- Home
- Feature
- Indian Tourist Places: మనదేశంలోని ఈ టూరిస్ట్ ప్రాంతాలకు వెళితే స్విట్జర్లాండ్, మాల్దీవులు వెళ్లినంత ఫీల్ కలుగుతుంది
Indian Tourist Places: మనదేశంలోని ఈ టూరిస్ట్ ప్రాంతాలకు వెళితే స్విట్జర్లాండ్, మాల్దీవులు వెళ్లినంత ఫీల్ కలుగుతుంది
Indian Tourist Places: విదేశాలకు ఏమాత్రం తీసిపోని అందమైన ప్రదేశాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి. పైగా తక్కువ బడ్జెట్లోనే వెళ్లి వచ్చేవిగా ఉంటాయి. ఇక్కడకు వెళితే విదేశాలకు వెళ్లిన అనుభూతిని కలిగిస్తాయి.

వెనిస్ నగరాన్ని తలపించే అలెప్పీ
వెనిస్ నగరం లాంటి అందాలను ఎంజాయ్ చేయాలంటే కేరళల్లోని అలెప్పీకి వెళ్లండి. ఇక్కడ అందమైన బీచ్లతో పాటు కేరళకే ప్రత్యేకమైన బ్యాక్ వాటర్స్ అందాలను చూడొచ్చు. ఇక్కడి బీచ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. సూర్యాస్తమయంవేళ ఆ బీచ్ లో కూర్చుంటే ఈ విదేశీ బీచ్ కూడా దాని ముందు దిగదుడుపే అనిపిస్తుంది. పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన నీటితో కనిపించే అలెప్పీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.
స్విట్జర్లాండ్ లాంటి గుల్మార్గ్, ఔలీ
జమ్మూ కాశ్మీర్లో ఉంేడ గుల్మార్గ్, ఉత్తరాఖండ్ లో ఉండే ఔలీ ప్రాంతాలను ఇండియా స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. మంచు బాగా కురుస్తుంది. చెట్లు, కొండలు మంచుతో కప్పుకుని కనిపిస్తాయి. వేడివేడి కాఫీ తాగుతూ అక్కడ ఎంజాయ్ చేయవచ్చు.
ఫ్రాన్స్ ట్రిప్ ఫీల్ ఇచ్చే పాండిచ్చేరి
ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ ఫ్రెష్ క్రోసెంట్స్, కాఫీ టేస్ట్ చేయాలని ఉందా? అయితే వెంటనే పాండిచ్చేరి వెళ్లండి. ఇక్కడి ఫ్రెంచ్ క్వార్టర్ ఆర్కిటెక్చర్ అచ్చం యూరప్ నగరాలను గుర్తుచేస్తుంది. రంగురంగుల భవనాలు, అందమైన వీధులు, ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. విదేశాలకు వెళ్లకుండానే ఫ్రెంచ్ స్టైల్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి పాండిచ్చేరి బెస్ట్ ఛాయిస్.
మాల్దీవులను మరిపించే అండమాన్ నికోబార్ దీవులు
అందరూ మాల్దీవులు వెళ్లాలనుకుంటారు కానీ అది ఖర్చుతో కూడుకున్నది. అంత కన్నా అందమైన ఐలాండ్లు అండమాన్ నికోబార్ దీవులు. నీలిరంగు సముద్రం, రంగురంగుల చేపలు, తెల్లటి ఇసుక తిన్నెలు, అందమైన సూర్యాస్తమయాలు ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్స్. ఇక్కడ మీరు స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సముద్రం అడుగున ఉండే పగడపు దిబ్బలను, జలచరాలను దగ్గరి నుంచి చూసే ఛాన్స్ కూడా దొరుకుతుంది.

