Husband Health: మీ భర్త హెల్తీగా ఉండాలంటే.. భార్యలు తప్పక తెలుసుకోవాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు
Husband Health: కుటుంబ భారాన్ని మోస్తూ, నిరంతరం శ్రమించే భర్త ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ప్రతి భార్య బాధ్యత. అందుకోసం ఫ్యామిలీ డాక్టర్లు సూచించే మంచి సమాచారంతో.. మీ భర్త ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి అలవాటు చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన నియమాలు
ఆహారంలో ప్రొటీన్‌ను అస్సలు మిస్ చేయకండి (Never Skip Protein)
మీ భర్త ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ భార్య పాటించవలసిన మొదటి సూత్రం ప్రోటీన్ ఫుడ్ అందించడం. ప్రతిరోజు వారి ఆహారంలో గుడ్లు, పప్పులు, పనీర్, చేపలు లేదా చికెన్ వంటి ప్రొటీన్ సమృద్ధిగా ఉండే పదార్థాలు ఉండేలా చూడాలి. ప్రొటీన్లు కండరాలను బలంగా ఉంచి, శరీరానికి అవసరమైన నిరంతర శక్తిని అందిస్తాయి.
ఫిజికల్ యాక్టివిటీ పెంచండి (Make Him Move)
భర్త ఆఫీస్ నుంచి వచ్చాక సోఫాకే పరిమితం కాకుండా, 'పదండి కాసేపు వాకింగ్‌కు వెళ్దాం' అంటూ ప్రోత్సహించాలి. కొన్నిసార్లు ప్రేమతో ఇచ్చే చిన్న ప్రోత్సాహమే శారీరక ఆరోగ్యానికి పెద్ద మందులా పనిచేస్తుంది. భర్త ఫిట్ గా ఉంటే ఫ్యామిలీని చూసుకునేు శక్తి వారికి వస్తుంది. ప్రేమగా చెప్పి భర్తను తోడుగా వాకింగ్ కు తీసుకెళ్లాలి.
సరైన నిద్ర ఉండేలా చూడండి (Protect His Sleep)
రాత్రివేళల్లో మొబైల్ ఎక్కువగా చూడకుండా నివారించి, రోజుకు 7 నుండి 9 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతీ మనిషి యాక్టీవ్ గా ఉండాలన్నా.. ప్రతీ మనిషికి సరైన నిద్ర చాలా అవసరం.
ముందస్తు హెల్త్ చెకప్‌లు (Don't Wait for Symptoms)
ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోయినా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు నిశ్శబ్దంగా పెరుగుతుంటాయి. మీ భర్త పని ఒత్తిడిలో మర్చిపోయినా సరే క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే నివారించవచ్చు.
మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం (Take Care of His Mental Health)
మగవారికి ఎన్నో సమస్యలు ఉన్నా.. ఇంటికి రాగానే భార్య ప్రేమగా పలకరిస్తే ఇట్టే మర్చిపోతారు. వారి ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పాల్సిన అవసరం లేదు. వారు చెప్పేది ఓపికగా, ప్రశాంతంగా వింటే చాలు. ఒత్తిడి తగ్గినప్పుడు శరీరం కూడా దానంతటదే ఆరోగ్యంగా ఉంటుంది.చిన్న చిన్న అలవాట్లే జీవితంలో పెద్ద మార్పులు తెస్తాయి. ఈ సూత్రాలను పాటించి మీ భాగస్వామి ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
