయి. గుండ్రంగా ఉండే టైర్ల ద్వారా కుక్కలు మూత్రం వాసనను విస్తృత ప్రదేశాలకు వ్యాపించేలా చేస్తాయి. రెండవది రబ్బరు వంటి టైర్ల పదార్థం వాసనను ఎక్కువ కాలం నిలుపుకుంటుంది.. దీని వలన సందేశం ఎక్కువ కాలం ఉంటుంది. మూడవది వాహనాలు కదులుతూ ఉండటం వల్ల టైర్లపై ఉన్న వాసన దూర ప్రాంతాలకు చేరుతుంది, ఇది కుక్కల వాసన సందేశాలను పంపే సామర్థ్యాన్ని పెంచుతుంది.  

నేలపై మూత్రం పోస్తే త్వరగా ఆరిపోవడం లేదా నీటి వల్ల కొట్టుకుపోవడం జరుగుతుంది. కానీ రబ్బరు టైర్ల ఉపరితలంపై మూత్రపు వాసన ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. కారు, బైక్ టైర్లు కుక్కల ముక్కు ఎత్తులోనే ఉంటాయి. వీటిపై మూత్రం పోయడం వల్ల ఆ వాసన నేలపై లాగా త్వరగా కొట్టుకుపోకుండా, ఇతర కుక్కలకు నేరుగా చేరుతుంది.

Related Articles

Related image1
Dog runs after bikes: బైకులు, సైకిల్ వెంట కుక్కలు ఎందుకు పరుగెడతాయి? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Related image2
Dog in School: పెంపుడు కుక్కను కిండర్ గార్డెన్ స్కూల్ చేర్పించిన మహిళ, ఫీజు ఎంతో తెలుసా?
35
మూత్రం ద్వారా కుక్కల సమాచారా మార్పిడి..
Image Credit : AI

మూత్రం ద్వారా కుక్కల సమాచారా మార్పిడి..

కుక్కల మూత్రం కేవలం వ్యర్థపదార్థం కాదు.. ఇది ఇతర కుక్కలకు అనేక రకాల సమాచారాన్ని అందించే ఒక సంక్లిష్టమైన "పీ-మెయిల్" వ్యవస్థ. మూత్రంలో ఉండే ఫెరోమోన్లు ఒక కుక్క వయస్సు, లింగం, ఆరోగ్య స్థితి, సంతానోత్పత్తి స్థితి, మానసిక స్థితి గురించి కీలకమైన వివరాలను వెల్లడిస్తాయి. ఉదాహరణకు ఒక మగ కుక్క మూత్రం ద్వారా ఆడ కుక్కను ఆకర్షిస్తుంది… సంతానోత్పత్తికి సంసిద్ధతను తెలుసుకోగలదు. టైర్లపై మూత్ర విసర్జన చేయడం ద్వారా, కుక్కలు తమ పరిసరాల్లోని ఇతర కుక్కలకు తమ ఉనికి గురించి, తమ ప్రస్థానం గురించి తెలియజేస్తాయి. డాగ్ బిహేవియర్ నిపుణులు ఈ సంభాషణ విధానాన్ని కీలకమైనదిగా భావిస్తారు.

45
కుక్కల ఆధిపత్య ప్రదర్శన
Image Credit : Asianet News

కుక్కల ఆధిపత్య ప్రదర్శన

కుక్కలు టైర్లపై మూత్రం పోయడంవెనకున్న మరో కారణం ఆధిపత్యపోరు. ఇది కేవలం భూభాగాన్ని గుర్తించడం మాత్రమే కాదు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, భద్రతను ధృవీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది.

కొన్ని సందర్భాలలో కొత్త వాతావరణంలో లేదా ఒత్తిడికి లోనైనప్పుడు కుక్కలు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తాయి. పెంపుడు కుక్కలు ఇలా ఎక్కువసార్లు మూత్రం చేస్తున్నాయంటే అవి ఇబ్బంది పడుతున్నట్లు అర్థం... యజమానులు ఈ విషయాన్ని గమనించాలి.

55
పెంపుడు కుక్కలను వాహనాలపై మూత్రం పోయకుండా నియంత్రించవచ్చా?
Image Credit : pinterest

పెంపుడు కుక్కలను వాహనాలపై మూత్రం పోయకుండా నియంత్రించవచ్చా?

పెంపుడు జంతువుల యజమానులకు కుక్కల ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు మూత్రం, మలవిసర్జన చేయడానికి తగిన సమయం, స్థలం ఇవ్వాలి. ఇది వాటి సహజ అవసరాన్ని తీర్చడానికి సహాయపడుతుంది. తరచుగా టైర్లపై మూత్ర విసర్జన చేసే కుక్కలను శిక్షణ ద్వారా నియంత్రించవచ్చు. ఉదాహరణకు వాటిని నిర్దిష్ట ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయడానికి ప్రోత్సహించండి. 

ఇక వాహన యజమానులు టైర్లను శుభ్రం చేయడం లేదా సిట్రస్ వంటి వాసనలు వెదజల్లే ద్రవాలను ఉపయోగించడం ద్వారా కుక్కలు ఆ ప్రాంతానికి రాకుండా నిరోధించవచ్చు. జంతు సంరక్షణ నిపుణులు కూడా ఈ పద్ధతులనే సూచిస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Snake: సైలెంట్‌గా మీ ఇంట్లోకి పాము వస్తే ఎలా గుర్తుపట్టాలో తెలుసా? 6 షాకింగ్ సంకేతాలు ఇవే
Recommended image2
Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ
Recommended image3
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Related Stories
Recommended image1
Dog runs after bikes: బైకులు, సైకిల్ వెంట కుక్కలు ఎందుకు పరుగెడతాయి? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Recommended image2
Dog in School: పెంపుడు కుక్కను కిండర్ గార్డెన్ స్కూల్ చేర్పించిన మహిళ, ఫీజు ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved