MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా? కన్ఫర్మ్‌గా సీటు పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !

Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా? కన్ఫర్మ్‌గా సీటు పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !

Train Lower Berth: రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ సీట్లను ఇష్టపడతారు. సీట్లు లేకపోవడం వల్ల చాలాసార్లు అవి అందుబాటులో ఉండవు. కానీ లోయర్ బెర్త్ గ్యారెంటీగా పొందడానికి IRCTC యాప్‌లోని 5 అదిరిపోయే ట్రిక్స్ మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై లోయర్ బెర్త్ కన్ఫర్మ్
Image Credit : Gemini

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై లోయర్ బెర్త్ కన్ఫర్మ్

రైలు ప్రయాణం అంటేనే చాలా మందికి గుర్తొచ్చేది లోయర్ బెర్త్. ఎందుకంటే కింద సీటు ఉంటే ప్రయాణం చాలా ఈజీగా సాగిపోతుంది. కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుంది, రాత్రి పూట పడుకోవడానికి పైకి, కిందికి ఎక్కే తలనొప్పి ఉండదు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వయసైన వారు, గర్భిణీలు, లేదా నడవలేని వారికి లోయర్ బెర్త్ అనేది చాలా కంఫర్ట్‌ను ఇస్తుంది. కానీ, చాలా సార్లు మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా కూడా అప్పర్ బెర్త్ లేదా మిడిల్ బెర్త్ పడుతుంటుంది.

అయితే, ఇకపై మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways), ఐఆర్‌సీటీసీ కలిసి ప్రయాణికుల కోసం కొన్ని క్రేజీ ఫీచర్లను తీసుకొచ్చాయి. వీటిని కరెక్ట్‌గా వాడితే మీకు లోయర్ బెర్త్ వచ్చే ఛాన్స్ 100 శాతం పెరుగుతుంది. ఆ అదిరిపోయే 5 ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మాస్టర్ లిస్ట్ సెటప్ చేసుకోండి
Image Credit : Gemini

మాస్టర్ లిస్ట్ సెటప్ చేసుకోండి

చాలా మంది టికెట్ బుక్ చేసేటప్పుడు లాస్ట్ మినిట్‌లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. దీనివల్ల టైమ్ వేస్ట్ అయి, మంచి సీట్లు మిస్ అవుతాయి. అందుకే ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో ముందే మాస్టర్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి.

• మొదట మీ ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి 'My Account' లోకి వెళ్లండి.

• అక్కడ 'My Master List' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ప్రయాణికుల పేరు, వయసు, బెర్త్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోండి.

• ఇలా చేయడం వల్ల నెక్స్ట్ టైమ్ టికెట్ బుక్ చేసేటప్పుడు జస్ట్ పేరు సెలెక్ట్ చేస్తే చాలు, డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయి. టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా మీకు నచ్చిన సీటు దక్కే ఛాన్స్ పెరుగుతుంది.

Related Articles

Related image1
Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?
Related image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
37
Train Lower Berth: బెర్త్ ప్రిఫరెన్స్ మర్చిపోవద్దు
Image Credit : Getty

Train Lower Berth: బెర్త్ ప్రిఫరెన్స్ మర్చిపోవద్దు

టికెట్ బుకింగ్ చేసేటప్పుడు చాలా మంది ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్‌గా పేమెంట్ వైపు వెళ్తుంటారు. కానీ, అక్కడ కింద ఉండే బెర్త్ ప్రిఫరెన్స్ ఆప్షన్‌ను అస్సలు ఇగ్నోర్ చేయకండి. మీరు పేరు, వయసు ఎంటర్ చేసిన వెంటనే కింద బెర్త్ ఛాయిస్ అడుగుతుంది. అక్కడ కచ్చితంగా లోయర్ బెర్త్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల రైల్వే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ మీకు లోయర్ బెర్త్ కేటాయించడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుంది.

47
సీనియర్ సిటిజన్ కోటా వాడండి
Image Credit : Gemini AI

సీనియర్ సిటిజన్ కోటా వాడండి

ఇంట్లో ఉండే పెద్దవారి కోసం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు జనరల్ కోటా కాకుండా సీనియర్ సిటిజన్ కోటాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పురుషులకు, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు లోయర్ బెర్త్‌లపై మొదటి హక్కు ఉంటుంది. ప్యాసింజర్ పేజీలో పైన ఉండే కోటా సెక్షన్‌లో జనరల్ కు బదులుగా లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ కోటాను సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల సిస్టమ్ ఆటోమేటిక్‌గా పెద్దవారికి లోయర్ బెర్త్‌లను కేటాయిస్తుంది.

57
ఈ ఒక్క ఆప్షన్‌తో లోయర్ బెర్త్ గ్యారెంటీ
Image Credit : chat gpt

ఈ ఒక్క ఆప్షన్‌తో లోయర్ బెర్త్ గ్యారెంటీ

ఇక రైల్వే తీసుకొచ్చిన సరికొత్త ఆప్షన్ ఏంటంటే.. "Book only if at least one lower berth is allotted". అవును, మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు 'Other Preferences' లేదా 'Reservation Choice' విభాగంలో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీని పక్కన ఉండే బాక్స్‌లో టిక్ మార్క్ పెడితే, మీ గ్రూప్‌లో కనీసం ఒక్కరికైనా లోయర్ బెర్త్ దొరికితేనే టికెట్ బుక్ అవుతుంది, లేదంటే బుకింగ్ కాదు. దీనివల్ల మీకు లోయర్ బెర్త్ దొరకడం వంద శాతం పక్కా అవుతుంది.

67
ఒకే కోచ్‌లో సీట్ల కోసం ఇలా చేయండి
Image Credit : Gemini

ఒకే కోచ్‌లో సీట్ల కోసం ఇలా చేయండి

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేటప్పుడు అందరికీ వేర్వేరు కోచ్‌లలో సీట్లు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఐఆర్‌సీటీసీ లో ఉండే మరో సూపర్ ఫీచర్ వాడండి. అదర్ ప్రిఫరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లి "Book only if berths are allotted in same coach" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకే కోచ్‌లో సీట్లు వచ్చేలా రైల్వే సిస్టమ్ ప్లాన్ చేస్తుంది. దీనివల్ల ఒకరి సీటును మరొకరితో ఎక్స్ఛేంజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది.

77
రైల్వే కొత్త అప్‌డేట్స్.. రూల్స్ ఇవే
Image Credit : AI Image

రైల్వే కొత్త అప్‌డేట్స్.. రూల్స్ ఇవే

ప్రయాణికులకు మరింత ఈజీగా ఉండేందుకు భారతీయ రైల్వే ఈ ఏడాది ప్రారంభంలో 'రైల్ వన్ యాప్' (RailOne app) ను లాంచ్ చేసింది. దీని ద్వారా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అలాగే, రైల్వే అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని కూడా 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించింది.

రిజర్వ్డ్ కోచ్‌లలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ప్రయాణికులు పడుకోవడానికి సమయం కేటాయించారు. మిగతా సమయంలో బెర్త్‌లను కిందకు దించి కూర్చోవాల్సి ఉంటుంది. అలాగే సైడ్ లోయర్ బెర్త్ విషయానికి వస్తే.. ఒకవేళ అక్కడ RAC బుకింగ్ ఉంటే, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అప్పర్ బెర్త్ ప్రయాణికుడు వచ్చి కింద కూర్చుంటానని గొడవ చేయడానికి వీల్లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
జీవనశైలి
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts : పుట్టగానే పిల్ల తేళ్లు తల్లిని తినేస్తాయా? పిల్లల్నే తల్లి తేలు తింటుందా?
Recommended image2
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image3
Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved