MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?

Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?

Tirumala Tirupati Secret : తిరుమల తిరుపతి గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? శ్రీవారి ఆలయ తలుపులు తెరిచాక అర్చకుల కంటే ముందే స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఆ వ్యక్తి సొంతం. శతాబ్దాల నాటి ఆ అద్భుత రహస్యం మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 14 2026, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తిరుమల టాప్ సీక్రెట్: కోటీశ్వరులైనా సరే.. ఆయన తర్వాతే శ్రీవారిని చూడాలి !
Image Credit : Gemini

తిరుమల టాప్ సీక్రెట్: కోటీశ్వరులైనా సరే.. ఆయన తర్వాతే శ్రీవారిని చూడాలి !

తిరుమల తిరుపతి అంటేనే ఒక అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, రోజుకు లక్షలాది మంది భక్తులతో కళకళలాడే మహా పుణ్యక్షేత్రం ఇది. అయితే, రోజువారీ హడావుడి పక్కన పెడితే, ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుమల కొండలపై ఒక వింత నిశ్శబ్దం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.

సరిగ్గా తెల్లవారుజామున 2:20 గంటల సమయంలో తిరుమల గర్భగుడి పరిసరాలు పూర్తిగా చీకటిలో మునిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అసలు ప్రతిరోజూ ఉదయం దేవాలయం తలుపులు తెరిచేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మూడు తాళాలు.. ముగ్గురు అధికారులు !
Image Credit : our own

మూడు తాళాలు.. ముగ్గురు అధికారులు !

తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయ తలుపులు తెరవడం అనేది అంత సాదాసీదాగా జరిగే ప్రక్రియ కాదు. దానికి ఒక పక్కా ప్రోటోకాల్, శతాబ్దాల నాటి సంప్రదాయం ఉంది. గర్భగుడి ప్రధాన ద్వారానికి ఉన్న మూడు తాళాలను ఒకే వ్యక్తి తీయడం కుదరదు. మూడు వేర్వేరు తాళంచెవులతో ముగ్గురు కీలక వ్యక్తులు కలిసి ఈ తలుపులను తెరుస్తారు.

వారిలో ఒకరు ఆలయ అర్చకులు కాగా, రెండో వ్యక్తి పేష్కార్ (ఆలయ అధికారి), మూడో వ్యక్తి జియ్యంగార్ స్వామి. ఈ ముగ్గురూ కలిసి అధికారికంగా తాళాలు తీస్తారు. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది.. తలుపులు తెరిచిన వెంటనే ఆ చీకటి గర్భగుడిలోకి అడుగుపెట్టే ఆ మొదటి వ్యక్తి వీరెవరూ కాదు.

Related Articles

Related image1
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
Related image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
34
అర్చకుల కంటే ముందే వెళ్లే ఆ 'సన్నిధి గొల్ల' ఎవరు?
Image Credit : getty

అర్చకుల కంటే ముందే వెళ్లే ఆ 'సన్నిధి గొల్ల' ఎవరు?

తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే మొదటి వ్యక్తి ప్రధాన అర్చకుడు కాదు, జియ్యంగార్ అసలే కాదు. ఒక సామాన్య యాదవ వంశస్థుడు అందరికంటే ముందుగా లోపలికి అడుగుపెడతాడు. ఆయన్నే భక్తులు, ఆలయ సిబ్బంది గౌరవంగా “సన్నిధి గొల్ల” అని పిలుస్తారు.

కాగడా వెలిగించి, ఆ వెలుగులో చీకటి గర్భగుడిలోకి ఆయన మొదట వెళ్తారు. కులమతాల పట్టింపులు, హోదాల తారతమ్యాలు అస్సలు లేకుండా, ఒక సామాన్య భక్తుడికి దక్కిన పరమ పవిత్రమైన గౌరవం ఇది. స్వామివారిని ప్రతిరోజూ ఉదయం పూట చూసే మొదటి అదృష్టవంతుడు ఈ సన్నిధి గొల్లనే కావడం విశేషం.

44
శతాబ్దాల నాటి ఆ వరం.. ఇప్పటికీ మారని మాట
Image Credit : our own

శతాబ్దాల నాటి ఆ వరం.. ఇప్పటికీ మారని మాట

ఇంతకీ ఒక సామాన్య యాదవుడికి ఈ అరుదైన భాగ్యం ఎలా దక్కింది అనే డౌట్ మీలో చాలామందికి రావచ్చు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శతాబ్దాల క్రితం స్వామివారు ఈ తిరుమల కొండలపై వెలిసిన కొత్తలో, ఆయనను మొదట గుర్తించి సేవ చేసింది యాదవ వంశానికి చెందిన ఒక సామాన్య వ్యక్తి.

ఆ భక్తికి మెచ్చిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనాడు ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. "ప్రతిరోజూ ఉదయం నా మొదటి దర్శనం మీ వంశస్థులకే దక్కుతుంది" అని స్వామివారు ఆనాడు మాట ఇచ్చారని చరిత్ర చెబుతోంది. భగవంతుడు తన భక్తునికి ఇచ్చిన ఆ మాటను, శతాబ్దాలు మారుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటికీ పాటిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
ర‌మ్ వ‌ర్సెస్ విస్కీ... ఈ రెండింటి మ‌ధ్య అస‌లు తేడా ఏంటో తెలుసా.?
Recommended image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
Recommended image3
మొఘల్ చక్రవర్తులకు ఇరానీ మహిళలంటే ఎందుకంత ఇష్టం?
Related Stories
Recommended image1
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved