MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • IRCTC Hyderabad to Kashmir Tour : కాశ్మీర్ కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఫ్లైట్ ప్యాకేజీ.. 6 రోజుల అద్భుతమైన టూర్

IRCTC Hyderabad to Kashmir Tour : కాశ్మీర్ కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఫ్లైట్ ప్యాకేజీ.. 6 రోజుల అద్భుతమైన టూర్

IRCTC Hyderabad to Kashmir Tour: హైదరాబాద్ నుంచి కాశ్మీర్ అందాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ సరికొత్త సమర్ ఫ్లైట్ ప్యాకేజీని తెచ్చింది. ఈ అద్భుతమైన 6 రోజుల టూర్ వివరాలు, ధరలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 06 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమ్మర్ హీట్‌కు బైబై.. హైదరాబాద్ టూ కాశ్మీర్.. ఐఆర్‌సీటీసీ టూర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే
Image Credit : Gemini

సమ్మర్ హీట్‌కు బైబై.. హైదరాబాద్ టూ కాశ్మీర్.. ఐఆర్‌సీటీసీ టూర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే

ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎక్కడికైనా చల్లటి ప్రదేశానికి ట్రిప్ వెళ్తే భలే ఉంటుంది కదా! ప్రకృతి ప్రేమికుల కలల ప్రపంచం, భూమిపై ఉన్న ఏకైక స్వర్గం కాశ్మీర్. మంచుతో కప్పేసిన పర్వతాలు, పచ్చటి లోయలు, దాల్ సరస్సులో హౌస్‌బోట్ షికారు.. ఇవన్నీ లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే.

అయితే అక్కడికి ఎలా వెళ్లాలి, ఎక్కడ స్టే చేయాలి అనే టెన్షన్స్ వద్దు. హైదరాబాద్ వాసుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) టూరిజం సరికొత్తగా మిస్టికల్ కాశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ (Mystical Kashmir Ex - Hyderabad) పేరుతో ఓ అదిరిపోయే ఎయిర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ ద్వారా శ్రీనగర్, సోన్‌మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి బ్యూటిఫుల్ లొకేషన్లను చుట్టేయవచ్చు. జూన్ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డే టు డే టూర్ ప్లాన్ ఇలా సాగుతుంది..
Image Credit : Gemini ai

డే టు డే టూర్ ప్లాన్ ఇలా సాగుతుంది..

• డే 1 (హైదరాబాద్ టు శ్రీనగర్): ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నానికి శ్రీనగర్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని, సాయంత్రం లోకల్ మార్కెట్లలో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి శ్రీనగర్‌లోనే బస ఉంటుంది.

• డే 2 (సోన్‌మార్గ్ వైపు ప్రయాణం): బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మెడో ఆఫ్ గోల్డ్ అని పిలిచే సోన్‌మార్గ్ కొండలకు ప్రయాణం సాగుతుంది. ఇక్కడి తాజ్వాస్ గ్లేసియర్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ గ్లేసియర్ చూడటానికి గుర్రాలు లేదా లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పర్యాటకులే పెట్టుకోవాలి. సాయంత్రానికి మళ్లీ శ్రీనగర్ హోటల్‌కు వచ్చేస్తారు.

• డే 3 (ప్రపంచ ప్రసిద్ధ గుల్మార్గ్ రైడ్): ఈ రోజు ప్రపంచంలోనే ఎత్తైన కేబుల్ కార్లలో ఒకటైన గుల్మార్గ్ గోండోలా రోప్‌వే రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. రోప్‌వే టికెట్ ఖర్చులు సొంతంగా భరించాలి. మంచు కొండల అందాలను చూసి, సాయంత్రం శ్రీనగర్ చేరుకుంటారు.

• డే 4 (సినిమా షూటింగ్స్ అడ్డా పహల్గామ్): హోటల్ చెకౌట్ చేసి పహల్గామ్ బయలుదేరుతారు. దారిలో కుంకుమపువ్వు తోటలు, అవంతిపూర్ శిథిలాలను చూస్తూ వెళ్తారు. ఇక్కడ బేతాబ్ వ్యాలీ, అరు వ్యాలీ, చందన్‌వరి లాంటి అద్భుతమైన లొకేషన్లు ఉంటాయి. రాత్రికి పహల్గామ్‌లోనే స్టే చేస్తారు.

• డే 5 (దాల్ లేక్, హౌస్‌బోట్): పహల్గామ్ నుంచి శ్రీనగర్ వచ్చి ఆది శంకరాచార్య టెంపుల్ దర్శించుకుంటారు. సాయంత్రం ఫేమస్ దాల్ లేక్‌లో చార్ చినార్ ఫ్లోటింగ్ గార్డెన్స్ చూస్తూ షికారా రైడ్ చేయవచ్చు. ఆ రాత్రికి కాశ్మీర్ స్పెషల్ హౌస్‌బోట్‌లో బస ఉంటుంది.

• డే 6 (మొఘల్ గార్డెన్స్ టూర్.. రిటర్న్ జర్నీ): ఉదయాన్నే మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ సందర్శిస్తారు. ఆ తర్వాత శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఫ్లైట్‌లో సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేస్తారు. దీంతో మీ కాశ్మీర్ డ్రీమ్ టూర్ ముగుస్తుంది.

Related Articles

Related image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Related image2
IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
35
ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ ఫ్లైట్ టైమింగ్స్ ఇవే
Image Credit : X/IRCTCofficial

ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ ఫ్లైట్ టైమింగ్స్ ఇవే

ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను కంఫర్ట్ క్లాస్ ఫ్లైట్ జర్నీతో ఆఫర్ చేస్తోంది. జూన్ 11న ఉదయం 07:00 లేదా 09:35 కి హైదరాబాద్‌లో ఫ్లైట్ ఉంటుంది. తిరుగు ప్రయాణం ఉదయం 11:25 కి శ్రీనగర్‌లో స్టార్ట్ అయి సాయంత్రం 19:25 కల్లా హైదరాబాద్ చేరుకుంటుంది.

మీరు ఎంచుకునే రూమ్ షేరింగ్ ఆధారంగా టికెట్ ధరలు మారుతుంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 55,880, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 44,230, ముగ్గురు షేరింగ్ లో ఉంటే రూ. 42,590, పిల్లలు (5-11 ఏళ్లు) బెడ్‌తో రూ. 36,280, పిల్లలు (5-11 ఏళ్లు) బెడ్ లేకుండా రూ. 33,280 ఉంటుంది.

45
ప్యాకేజీలో ఏమున్నాయి? ఏవి లేవు?
Image Credit : Getty

ప్యాకేజీలో ఏమున్నాయి? ఏవి లేవు?

హైదరాబాద్ - శ్రీనగర్ రౌండ్ ఫ్లైట్ టికెట్లు, 4 రాత్రులు హోటల్ స్టే, 1 నైట్ హౌస్‌బోట్ బస, ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్, ఏసీ వెహికల్‌లో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఈ టూర్ ప్యాకేజీలో ఉంటాయి.

పర్యాటక ప్రాంతాల ఎంట్రీ టికెట్లు, ప్రతిరోజూ లంచ్, ఫ్లైట్‌లో ఫుడ్, గుల్మార్గ్‌లో గోండోలా రైడ్ ఖర్చులు, దాల్ లేక్‌లో షికారా రైడ్ ఫీజులు, ఇంకా పర్సనల్ ఖర్చులు మీరు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది.

55
ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ టూర్ బుకింగ్, హెల్ప్‌లైన్ నంబర్లు
Image Credit : Getty

ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ టూర్ బుకింగ్, హెల్ప్‌లైన్ నంబర్లు

ఈ అదిరిపోయే ట్రిప్ కోసం కేవలం 29 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఐఆర్‌సీటీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ లేదా సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్‌లో గానీ బుక్ చేసుకోవచ్చు.

సంప్రదించాల్సిన నంబర్లు:

• సికింద్రాబాద్ ఆఫీస్: 040-27702407, 9701360701, 8287932228, 8287932229.

• విజయవాడ కౌంటర్: 9281030714.

• తిరుపతి కౌంటర్: 8287932313.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Free Train Travel : రైలులో ఉచిత ప్రయాణం.. వీరికి టికెట్ అవసరం ఉండదనే విషయం మీకు తెలుసా..?
Recommended image2
Most Expensive Coffee: ప్రపంచంలోనే కాస్ట్లీ కాఫీ.. తాగాలంటే కిడ్నీ అమ్మాల్సిందే! ధనవంతులు ఎందుకు లైన్ కడుతున్నారు?
Recommended image3
ఆడామగ లైంగికంగా కలవకున్నా పిల్లలు పుడతాయా..! ఇలాంటి జీవులేవో తెలుసా..?
Related Stories
Recommended image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved