MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ

Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ

Success Story: అనాథాశ్రమంలో పెరిగి, రూ.5 కూలీగా పనిచేసి.. అమెరికాలో రూ. 1500 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలంగాణ మహిళ జ్యోతి రెడ్డి.. ఆమె ఇన్స్పైరింగ్ స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 06 2026, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టైపిస్ట్ ఉద్యోగం నుంచి గ్లోబల్ బిజినెస్ ఐకాన్ దాకా.. తెలంగాణ ఆడబిడ్డ సంచలన విజయం!
Image Credit : chatgpt

టైపిస్ట్ ఉద్యోగం నుంచి గ్లోబల్ బిజినెస్ ఐకాన్ దాకా.. తెలంగాణ ఆడబిడ్డ సంచలన విజయం!

జీవితం మనకు ఏమీ ఇవ్వనప్పుడు, మనమే దాన్ని సృష్టించుకోవాలి. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం జ్యోతి రెడ్డి. కుటుంబం ఉన్నా ఆదరించే స్థోమత లేక అనాథాశ్రమంలో పెరిగిన ఒక సాధారణ చిన్నారి.. నేడు అమెరికాలో రూ. 1500 కోట్ల ఐటీ కంపెనీకి బాస్ అంటే నమ్మగలరా? ఎటువంటి గాడ్ ఫాదర్, పెట్టుబడి లేకుండా కేవలం కష్టం, పట్టుదలతో చరిత్ర తిరగరాసిన జ్యోతి రెడ్డి స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అనాథలా గడిచిన చిన్నతనం.. 16 ఏళ్లకే పెళ్లి
Image Credit : Asianet News

అనాథలా గడిచిన చిన్నతనం.. 16 ఏళ్లకే పెళ్లి

1970లో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జ్యోతి రెడ్డి జన్మించారు. నలుగురు ఆడపిల్లల్లో అందరికంటే చిన్నది కావడం, పేదరికం కారణంగా తండ్రి ఆమెను అనాథాశ్రమంలో చేర్చారు. కనీస సౌకర్యాలు లేని చోట ఆమె బాల్యం గడిచింది. పదవ తరగతి వరకు ఎలాగోలా చదువుకున్న జ్యోతికి, 16 ఏళ్ల వయస్సులోనే తమ కంటే 10 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి చేశారు. 18 ఏళ్లకే ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయ్యారు.

Related Articles

Related image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Related image2
Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
35
రూ. 5 కూలీ పని నుంచి రాత్రి వేళ సెక్యూరిటీ గార్డ్‌గా..
Image Credit : freepik

రూ. 5 కూలీ పని నుంచి రాత్రి వేళ సెక్యూరిటీ గార్డ్‌గా..

కుటుంబ భారం, ఆంక్షలు తట్టుకోలేక 1980ల కాలంలో భర్తను వదిలేసి ఇద్దరు చిన్న పిల్లలతో బయటకు వచ్చేశారు జ్యోతి. మగవాళ్ల ప్రాబల్యం ఉన్న సమాజంలో ఒంటరిగా పోరాటం మొదలుపెట్టారు. పిల్లల ఆకలి తీర్చడానికి రోజుకు కేవలం 5 రూపాయల కూలీకి పొలాల్లో పనులు చేశారు. అంతటితో ఆగక, రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తూ, మిగిలిన సమయంలో ఇంటింటికీ తిరిగి చీరలు అమ్మేవారు. రోజులో ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా శ్రమించారు.

45
చదువుతో మారిన తలరాత.. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం
Image Credit : Instagram/usajyothi

చదువుతో మారిన తలరాత.. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం

అలసటను సైతం లెక్కచేయకుండా జ్యోతి చదువును కొనసాగించారు. టైపింగ్ నేర్చుకుని పాఠశాలలో ఉద్యోగం సంపాదించారు. 1992లో నెలకు రూ. 398 జీతంతో స్కూల్ టీచర్‌గా చేరి, పిల్లలను మిషనరీ స్కూల్‌లో చేర్పించారు. జీవితం కాస్త కుదుటపడినా, సాధించాల్సింది ఇంకా ఏదో ఉందనే తపన ఆమెను నిద్రపోనివ్వలేదు. అమెరికా నుంచి వచ్చిన కజిన్ ఇచ్చిన ధైర్యంతో ఎలాగైనా అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

55
అమెరికాలో ఐటీ సామ్రాజ్యం.. రూ. 1500 కోట్ల విజయం
Image Credit : Instagram/usajyothi

అమెరికాలో ఐటీ సామ్రాజ్యం.. రూ. 1500 కోట్ల విజయం

అమెరికా వెళ్లాక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే, వీసా ప్రాసెసింగ్‌లో ఉన్న డిమాండ్‌ను గుర్తించారు. వీసా కన్సల్టింగ్ కోసం ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసి సొంతంగా బిజినెస్ ప్రారంభించారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఫినిక్స్ నగరంలో 'కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్' (Key Software Solutions) అనే ఐటీ సంస్థను స్థాపించి, రూ. 1500 కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో 6 విలాసవంతమైన ఇళ్లు, భారతదేశంలో అనేక ఆస్తులు ఆమె సొంతం. లక్ష్యం బలంగా ఉంటే ఎలాంటి కష్టాలైనా దాటవచ్చని జ్యోతి రెడ్డి ప్రయాణం నిరూపిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Recommended image2
Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved