MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?

Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?

Whisky: మందు ప్రియులకు విస్కీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అయితే.. ఒక్కొక్కరు ఒక్కోలా మందు తాగుతారు. కానీ, విస్కీ అసలైన రుచి తెలియాలంటే.. దేనితో కలిసి తీసుకోవాలి?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 15 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విస్కీ ఎలా తాగుతున్నారు?
Image Credit : Getty

విస్కీ ఎలా తాగుతున్నారు?

మందు తాగే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రూల్ ఫాలో అవుతూ ఉంటారు. కొందరు వాటర్ మాత్రమే కలుపుకుంటారు. మరికొందరు.. ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతారు. మరి కొందరు కూల్ డ్రింక్స్ కలుపుతూ ఉంటారు. కానీ, ఇలా వేరేవి కలపడం వల్ల విస్కీ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా.... విస్కీ టేస్ట్ ని అసలు సిసలైన రుచి చూడాలి అంటే ఎలా తాగాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నీట్ ( Neat)..
Image Credit : our own

నీట్ ( Neat)..

ఏదీ కలపకుండా.. డైరెక్ట్ గా విస్కీ తాగడాన్ని నీట్ అంటారు. ఇది విస్కీ ఒరిజినల్ టేస్ట్ తెలియజేస్తుంది. కొద్దిగా విస్కీని పోసి గ్లాసును కొద్దిసేపు పక్కన ఉంచాలి. దానిని తాగేటప్పుడు ముక్కుకు మరీ దగ్గరగా ఉంచి పూర్తిగా వాసన పీల్చకుండా.. కొంచెం దూరం నుంచి మెల్లగా వాసన పీల్చాలి. మొదటిసారి చిన్న సిప్ తీసుకొని నాలుక దానికి అలవాటు పడేలా చేయాలి. ఇలా చేయడం వల్ల విస్కీ రుచి బాగా తెలుస్తుంది.

విస్కీలో నీరు కలిపితే....

విస్కీలో కొద్దిగా నీరు కలపడాన్ని "ఓపెన్ అప్ చేయడం" అంటారు. విస్కీలో నీరు, ఇథనాల్ అనేక సువాసన సమ్మేళనాలు ఉంటాయి. కొద్దిగా నీరు కలిపితే విస్కీ రుచి ఏమీ మారదు. కానీ, నీటి మోతాదు ఎక్కువైతే విస్కీ తేలికగా మారుతుంది. గ్లాసులో సగం వరకు నీరు ఉంటే దాని బాడీ, ఫ్లేవర్ తగ్గిపోతాయి. ఒకవేళ ముప్పావు వంతు నీరు కలిపితే ఆ విస్కీ ఒరిజినల్ రుచిని అంచనా వేయడం కష్టమవుతుంది.

 ఐస్ (On The Rocks)…

ఐస్ క్యూబ్స్ కలపడం వల్ల విస్కీ ఉష్ణోగ్రత, డైల్యూషన్ రెండూ మారుతాయి. చల్లదనం వల్ల సువాసనలు విడుదలయ్యే వేగం తగ్గి విస్కీ సువాసన మృదువుగా మారుతుంది, అలాగే ఆల్కహాల్ ఘాటు కూడా తగ్గుతుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ విస్కీ రుచి మారుతూ వస్తుంది. ఇది తాగడానికి చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.

33
గ్లాస్‌ ఎందుకు ముఖ్యం?
Image Credit : our own

గ్లాస్‌ ఎందుకు ముఖ్యం?

విస్కీ రుచిని సరిగ్గా ఆస్వాదించడానికి ట్యూలిప్ ఆకారంలో ఉండే గ్లాస్ (Tulip-shaped glass) చాలా మంచిది. దీని వెడల్పాటి అడుగుభాగం సువాసనలను ఒక చోట చేర్చడానికి, పైకి ఉండే సన్నని భాగం ఆ సువాసనలను నేరుగా ముక్కు వద్దకు చేర్చడానికి సహాయపడుతుంది. వెడల్పుగా ఉండే రాక్స్ గ్లాస్ ఐస్ వేసుకోవడానికి బాగుంటుంది కానీ సువాసనలు త్వరగా ఆవిరైపోతాయి. గ్లాస్ ఎప్పుడూ శుభ్రంగా, వాసన లేనిదై ఉండాలి. గ్లాసు నిండుగా మద్యం పోయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway Travel Insurance: రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా..అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్
Recommended image2
Dosa: ఇదొక్కటి కలిపితే...పులిసిపోయిన దోశ పిండిని మళ్లీ రుచిగా మార్చేయచ్చు.. హోటల్ స్టైల్ దోశ పక్కా
Recommended image3
Papidi Billa: పట్టుచీరలతో ఈ పాపిడి బిళ్ల పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Related Stories
Recommended image1
Dosa: ఇదొక్కటి కలిపితే...పులిసిపోయిన దోశ పిండిని మళ్లీ రుచిగా మార్చేయచ్చు.. హోటల్ స్టైల్ దోశ పక్కా
Recommended image2
Camphor: నార్మల్ కర్పూరానికీ, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి? దేనితో తయారు చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved