MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Andhra Kashmir: ఆంధ్రాలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే.. అందుకే ఆంధ్రా కాశ్మీర్ పేరు

Andhra Kashmir: ఆంధ్రాలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే.. అందుకే ఆంధ్రా కాశ్మీర్ పేరు

Andhra Kashmir: కాశ్మీర్ చూడాలని ఉందా? అంత దూరం వెళ్లలేకపోతే ఆంధ్రలోనే ఉన్న ప్రాంతానికి వెళితే సరిపోతుంది. అదే లంబసింగి. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తున ఉండి, శీతాకాలంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతతో గడ్డకట్టే చలిని నమోదు చేస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 17 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆంధ్రా కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు?
Image Credit : Gemini AI

ఆంధ్రా కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు?

ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న లంబసింగి ప్రాంతం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉండే ఈ చిన్న గిరిజన గ్రామం ఇది. తన అద్భుతమైన చల్లటి వాతావరణంతో అందరినీ ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో కాశ్మీర్లోని పర్వత ప్రాంతాలను పోలిన చలి ఇక్కడ నమోదవుతుంది. డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు ఒక్కోసారి సున్నా డిగ్రీలకు పడిపోతాయి. చుట్టూ పరుచుకున్న పచ్చని లోయలు, దట్టమైన అడవుల నడుమ ఉండే ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ సమయంలో వెళితే కాశ్మీర్ కు వెళ్లిన అనుభూతి కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చేతికే అందే మంచు
Image Credit : Chat GPT

చేతికే అందే మంచు

లంబసింగిలో శీతాకాలం వచ్చిందంటే చాలు, ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఉదయం పది గంటలైనా సూర్యుడి కిరణాలు నేలను తాకలేవు. చుట్టూ చూస్తే మేఘాలు కాళ్ల కిందే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చేతిలోకి గాలిలోని తేమ బిందువులు మంచులా కురుస్తుంటే సరిహద్దు కశ్మీర్‌లో ఉన్న అనుభూతే కలుగుతుంది. స్థానిక గిరిజనులు ఈ ఊరిని కొర్రబయలు అని కూడా పిలుస్తారు. దీని అర్థం ఆరుబయట నిలబడితే మంచుతో గడ్డకట్టుకుపోవడం. సాధారణంగా మన రాష్ట్రంలో కనిపించని విధంగా గడ్డకట్టే చలి, మంచు దుప్పటిలా కప్పుకుని ఉండటం వల్లే లంబసింగిని ఆంధ్ర కశ్మీర్ అని పిలుచుకుంటారు.

33
ఆపిల్, స్ట్రాబెర్రీ తోటలు
Image Credit : Pixabay

ఆపిల్, స్ట్రాబెర్రీ తోటలు

లంబసింగి ప్రత్యేకత కేవలం చలికే పరిమితం కాలేదు. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ లాంటి అత్యంత శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే స్ట్రాబెర్రీలు, ఆపిల్ పండ్ల తోటలు ఇక్కడ కూడా పండుతాయి. కాఫీ తోటల పరిమళాలు, ఎత్తైన వ్యూ పాయింట్లు, సమీపంలోని కొత్తపల్లి జలపాతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ప్రకృతి ప్రేమికులు శీతాకాలంలో లంబసింగిని సందర్శించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కశ్మీర్ దాకా వెళ్లకుండానే మన సొంత రాష్ట్రంలో ఆ చలి అందాలను ఆస్వాదించే అద్భుతమైన అవకాశం ఇక్కడ లభిస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.13 వేలకే 46 ఇంచుల స్మార్ట్ టీవీ, పైగా 15 ఫ్రీ గిఫ్ట్స్.. హైదరాబాద్‌లోని ఈ షాపుల్లో భారీ ఆఫర్లు
Recommended image2
కన్నకొడుకుల్ని విదేశాలకు పంపి.. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకుంటున్నారు, గరికపాటి మాస్ కౌంటర్
Recommended image3
ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం.. మరి వాహనాలను ఎలా నియంత్రిస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
Gold: మనదేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారం ఎన్ని కిలోలు? ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది?
Recommended image2
Dangerous Tree: ప్రమాదకరమైన చెట్టు.. ఆకు నుంచి పండు వరకు అంతా విషమే, నీడలో నిలబడినా ప్రమాదమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved