MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే

Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే

Microsoft Data Center Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో హైదరాబాద్‌ పరిధిలో మైక్రోసాఫ్ట్ ఆసియాలోనే బిగ్గెస్ట్ ఏఐ డేటా సెంటర్‌ను లాంచ్ చేయబోతోంది. దీంతో లోకల్ ఏరియాస్ ఎలా మారబోతున్నాయి? రియల్ ఎస్టేట్ ఎలా ప్రభావితం కానుందో చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్, గూగుల్‌కు గట్టి పోటీ.. భాగ్యనగరంలో మైక్రోసాఫ్ట్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్
Image Credit : Gemini

అమెజాన్, గూగుల్‌కు గట్టి పోటీ.. భాగ్యనగరంలో మైక్రోసాఫ్ట్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్

హైదరాబాద్ ఐటీ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుంది. గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ భాగ్యనగరంలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అతిపెద్ద డేటా సెంటర్ సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రాబోతోంది.

దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ ఈ మెగా ప్రాజెక్ట్ గురించిన క్రేజీ అప్‌డేట్స్‌ను షేర్ చేశారు.

ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రకటించింది. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఖర్చు పెడుతుండటం విశేషం. దీనివల్ల ఇక్కడి లోకల్ ఏరియాలు బిజీగా మారబోతున్నాయి. సామాన్య ప్రజలకు, టెక్ లవర్స్‌కు  చాలా బెనిఫిట్స్ వుండనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షాద్‌నగర్, చందన్‌వెల్లి.. ఇక ఫుల్ బిజీ
Image Credit : Getty

షాద్‌నగర్, చందన్‌వెల్లి.. ఇక ఫుల్ బిజీ

మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్లను సిటీకి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉండే లొకేషన్లలో శరవేగంగా నిర్మిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, మేకగూడలో 22 ఎకరాలు, చందన్‌వెల్లిలో 53 ఎకరాల భారీ స్థలాల్లో ఈ కన్‌స్ట్రక్షన్ పనులు నడుస్తున్నాయి. అంతేకాదు, దీనికి ఆనుకుని ఉన్న కొత్తూర్, నందిగామ ప్రాంతాల్లో కూడా కంపెనీ మరికొన్ని ల్యాండ్స్ కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది.

ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ లైవ్‌లోకి వస్తే, ఈ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నిన్నమొన్నటివరకు నార్మల్‌గా ఉన్న ఈ ఏరియాలు.. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో గ్లోబల్ టెక్ హబ్‌లుగా మారనున్నాయి. రోడ్లు, కనెక్టివిటీ అద్భుతంగా మెరుగవుతాయి.

35
లోకల్ పీపుల్‌కు పెద్ద బెనిఫిట్స్
Image Credit : Getty

లోకల్ పీపుల్‌కు పెద్ద బెనిఫిట్స్

ఈ మెగా ప్రాజెక్టుతో స్థానికులకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. మైక్రోసాఫ్ట్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒక ఏరియాలోకి వస్తే, దాని చుట్టూ వందలాది అనుబంధ వ్యాపారాలు పుట్టుకొస్తాయి.

• రియల్ ఎస్టేట్ బూమ్: షాద్‌నగర్, చందన్‌వెల్లి, కొత్తూర్ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లకు రెక్కలు రావడం ఖాయం.

• ఉపాధి అవకాశాలు: కన్‌స్ట్రక్షన్, సెక్యూరిటీ, లాజిస్టిక్స్, హౌస్ కీపింగ్, లోకల్ వెండర్స్ వంటి వేలాది మందికి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ లభిస్తుంది.

• ఆర్థిక వృద్ధి: హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా రంగం ఫుల్ బిజీ అయిపోయి, లోకల్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటుంది.

45
టెకీలకు జాబ్స్ పండగే
Image Credit : Getty

టెకీలకు జాబ్స్ పండగే

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు ఇండియాలో 22,000 మందికి పైగా ఎంప్లాయ్స్ ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఏఐ డేటా సెంటర్‌తో సరికొత్త ఏఐ విప్లవానికి మైక్రోసాఫ్ట్ సారథ్యం వహించబోతోంది. మార్కెట్లో ఇప్పుడు కోపైలెట్ 365, అజూర్ క్లౌడ్ సర్వీసులకు క్రేజీ డిమాండ్ ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఇండియన్ ఐటీ దిగ్గజాలు ఇప్పటికే లక్షలాది మైక్రోసాఫ్ట్ ఏఐ లైసెన్సులను వాడుతున్నాయి.

ఈ డేటా సెంటర్ వల్ల హైదరాబాద్‌లోని యంగ్ ఇంజనీర్లకు, ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ నేర్చుకున్న యువతకు సరికొత్త హై-పెయింగ్ జాబ్స్ దక్కే ఛాన్స్ ఉంది. గ్లోబల్ ఫీచర్ల రూపకల్పనలో ఇండియన్ బ్రెయిన్స్ పాత్ర చాలా ఉందని కంపెనీ స్వయంగా చెప్పడం మన టెకీల టాలెంట్‌కు నిదర్శనం.

55
గూగుల్, అమెజాన్‌లకు గట్టి పోటీ
Image Credit : Getty

గూగుల్, అమెజాన్‌లకు గట్టి పోటీ

ఇండియాలో కొత్తగా వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం.. భారతీయుల డేటాను ఇక్కడి లోకల్ సర్వర్లలోనే సేవ్ చేయడం రూల్. అందుకే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా డేటా సెంటర్ల రేసులో ఉన్నాయి. వైజాగ్‌లో గూగుల్ తన సెంటర్ పనులు మొదలుపెట్టగా.. మైక్రోసాఫ్ట్ మాత్రం హైదరాబాద్‌లో ఆసియాలోనే బిగ్గెస్ట్ హైపర్‌స్కేల్ నెట్‌వర్క్‌తో అందరికంటే చాలా ముందు వరుసలో నిలిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
Recommended image3
రాబోయేది క‌ష్ట‌కాలం, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Related Stories
Recommended image1
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Recommended image2
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved