- Home
- Feature
- Ant Eater: రోజుకు 30 వేల చీమలను తినే వింత జీవి, 2 ముఖాలు, 3 కాళ్లతో తికమకపెట్టే జంతువు ఎక్కడుంటుంది?
Ant Eater: రోజుకు 30 వేల చీమలను తినే వింత జీవి, 2 ముఖాలు, 3 కాళ్లతో తికమకపెట్టే జంతువు ఎక్కడుంటుంది?
Ant Eater: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 వేల చీమలను బిర్యానీలా లాగించే జీవి గురించి మీకు తెలుసా? దాడి చేయడానికి వచ్చే శత్రువులను తికమకపెట్టి తిప్పలు పెట్టే వింత జీవి ఎక్కడుంటుంది. ఈ వింత జంతువు గురించి తెలుసుకోవల్సిన విషయాలు ఎన్నో?

తికమకపెట్టే వింత జంతువు..
చూడగానే రెండు తలలు, రెండు కాళ్లు ఉన్నట్టుగా భ్రమ కలిగించే ఈ వింత జీవిని తొలిసారి చూసిన ఎవరికైనా అసలు ఏది తల, ఏది కాలు అనే గందరగోళం రావడం సహజం. అయితే ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే, దీనికి నిజంగా రెండు తలలు ఉండవు. కానీ అలా ఉన్నట్టు బ్రమ కలిగేలా చేస్తుంది. ఇంతకీ ఎందుకు ఈ జంతులు ఇలా చేస్తుంది. ఇది చీమలను తినే ప్రత్యేక జీవి; దీని వెనుక కాళ్ల ఆకారం, రంగు తీరు అచ్చం తలల్లా కనిపిస్తూ శత్రువులను తికమక పెడతాయి. ఇంతకీ వీటిపేరు ఏంటో తెలుసా .. చీమల్ని మాత్రమే తిని బ్రతుకుతాయి కాబట్టి.. వీటిని జెయింట్ యాంట్ ఈటర్ అంటారు.
శత్రువులను ఏమార్చే తెలివైన ఆకారం
ఈ జీవి ప్రత్యేకత దాని ఆత్మరక్షణ వ్యూహంలో దాగి ఉంది. ఏదైనా వేటాడే జంతువు దీనిని తినడానికి వచ్చినప్పుడు, కాళ్లనే తలలుగా భావించి పొరపాటున కాళ్ళ దగ్గర దాడి చేస్తాయి. అంటే దెబ్బ కొట్టాల్సిన చోట కొట్టకుండా, వేరే చోట దాడి చేసేలా ఈ ఆకృతి వేటగాళ్లను ఏమారుస్తుంది . ఇలా తన కాళ్లనే ముఖంలా చూపిస్తూ ప్రిడేటర్స్ను మోసం చేసి, తన జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తుంది. ఈ యాంట్ ఈటర్స్ కి కంటి చూపు తక్కువగా ఉంటుంది. కానీ మంచి వాసన గ్రహించే శక్తి ఉంటుంది. వీటికి మనుషుల వాసన గ్రహించే శక్తి కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ చల్లని-రక్తంతో ఉండే జంతువులు రోజుకు దాదాపు 15 గంటలు నిద్రపోతాయి.
రోజుకు వేల చీమలే ఆహారం
ఈ జీవి ఆహారపు అలవాట్లు కూడా ఎంతో వింతగా ఉంటాయి. దీనికి చీమలే ప్రధాన ఆహారం. చీమల గూళ్ల వద్దకు వెళ్లి, తన పొడవాటి నాలుకతో చీమలను పట్టుకుని తింటుంది. రోజుకు 30,000 కు పైగా చీమలను తింటూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ చీమలతోనే కానిచ్చేస్తుంది. వాస్తవ జీవశాస్త్ర గణాంకాల ప్రకారం, ఈ పెద్ద చీమల ఆహారి (Giant Anteater) తన పొడవైన, జిగురుగా ఉండే నాలుకతో నిమిషానికి 150 సార్ల వరకు వేగంగా కదుపుతూ రోజుకు 3000 వరకు చీమలు, చెదపురుగులను కూడా తినగలదు. దంతాలు లేకపోయినప్పటికీ, బలమైన గోళ్లతో పుట్టలను తవ్వి తన నాలుక సాయంతో ఆహారాన్ని సులభంగా లాగేసుకుంటుంది. ఈ యాంట్ ఈటర్స్ శరీరంలో జీర్ణ ప్రక్రియలో కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి. వీటి కడుపులో, హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి బదులుగా ఫార్మిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది.ఇతర జీవులలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ లక్షణం కారణంగా వారు తినే చీమలను త్వరగా జీర్ణం చేస్తుంది.
జెయింట్ యాంట్ ఈటర్ ఎక్కడ జీవిస్తుంది?
ఈ జీవి మధ్య అమెరికా - దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందినది. ముఖ్యంగా ఉష్ణమండల అడవులు, గడ్డి మైదానాలు, సవన్నా ప్రాంతాలు, చిత్తడి నేలల్లో (wetlands) ఇది నివసిస్తుంది. హోండురాస్, బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాల్లోని విశాలమైన భూభాగాల్లో ఇది కనిపిస్తుంది. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అడవులు లేదా చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గడ్డి మైదానాల్లో ఆహారం కోసం సంచరిస్తుంది. నిద్రపోయేటప్పుడు తన పొడవైన, దట్టమైన వెంట్రుకలున్న తోకను దుప్పటిలా శరీరంపై కప్పుకుని చలి, వేడి నుంచి రక్షణ పొందుతుంది.











