MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు

Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు

How to Find Forgot Luggage in Train: ట్రైన్ లో లగేజీ మర్చిపోయి ఆందోళన చెందుతున్నారా? ‘రైల్ మదద్’ యాప్, 139 హెల్ప్‌లైన్ ద్వారా పోగొట్టుకున్న వస్తువులను సులభంగా ఎలా తిరిగి పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2026, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇకపై ట్రైన్ లో బ్యాగులు పోయినా నో టెన్షన్.. ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్
Image Credit : Getty

ఇకపై ట్రైన్ లో బ్యాగులు పోయినా నో టెన్షన్.. ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్

రోజూ కోట్లకు పైగా జనాలు ప్రయాణించే ఇండియన్ రైల్వేస్ లో ప్రయాణం అంటేనే ఒక పెద్ద అడ్వెంచర్. అయితే, మన డెస్టినేషన్ రాగానే ఆ హడావుడిలోనో, నిద్రమత్తులోనో లేదంటే పిల్లల గొడవలో పడో లగేజీని ట్రైన్ లోనే మర్చిపోవడం చాలామందికి జరిగేదే. ప్లాట్‌ఫారమ్ మీదకు వచ్చాక గానీ "అయ్యో.. బ్యాగ్ సీటు కిందే ఉండిపోయింది!" అని లైట్ వెలగదు.

అప్పటికే ట్రైన్ కదిలిపోతుంది. దాంతో గుండె ఆగినంత పనవుతుంది. ఫోన్, పర్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్ పోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇక ఆ సామాను దొరకనట్లే అని ఫిక్స్ అయిపోతారు చాలామంది. కానీ, డిజిటల్ ఇండియాలో ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు చాలా అప్‌డేట్ అయింది. మీ లగేజ్ ఎక్కడికీ పోదు. దాన్ని ఈజీగా ఎలా ట్రాక్ చేయాలో, మీ ముందుకు ఎలా తెప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
రైల్ మదద్ యాప్: మీ లగేజ్ ని వెతికి పెట్టే డిజిటల్ ఫ్రెండ్
Image Credit : Getty

రైల్ మదద్ యాప్: మీ లగేజ్ ని వెతికి పెట్టే డిజిటల్ ఫ్రెండ్

ట్రైన్ లో వస్తువులు పోగొట్టుకున్న ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే తీసుకొచ్చిన అద్భుతమైన ప్లాట్‌ఫారమ్ ‘రైల్ మదద్’ (Rail Madad). ఇది 24x7 అందుబాటులో ఉండే ఒక సెంట్రలైజ్డ్ గ్రీవెన్స్ సిస్టమ్.

• ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి 'Rail Madad' యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

• మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయ్యాక, లాగిన్ అవ్వండి.

• అక్కడ ‘Grievance’ ఆప్షన్ లోకి వెళ్లి, మీ టికెట్ పై ఉన్న PNR నంబర్‌ను ఎంటర్ చేయాలి.

• మీరు పోగొట్టుకున్న వస్తువు వివరాలు అంటే బ్యాగ్ కలర్, సైజ్, లోపల ఏమున్నాయి, మీ కోచ్, సీట్ నెంబర్ వంటివి క్లియర్ గా రాయండి. వీలైతే ఆ లగేజ్ ఫోటో అప్‌లోడ్ చేయండి.

• సబ్మిట్ చేయగానే మీకు ఒక ‘గ్రీవెన్స్ ఐడీ’ వస్తుంది. దీనితో మీ కంప్లైంట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో లైవ్ లో ట్రాక్ చేయవచ్చు.

Related Articles

Related image1
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Related image2
Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే
35
వెబ్‌సైట్, హెల్ప్‌లైన్ తో స్మార్ట్ ఆప్షన్స్
Image Credit : Getty

వెబ్‌సైట్, హెల్ప్‌లైన్ తో స్మార్ట్ ఆప్షన్స్

ఒకవేళ మీకు యాప్ వాడటం కష్టంగా అనిపిస్తే, డైరెక్ట్ గా railmadad.indianrailways.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి కూడా సేమ్ ప్రాసెస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, దానితో వెరిఫై చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి.

పైన చెప్పినట్టుగానే కాకుండా సింపుల్ గా 139 హెల్ప్‌లైన్ నెంబర్ కూడా ఉంది. ఇది ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ ఇంటిగ్రేటెడ్ నెంబర్. ఈ నెంబర్ కి కాల్ చేసి మీ PNR నెంబర్, మిస్సైన లగేజ్ వివరాలు చెబితే, వాళ్లు వెంటనే ఆ ట్రైన్ వెళ్తున్న రూట్ లోని నెక్స్ట్ మేజర్ రైల్వే స్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేస్తారు. అక్కడి అధికారులు ట్రైన్ రాగానే మీ కోచ్ లోకి వెళ్లి సామాన్లు కలెక్ట్ చేసుకుంటారు.

45
ఆపరేషన్ అమానత్, ఆర్‌పీఎఫ్ రక్షణ
Image Credit : AI Image

ఆపరేషన్ అమానత్, ఆర్‌పీఎఫ్ రక్షణ

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ప్రయాణికుల లగేజ్ సేఫ్టీ కోసం ‘ఆపరేషన్ అమానత్’ (Operation Amanat) అనే సూపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తోంది. రైల్లో దొరికిన గుర్తుతెలియని లగేజీలను, బ్యాగులను ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిని ఫోటోలు తీసి రైల్వే జోనల్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తారు. ఆ పోర్టల్ లో లగేజ్ దొరికిన తేదీ, లొకేషన్, దాని అంచనా విలువ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఆన్‌లైన్ లో దొరకకపోతే, మీరు దిగిన స్టేషన్ లోని ఆర్‌పీఎఫ్ పోలీస్ స్టేషన్ లో లేదా ల లాస్ట్ ప్రాపర్టీ సెంటర్ లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

55
క్విక్ రెస్పాన్స్.. సగం టెన్షన్ ఖల్లాస్
Image Credit : Getty

క్విక్ రెస్పాన్స్.. సగం టెన్షన్ ఖల్లాస్

ఇక్కడ ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే.. టైమింగ్. మీ వస్తువు పోయిందని తెలిసిన వెంటనే ఎంత త్వరగా కంప్లైంట్ ఇస్తే, అది దొరికే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. మీరు లేట్ చేసే కొద్దీ వేరే వాళ్లు ఆ లగేజ్ ని తీసేసుకునే ప్రమాదం ఉంది. రైల్వేస్ వారి ఈ 24 గంటల యాక్టివ్ సిస్టమ్ వల్ల ఇప్పుడు మెజారిటీ కేసుల్లో ప్రయాణికుల సామాన్లు క్షేమంగా తిరిగి దొరుకుతున్నాయి. కాబట్టి, నెక్స్ట్ టైమ్ రైలు ప్రయాణంలో లగేజీ మిస్సైనా అస్సలు పానిక్ అవ్వకండి, రైల్ మదద్ ని వాడండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Loco pilot salary: రైళ్లను నడిపే లోకో పైలట్ల జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా?
Recommended image2
Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?
Recommended image3
Snakes Food : పాములు కప్పలనే ఎందుకంత ఇష్టంగా తింటాయి..?
Related Stories
Recommended image1
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Recommended image2
Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved