MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!

Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!

IRCTC Waiting List Ticket Confirmation Prediction : భారతీయ రైల్వేలో ఆగస్టు నుంచి కొత్త రిజర్వేషన్ సిస్టమ్ రాబోతోంది. ఏఐ సాంకేతికతతో మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందో ముందే తెలిసిపోతుంది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 14 2026, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక వెయిటింగ్ లిస్ట్ టెన్షన్ లేదు.. రంగంలోకి దిగిన ఏఐ.. రైల్వేలో సరికొత్త విప్లవం!
Image Credit : Asianet News

ఇక వెయిటింగ్ లిస్ట్ టెన్షన్ లేదు.. రంగంలోకి దిగిన ఏఐ.. రైల్వేలో సరికొత్త విప్లవం!

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక సూపర్ న్యూస్. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇకపై వెయిటింగ్ లిస్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముందే చెప్పేస్తుంది.

ఈ దశాబ్దంలోనే రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో రాబోతున్న అతిపెద్ద మార్పు ఇది. వచ్చే ఆగస్టు నెల నుంచి భారతీయ రైల్వే సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. 1986 నుంచి అంటే దాదాపు 40 ఏళ్లుగా వాడుతున్న పాత సిస్టమ్‌కు రైల్వే శాఖ బైబై చెప్పేస్తోంది.

ఈ కొత్త ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వారంలోనే రైల్ భవన్‌లో సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చాలా ఫాస్ట్‌గా టికెట్లు బుక్ అయ్యేలా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను డిజైన్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
40 ఏళ్ల నాటి పాత సిస్టమ్‌కు గుడ్‌బై
Image Credit : iSTOCK

40 ఏళ్ల నాటి పాత సిస్టమ్‌కు గుడ్‌బై

భారతీయ రైల్వే ప్రస్తుతం వాడుతున్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ చాలా పాతది. దీనిని 1986లో ప్రవేశపెట్టారు. గత నాలుగు దశాబ్దాలుగా ఈ సిస్టమ్ ఆధారంగానే దేశంలో రైలు టికెట్ల బుకింగ్ సాగుతోంది. మధ్యలో అవసరాన్ని బట్టి ఈ సిస్టమ్‌ను కాస్త అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా కొత్త టెక్నాలజీతో దీని రూపురేఖలను మార్చేస్తున్నారు. డిజిటల్ కాలానికి తగ్గట్టుగా ఈ కొత్త సిస్టమ్ ఉండబోతోంది.

Related Articles

Related image1
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Related image2
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
35
కేవలం 7 సెకన్లలోనే టికెట్ బుకింగ్
Image Credit : Meta AI

కేవలం 7 సెకన్లలోనే టికెట్ బుకింగ్

ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ స్వయంగా వెల్లడించింది. కొత్త రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌ను మోడ్రన్ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల, ఒకే సమయంలో భారీ సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది.

పాత సిస్టమ్ లాగా ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం 7 సెకన్లలోనే మీ టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. దీనివల్ల ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి భారీ ఊరట లభిస్తుంది. చాలా తక్కువ టైమ్‌లోనే తత్కాల్ టికెట్లను ఈజీగా సొంతం చేసుకోవచ్చు.

45
సూపర్‌హిట్ అయిన రైల్ వన్ యాప్
Image Credit : AI Generated

సూపర్‌హిట్ అయిన రైల్ వన్ యాప్

రిజర్వేషన్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లో భాగంగా తీసుకొచ్చిన 'రైల్ వన్' (Rail One) యాప్ ఇప్పటికే ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2025 జూలై నెలలో ప్రారంభమైన ఈ యాప్‌ను ఇప్పటివరకు దాదాపు మూడున్నర కోట్ల (3.5 కోట్లు) మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఈ సింగిల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ మాత్రమే కాకుండా రైలు ఎక్కడుందో లైవ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు, జర్నీలో ఫుడ్ బుక్ చేసుకోవడం నుంచి రైల్వే శాఖకు కంప్లైంట్స్ చేయడం వరకు అన్ని పనులను ఈ ఒక్క యాప్ ద్వారానే పూర్తి చేయవచ్చు.

55
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజిక్
Image Credit : IRCTC

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజిక్

రైల్వే బుకింగ్ సిస్టమ్‌లో రాబోతున్న బిగ్గెస్ట్ ఛేంజ్ ఏంటంటే, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వాడుతున్నారు. ఈ ఏఐ ఆధారిత 'వెయిటింగ్ లిస్ట్ ప్రెడిక్షన్ టూల్' ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందో తెలిసిపోతుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అనే విషయాన్ని ఈ ఏఐ టూల్ 94 శాతం ఖచ్చితత్వంతో ముందే ఊహించి చెప్తుంది.

ప్రయాణికులకు ఇక ఫుల్ బెనిఫిట్స్

కొత్త టెక్నాలజీ రాకతో ప్రయాణికులకు టికెట్ కన్ఫర్మేషన్ పై ఒక క్లారిటీ వస్తుంది. కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ లేకపోతే ప్రయాణికులు ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా దేశంలో రైలు ప్రయాణం మరింత సులభంగా, స్మార్ట్‌గా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
Recommended image2
Marriage Secrets : పెళ్లిలో వధువు ఎప్పుడూ వరుడికి ఎడమ వైపే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే !
Recommended image3
Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేకపోతున్నారా? బంగారం వేలం వేయకుండా ఆపే సింపుల్ ట్రిక్స్
Related Stories
Recommended image1
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Recommended image2
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved