MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Snake Myths vs Facts: పాములకు పాలు పోస్తే తాగుతాయా? షాకింగ్ నిజాలు !

Snake Myths vs Facts: పాములకు పాలు పోస్తే తాగుతాయా? షాకింగ్ నిజాలు !

Snake Myths vs Facts: పాములు పాలు తాగుతాయా? పగబడతాయా? పాముల గురించి ప్రచారంలో ఉన్న మూఢనమ్మకాలు, వాటి వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 08 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాముకి పాలు పోస్తే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లాక్ చేసే సైంటిఫిక్ నిజాలు
Image Credit : Chatgpt

పాముకి పాలు పోస్తే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లాక్ చేసే సైంటిఫిక్ నిజాలు

పాములంటే చాలామందికి చాలా భయం ఉంటుంది. కానీ ఆ భయంతో పాటు వాటి గురించి ఎన్నో కథలు, సినిమాలు, మూఢనమ్మకాలు కూడా మన సమాజంలో చాలా బలంగా నాటుకుపోయాయి. సోషల్ మీడియా కాలంలో కూడా "పాము పగబట్టింది", "నాగపాముకు పాలు పోశారు", "నాగమణి దొరికింది" వంటి వార్తలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉంది? ఎంత ఫేక్? సింపుల్‌గా చెప్పాలంటే... సినిమాల్లో చూపించేదంతా రియల్ లైఫ్‌లో నిజం కాదు. అసలు సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాములు నిజంగానే పాలు తాగుతాయా?
Image Credit : Gemini

పాములు నిజంగానే పాలు తాగుతాయా?

మన దేశంలో ఉన్న అతిపెద్ద అపోహల్లో ఇది మొదటిది. నాగపంచమి లేదా ఇతర పండుగల వేళల్లో పాములకు పాలు పోయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ సైంటిఫిక్‌గా చూస్తే పాములు క్షీరదాలు కావు, అవి సరిసృపాలు. అందుకే పాలను జీర్ణం చేసుకునే శక్తి లేదా ఎంజైమ్‌లు వాటి శరీరంలో ఉండవు. సహజంగా అడవుల్లో ఉండే పాములు ఎప్పుడూ పాలను వెతుక్కుంటూ వెళ్లవు.

మరి కొన్ని సందర్భాల్లో పాములు పాలు ఎందుకు తాగుతాయి? పాములు పట్టేవారు నాగపంచమికి ముందు రోజుల్లో వాటిని బంధించి, తీవ్రమైన దాహంతో డీహైడ్రేషన్‌కు గురిచేస్తారు. రోజుల తరబడి నీళ్లు లేక అల్లాడిపోయే పాము ముందు పాల గిన్నె ఉంచినప్పుడు, ప్రాణాలు కాపాడుకోవడానికి ద్రవపదార్థం కాబట్టి వేరే దారి లేక పాలు తాగుతాయి. అంతే తప్ప దానికి పాలు ఇష్టమని కాదు. నిజానికి పాలు తాగించడం వల్ల పాముల ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతిని అవి చనిపోయే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Related image2
Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
36
పాములు పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయా?
Image Credit : Asianet News

పాములు పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయా?

సినిమాల్లో హీరోను లేదా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని, ఏళ్ల తరబడి వెంబడించి పగ తీర్చుకునే పాములను మనం చూసే ఉంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఇది పూర్తిగా అబద్ధం. పాముల మెదడు పరిమాణం చాలా చిన్నది. మనుషుల ముఖాలను గుర్తుంచుకునే సామర్థ్యం లేదా రివెంజ్ తీర్చుకోవాలనే భావోద్వేగాలు వాటికి ఉండవు.

పాము మనిషిని కాటేయడానికి ప్రధాన కారణాలు కేవలం భయపడటం, తనను తాను రక్షించుకోవడం లేదా ప్రమాదాన్ని ఊహించడం మాత్రమే. మన కదలికల వల్ల దానికి ముప్పు అనిపిస్తేనే అది దాడి చేస్తుంది. అంతే తప్ప నిన్ను గుర్తుపెట్టుకున్నా, మళ్లీ వచ్చి కాటేస్తా అనే కాన్సెప్ట్ కేవలం రీల్ లైఫ్ డ్రామా మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

46
పాము తలలో 'నాగమణి' నిజంగానే ఉంటుందా?
Image Credit : Gemini AI

పాము తలలో 'నాగమణి' నిజంగానే ఉంటుందా?

నాగమణి గురించి మన జానపద కథల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటారు. రాత్రి వేళల్లో అది కాంతులు చిమ్ముతుందని, కోట్ల రూపాయల విలువ ఉంటుందని, అది ఉన్నవారికి అదృష్టం కలసి వస్తుందని చాలామంది నమ్ముతారు. ఇప్పటికీ నాగమణి పేరుతో మోసాలు చేసేవారు కూడా ఉన్నారు.

కానీ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా, ఏ శాస్త్రీయ పరిశోధనలోనూ పాము తలలో అలాంటి మణి ఉన్నట్లు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. జీవశాస్త్రం ప్రకారం పాము తలలో ఎముకలు, కండరాలు, విష గ్రంథులు తప్ప ఎలాంటి రత్నాలు ఉండవు. నాగమణి అనేది కేవలం కల్పిత కథల్లో వచ్చిన ఒక భావన మాత్రమే.

56
పాము సంగీతానికి నాట్యం చేస్తుందా?
Image Credit : chatgpt.com

పాము సంగీతానికి నాట్యం చేస్తుందా?

పాములవాడు పుంగి లేదా మకుటం ఊపుతుంటే నాగుపాము పడగ విప్పి డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. చాలామంది పాము ఆ సంగీతాన్ని విని మైమరిచిపోతుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే.. పాములకు బయట చెవులు ఉండవు.

గాలి ద్వారా వచ్చే శబ్దాలను పాములు వినలేవు. అవి కేవలం నేల ద్వారా వచ్చే కంపనాలను మాత్రమే గుర్తించగలవు. పాములవాడు పుంగిని అటుఇటు ఊపుతున్నప్పుడు, ఆ వస్తువు కదలికలను పాము ఒక ప్రమాదంగా భావిస్తుంది. ఆ వస్తువును గమనిస్తూ అలర్ట్‌గా ఉండటానికి తన తలను అటుఇటు తిప్పుతుంది. చూసేవారికి అది సంగీతానికి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది తప్ప, దానికి సంగీతం వినపడదు.

66
ప్రతి పాము విషపూరితమేనా?
Image Credit : Gemini

ప్రతి పాము విషపూరితమేనా?

పాము కనిపిస్తే చాలు వెంటనే కర్ర తీసుకుని చంపేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి భారతదేశంలో కనిపించే మెజారిటీ పాములు విషరహితమైనవే. కేవలం కొన్ని రకాల జాతులు (ఉదాహరణకు నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటివి) మాత్రమే మనుషులకు ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి.

చాలా పాములు మనిషిని చూస్తే భయపడి పారిపోవడానికే చూస్తాయి. తప్పించుకునే దారి లేనప్పుడు లేదా మనం దానిపై కాలు వేసినప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి. పాములు పర్యావరణ వ్యవస్థలో ఎలుకలు, పురుగుల సంఖ్యను అదుపు చేస్తూ పంటలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మూఢనమ్మకాలతో పాములను చంపకుండా, ఇంట్లో లేదా పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కు లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
భారత దేశం
ఫ్యాక్ట్ చెక్

Latest Videos
Recommended Stories
Recommended image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image2
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Recommended image3
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Related Stories
Recommended image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Recommended image2
Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved