MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • పొగ‌డ్త‌ల‌కు సంతోషం, విమ‌ర్శ‌ల‌కు బాధ‌ప‌డుతున్నారా.? స‌ముద్రం చెప్పే జీవిత స‌త్యం

పొగ‌డ్త‌ల‌కు సంతోషం, విమ‌ర్శ‌ల‌కు బాధ‌ప‌డుతున్నారా.? స‌ముద్రం చెప్పే జీవిత స‌త్యం

Motivational: జీవితంలో మన గురించి ప్రతి ఒక్కరూ ఒకేలా ఆలోచించరు. కొందరు ప్ర‌శంసిస్తే, మరికొందరు విమర్శిస్తారు. అయితే ఎదుటివారి అభిప్రాయాలు మారినంత మాత్రాన మన విలువ మారిపోదు. ఈ జీవిత స‌త్యాన్ని చాటే ఒక గొప్ప క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 15 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్నారి చెప్పులు పోయాయి.. సముద్రం దొంగ అయింది
Image Credit : Gemini AI

చిన్నారి చెప్పులు పోయాయి.. సముద్రం దొంగ అయింది

ఒక రోజు ఓ చిన్న పిల్లవాడు సముద్ర తీరంలో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు. అంతలో ఒక్కసారిగా ఓ పెద్ద అల వచ్చి అతని చెప్పులను సముద్రంలోకి లాక్కెళ్లింది. త‌న‌ చెప్పులు పోవడంతో ఆ బాలుడు బాధపడ్డాడు. వెంటనే ఇసుకపై పెద్ద అక్షరాలతో "సముద్రం ఒక దొంగ" అని రాశాడు. ఆ క్షణంలో అతని దృష్టిలో సముద్రం అంటే తనకు నష్టం చేసిన దొంగ మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మత్స్యకారుడికి వరం ఇచ్చిన సముద్రం
Image Credit : Gemini AI

మత్స్యకారుడికి వరం ఇచ్చిన సముద్రం

కొంతసేపటి తర్వాత అదే సముద్రంలోకి వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు బోలెడన్ని చేపలతో ఆనందంగా తిరిగి తీరానికి చేరుకున్నాడు. ఆ రోజు అతని కుటుంబానికి ఆహారం, ఆదాయం రెండూ సముద్రం వల్లే లభించాయి. కృతజ్ఞతతో అతడు ఇసుకపై "సముద్రుడు గొప్ప దాత" అని రాశాడు. ఒకరికి దొంగగా కనిపించిన సముద్రం, మరొకరికి దాతగా కనిపించింది.

Related Articles

Related image1
Post Office: అస‌లు అలాగే ఉంటుంది, ప్ర‌తీ నెల మీ అకౌంట్‌లో రూ. 5500 వ‌డ్డీ ప‌డుతుంది
Related image2
ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే
35
ఒక తల్లి కన్నీళ్లలో సముద్రం హంతకుడు
Image Credit : Gemini AI

ఒక తల్లి కన్నీళ్లలో సముద్రం హంతకుడు

అదే సమయంలో ఓ వృద్ధురాలు సముద్రం ఒడ్డున నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఆమె కొడుకు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తన బాధను తట్టుకోలేక ఆమె ఇసుకపై "సముద్రం ఒక హంతకుడు" అని రాసింది. ఆమె జీవితంలో సముద్రం అంటే తన బిడ్డను దూరం చేసిన క్రూరమైన శక్తి.

45
ఒక అల వచ్చి అందరి తీర్పులను చెరిపేసింది
Image Credit : Gemini AI

ఒక అల వచ్చి అందరి తీర్పులను చెరిపేసింది

ఒకరు దొంగ అన్నారు... మరొకరు దాత అన్నారు... ఇంకొకరు హంతకుడు అన్నారు. ఇలా ఒక్కొక్కరు తమ అనుభవాన్ని బట్టి సముద్రానికి ఒక పేరు పెట్టారు. కానీ కొద్దిసేపటికే మరో భారీ అల వచ్చింది. ఇసుకపై రాసిన ఆ మాటలన్నింటినీ ఒక్క క్షణంలో చెరిపేసి వెళ్లిపోయింది. అక్కడ సముద్రం మారలేదు. మారింది కేవలం మనుషుల అభిప్రాయాలే.

55
నీ విలువను ఇతరుల మాటలతో కొలవొద్దు
Image Credit : Gemini AI

నీ విలువను ఇతరుల మాటలతో కొలవొద్దు

ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో దానిపై మన విలువ ఆధారపడి ఉండదు. ఒకరి అవసరానికి అనుగుణంగా మనల్ని పొగడవచ్చు. మరో సందర్భంలో అదే వ్యక్తి మనల్ని విమర్శించవచ్చు. అందుకే పొగడ్తలు వచ్చినా పొంగిపోవద్దు. విమర్శలు వచ్చినా కుంగిపోవద్దు. ఎదుటివారి మాటలను మనసుకు తీసుకుని మన ప్రయాణాన్ని ఆపకూడదు. సముద్రంలా విశాలంగా, ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలి. ఈరోజు పొగిడేవారు రేపు విమర్శించవచ్చు. ఈరోజు విమర్శించేవారు రేపు ప్రశంసించవచ్చు. కానీ నీ లక్ష్యం, నీ వ్యక్తిత్వం, నీ విలువ మాత్రం మారకూడదు. ఇదే స్థితప్రజ్ఞత. జీవితంలో నిజమైన విజేతలు ఎదుటివారి అభిప్రాయాలతో కాదు, తమ విలువలను నమ్ముకుని ముందుకు సాగేవారే. ఈ ప్ర‌పంచం మీకు వారికి న‌చ్చిన‌ పేర్లు పెడుతుంది. కానీ మీరు ఎవరో నిర్ణయించేది ప్రపంచం కాదు... మీ వ్యక్తిత్వం, మీ ఆత్మవిశ్వాసం, మీ నడవడిక మాత్ర‌మే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image2
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Recommended image3
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Related Stories
Recommended image1
Post Office: అస‌లు అలాగే ఉంటుంది, ప్ర‌తీ నెల మీ అకౌంట్‌లో రూ. 5500 వ‌డ్డీ ప‌డుతుంది
Recommended image2
ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved