MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Loco pilot salary: రైళ్లను నడిపే లోకో పైలట్ల జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా?

Loco pilot salary: రైళ్లను నడిపే లోకో పైలట్ల జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా?

Loco pilot salary: భారతీయ రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థ. ఈ రవాణా ఈ వ్యవస్థలో లోకో పైలట్లు ఎంతోమంది పనిచేస్తున్నారు. వారి జీతం గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. నడిపే రైళ్ళను బట్టి లోకో పైలట్ల జీతం ఆధారపడి ఉంటుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 21 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎంతమంది లోకో పైలెట్లు ఉన్నారు?
Image Credit : chat gpt

ఎంతమంది లోకో పైలెట్లు ఉన్నారు?

మనదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఈ వ్యవస్థలో 1,10,000 మంది లోకో పైలట్లు పనిచేస్తున్నారు. ఇక మొత్తం భారతీయ రైల్వే లో పనిచేసే ఉద్యోగుల విషయానికి వస్తే 12 లక్షల 30 వేల మందికి పైగా ఉద్యోగం చేస్తున్నారు. ఇక లోకో పైలట్లలో మగవారిదే పై చేయి. మహిళా లోకో పైలట్ల సంఖ్య రెండువేలు మాత్రమే. చాలామందికి రైళ్లలో నడిపే లోకో పైలట్లకు ఎంత జీతం ఉంటుంది? అనే విషయంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. లోకో పైలట్ల అనుభవం, సీనియారిటీ, వారు నడిపే రైలును బట్టి వారి జీతం ఆధారపడి ఉంటుంది. లోకో పైలట్ ఉద్యోగం కోసం ఆర్ఆర్‌బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెట్టిన పరీక్షలను రాయాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్ని రకాల లోకో పైలెట్ ఉద్యోగాలు?
Image Credit : Getty

ఎన్ని రకాల లోకో పైలెట్ ఉద్యోగాలు?

మనదేశంలో గూడ్స్ రైళ్లు, వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఒక్కోరకం రైలును బట్టి అది నడిపే లోకో పైలట్ శాలరీ ఆధారపడి ఉంటుంది. ఒక లోకో పైలట్ ఉద్యోగం.. అసిస్టెంట్ లోకో పైలట్ స్థాయితో మొదలవుతుంది. ఇతడు సీనియర్ లోకో పైలట్ కు సహాయకుడిగా ఉంటాడు. ఇక రైల్వే యార్డులలో ర్యాక్, వ్యాగన్లు కదిలించే ఇంజన్లను నడిపేందుకు షంటింగ్ లోకో పైలట్ ఉంటాడు. అలాగే గూడ్స్ ట్రైన్లకు ఉండే లోకో పైలట్ చాలా దూర ప్రయాణాలు చేస్తాడు. ప్రయాణికుల రైలును నడిపేందుకు ఇద్దరు లోకో పైలెట్లు ఉంటారు. ఒకరు సీనియర్, మరొకరు జూనియర్. అలాగే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను, హై స్పీడ్ రైళ్లను నడిపే లోకో పైలట్లు వేరుగా ఉంటారు. ఇక అతిపెద్ద లోకో పైలట్ పోస్టు.. చీఫ్ లోకో ఇన్స్పెక్టర్. ఇతను లోకో పైలట్ల శిక్షణ, వారి విధులను పర్యవేక్షిస్తాడు.

Related Articles

Related image1
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Related image2
Scooty Seat Cover: ఎండలో బైక్ సీటు కాలిపోతోందా? కూల్‌గా ఉంచే ఈ సీట్ కవర్లు ట్రై చేయండి
34
లోకో పైలెట్ జీతం ఎంత?
Image Credit : Getty

లోకో పైలెట్ జీతం ఎంత?

భారతీయ రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగం అనేది చాలా గౌరవప్రదమైనది. మంచి స్థిరత్వాన్ని అందించే ఉద్యోగం కూడా. కొత్తగా ఉద్యోగంలో చేరిన అసిస్టెంట్ లోకో పైలట్ ప్రాథమిక జీతం నెలకు 19,900 రూపాయలుగా ఉంటుంది. ఇక డిఏ, హెచ్ఆర్ఎ అన్నింటినీ కలుపుకుంటే అది 35 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉండవచ్చు. ఇక గూడ్స్ బండిని నడిపే లోకో పైలట్ జీతం ప్రారంభంలో 40 వేల నుండి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. ప్యాసింజర్ల రైళ్లను నడిపే లోకో పైలట్ జీతం 66 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. సీనియారిటీ ప్రకారం ఆ జీతం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. ఇక రాత్రి వేళల్లో పని చేస్తే నైట్ డ్యూటీ అలవెన్స్, ఎక్కువ కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తే కిలోమీటర్ లెక్క అలెవెన్సులు, ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి.

44
అర్హతలు ఏమిటి?
Image Credit : Getty

అర్హతలు ఏమిటి?

పదేళ్ల పాటు లోకో పైలట్ అనుభవం ఉంటే జీతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక సీనియర్ లెవెల్ కి చేరుకుంటే రెండు లక్షల రూపాయల జీతం అందుకునే అవకాశం ఉంది. లోకో పైలెట్ పరీక్ష రాసేందుకు పదో తరగతి పూర్తి చేయడంతో పాటు ఐటిఐ లేదా ఇంజనీరింగ్లో డిప్లొమో లేదా డిగ్రీ అవసరం ఉంటుంది. ఆర్‌ఆర్‌‌బీ పరీక్ష రాసేందుకు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే A 1 మెడికల్ ఫిట్నెస్ కూడా కలిగి ఉండాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?
Recommended image2
Hotel Secrets : హోటల్ రూమ్‌లో గోడ గడియారం ఎందుకుండదు? దీనివెనక ఇంతపెద్ద బిజినెస్ ట్రిక్ దాగుందా?
Recommended image3
Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్‌లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?
Related Stories
Recommended image1
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Recommended image2
Scooty Seat Cover: ఎండలో బైక్ సీటు కాలిపోతోందా? కూల్‌గా ఉంచే ఈ సీట్ కవర్లు ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved