MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !

IRCTC Jyotirlinga Tour Package: ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ నుండి జూన్ 16న 'సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర' ప్రత్యేక రైలును ప్రారంభిస్తోంది. 11 రోజుల ఈ డివైన్ టూర్ ప్యాకేజీ ధర, ఏఏ ప్రాంతాలను చూస్తాము? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 31 2026, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్లాన్.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల యాత్ర.. ఫుడ్, హోటల్ అన్నీ ఫ్రీ
Image Credit : Gemini

ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్లాన్.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల యాత్ర.. ఫుడ్, హోటల్ అన్నీ ఫ్రీ

శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం "సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర" పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది.

కేవలం ఒకే ఒక్క టూర్‌లో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' (Bharat Gaurav Tourist Train) సర్వీసును ఉపయోగించనున్నారు. జూన్ 16న తెలంగాణలోనిన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ తన జర్నీని స్టార్ట్ చేయనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
11 రోజుల సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం
Image Credit : gemini

11 రోజుల సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం

ఈ డివైన్ టూర్ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ రైలును డిజైన్ చేశారు. కేవలం సికింద్రాబాద్‌లోనే కాకుండా, ప్రయాణికుల డిమాండ్ మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో కూడా ఈ రైలు ఎక్కే సదుపాయాన్ని కల్పించారు. 

దీంతో ఉత్తర తెలంగాణ భక్తులకు ఈ యాత్ర చాలా ఈజీగా మారనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు కీలక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలు, పురాతన ఆలయాలను ఈ టూర్‌లో కవర్ చేయనున్నారు.

Related Articles

Related image1
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Related image2
Visakhapatnam: ఏపీ ప్రజల దశాబ్దాల కల.. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ షురూ.. కలిగే లాభాలు ఇవే
35
ఒకే యాత్రలో దర్శించే సప్త జ్యోతిర్లింగాలు ఇవే !
Image Credit : Meta AI

ఒకే యాత్రలో దర్శించే సప్త జ్యోతిర్లింగాలు ఇవే !

భక్తులు ఎంతో కాలంగా కలలుగనే ప్రముఖ శివాలయాలన్నీ ఈ సింగిల్ టూర్‌లో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శించే ప్రధాన క్షేత్రాల లిస్ట్ గమనిస్తే..

  1. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం: ఉజ్జయిని (మధ్యప్రదేశ్) - ఇక్కడి భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
  2. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం: నర్మదా నది తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం (మధ్యప్రదేశ్).
  3. ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం: శ్రీకృష్ణుడి లీలా క్షేత్రమైన ద్వారకతో పాటు దాని సమీపంలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం (గుజరాత్).
  4. సోమనాథ్ జ్యోతిర్లింగం: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం (గుజరాత్).
  5. భీమశంకర్ జ్యోతిర్లింగం: ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన శివాలయం (మహారాష్ట్ర).
  6. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం: గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ సమీపంలోని క్షేత్రం (మహారాష్ట్ర).
  7. ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగం: ఎల్లోరా గుహల చెంతన కొలువైన చివరి జ్యోతిర్లింగం (ఛత్రపతి శంభాజీనగర్, మహారాష్ట్ర).
45
సప్త జ్యోతిర్లింగాల దర్శన ప్రయాణం ఎలా సాగుతుంది?
Image Credit : our own

సప్త జ్యోతిర్లింగాల దర్శన ప్రయాణం ఎలా సాగుతుంది?

యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు పరుగులు తీస్తుంది. 

అక్కడ ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాల డివైన్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ క్షేత్రాలను సందర్శిస్తారు. ఈ ఏడు క్షేత్రాల దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

55
బడ్జెట్ ఫ్రెండ్లీ టికెట్ ధరలు, ఫెసిలిటీస్
Image Credit : our own

బడ్జెట్ ఫ్రెండ్లీ టికెట్ ధరలు, ఫెసిలిటీస్

సాధారణ భక్తుడి నుంచి లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ మూడు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది.

• ఎకానమీ క్లాస్ (Sleeper): పెద్దలకు రూ. 17,600 కాగా, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ. 16,300 గా ఫిక్స్ చేశారు.

• స్టాండర్డ్ క్లాస్ (3AC): పెద్దలకు రూ. 26700, పిల్లలకు రూ. 25,200 ఉంటుంది.

• కంఫర్ట్ క్లాస్ (2AC): పెద్దలకు రూ. 34,600 కాగా, పిల్లలకు రూ. 32,800 గా నిర్ణయించారు.

ఈ ప్యాకేజీ ధరలోనే భక్తులకు ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తారు. దీంతో పాటు హోటల్ వసతి, లోకల్ సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్/టూర్ మేనేజర్ల సేవలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఆలయాల్లో ఉండే అదనపు దర్శన టికెట్లు, పర్సనల్ ఖర్చులు మాత్రం భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏడు జ్యోతిర్లింగాలను చుట్టి రావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
LPG: ఇక‌పై ఇళ్ల‌లో గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపించ‌వా.? కేంద్రం కీల‌క అడుగులు
Recommended image3
పేదలకు ప్రభుత్వం శుభవార్త.. రూ.10 లక్షల కవరేజ్‌తో 1,800కు పైగా చికిత్సలు
Related Stories
Recommended image1
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Recommended image2
Visakhapatnam: ఏపీ ప్రజల దశాబ్దాల కల.. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ షురూ.. కలిగే లాభాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved