MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Agriculture : వ్యవసాయం దండగ కాదు పండగ... రైతును రాజును చేసే 5 పంటలు ఇవే

Agriculture : వ్యవసాయం దండగ కాదు పండగ... రైతును రాజును చేసే 5 పంటలు ఇవే

సాంప్రదాయ వ్యవసాయంలోని సవాళ్లను అధిగమించడానికి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభం తెచ్చిపెట్టే 5 ముఖ్యమైన పంటల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 08 2026, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైతులకు లాభాలు తెచ్చిపెట్టే టాప్ 5 పంటలివే..
Image Credit : Gemini AI

రైతులకు లాభాలు తెచ్చిపెట్టే టాప్ 5 పంటలివే..

Smart Farming : ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం ఒక సవాల్‌గా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, వాతావరణ మార్పుల వల్ల సంప్రదాయ పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. కానీ తెలివిగా వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడూ ఓటమి ఉండదు.

తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పండించి, మంచి ఆదాయం తెచ్చిపెట్టే కొన్ని పంటలు ఉన్నాయి… వీటిని పండించి రైతులు లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టాప్ 5 పంటలు ఏవి? వాటిని ఎలా పండించాలి? ఎక్కడ అమ్మవచ్చు? ఎంత లాభం వస్తుంది? అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కొత్తిమీర
Image Credit : pexels

కొత్తిమీర

ప్రతి ఇంటి వంటగదిలో కొత్తిమీరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది… తెలుగువారి వంటల్లో దీన్ని మరింత ఎక్కువగా వాడుతుంటారు. వెజ్ అయినా, నాన్ వెెజ్ అయినా చివర్లో కొత్తిమీర వేయాల్సిందే. అయితే దీన్ని పండించడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు, అంతర పంటగా కూడా పండించవచ్చు.

పంట కాలం : 30 నుంచి 45 రోజులు మాత్రమే. అంటే నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీన్ని అమ్ముకోవడం కూడా చాలా ఈజీ.. రోడ్డుపక్కన పెట్టుకుని రైతులే నేరుగా విక్రయించవచ్చు.

లాభం : హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక మార్కెట్లకు నేరుగా సరఫరా చేసి వెంటనే డబ్బు సంపాదించవచ్చు.

36
మెంతికూర
Image Credit : pexels

మెంతికూర

ఆరోగ్యపరంగా మెంతికూర చాలా మంచిది… అందుకే మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీన్ని పండించేందుకు నీళ్లు కూడా చాలా తక్కువ అవసరం. పురుగుల బెడద కూడా తక్కువగానే ఉంటుంది… అంటే పెట్టుబడి తక్కువే అన్నమాట. లాభాలు మాత్రం బాగానే ఉంటాయి.

మార్కెట్ : ఆర్గానిక్ షాపులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో దీనికి మంచి ధర లభిస్తుంది. సహజ వ్యవసాయం చేసేవారికి ఇది సరైన పంట. సాధారణంగా పండించినా వారాంతం సంతలు, కూరగాయల మార్కెట్ప్ లో అమ్ముకోవచ్చు.

46
తులసి పంట
Image Credit : pexels

తులసి పంట

మనం తులసి మొక్కను పూజలకు మాత్రమే వాడతాం… కానీ దీన్ని పండించి లాభాలు కూడా పొందవచ్చని చాలామందికి తెలియదు. హెర్బల్, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో తులసిని విస్తృతంగా వాడతారు. ఈ మొక్కలు నాటిన 3-4 నెలల తర్వాత దిగుబడి మొదలవుతుంది. దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ.

ఒప్పంద వ్యవసాయం : చాలా ఆయుర్వేద కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుని తులసిని కొంటాయి. దీనివల్ల రైతులకు అమ్మకం గురించి చింత ఉండదు. మంచి లాభాలు తెచ్చిపెట్టే పంట ఇది.

56
బంతిపూల తోట
Image Credit : pexels

బంతిపూల తోట

గుళ్లు, పెళ్లిళ్లు, పండగ రోజుల్లో బంతి పువ్వులకు భారీ డిమాండ్ ఉంటుంది. మరీముఖ్యంగా దీపావళి వంటి పండగల సమయంలో ఈ పూలను రోడ్ల పక్కన కుప్పలుగా పోసి అమ్మడం చూస్తుంటాం. కాబట్టి ఇలా పండగల సమయంలో బంతిపూలు చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే సాధారణ రోజుల్్లో కంటే మరింత ఎక్కువ లాభాలు పొందవచ్చు.

లాభం : ప్రతి వారం బంతిపువ్వులు కోసి అమ్మడం ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చు. పండగల సమయంలో మరింత ఎక్కువ లాభాలుంటాయి.

సీజన్ : దసరా, దీపావళి, సంక్రాంతి సమయంలో ధరలు ఆకాశాన్నంటుతాయి. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో టచ్‌లో ఉంటే ఎక్కువ లాభం గ్యారెంటీ.

66
మిరప పంట
Image Credit : pexels

మిరప పంట

భారతదేశంలో మిరప అనేది ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. ఇది దీర్ఘకాలంలో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇండియాలో పండే మిరపకు స్వదేశంలోనే కాదు విదేశీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. పచ్చి మిరపకాయ లేదా ఎండు మిరపకాయగా రెండు రూపాల్లోనూ అమ్మవచ్చు. చాలా మసాలా కంపెనీలు రైతుల నుంచి నేరుగా మిరప పంటను కొనుగోలు చేస్తాయి.

ఇలా మంచి లాభాలు తెచ్చిపెట్టే పంటలపై రైతులు ఫోకస్ పెట్టాలి. అయితే ఈ పంటలకు రోగాలు రాకముందే ముందుజాగ్రత్తలు తీసుకుంటే మందుల ఖర్చు ఆదా చేయవచ్చు. పంట వేయడానికి ముందే మార్కెట్లో డిమాండ్ తెలుసుకోండి. మధ్యవర్తులను తప్పించి, వినియోగదారులకు నేరుగా అమ్మడానికి ప్రయత్నించండి. ఇలా చిన్నచిన్న ట్రిక్స్ పాటిస్తే రైతులకు ఖర్చు తగ్గి లాభాలు పెరుగుుతాయి. తెలివిగా చేస్తే వ్యవసాయం దండగ కాదు పండగ అవుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఖాళీ గ‌దిలో రీసౌండ్ ఎందుకొస్తుంది.? వ‌స్తువులుంటే ఆ సౌండ్ ఏమ‌వుతుంది.?
Recommended image2
Longest Train Journey: ఏకంగా 9 రాష్ట్రాల మీదుగా వెళ్లే రైలు.. ఇదే మనదేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ
Recommended image3
రోడ్డుపై ఎప్పుడైనా ఈ సింబల్‌ని గ‌మ‌నించారా.? చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Related Stories
Recommended image1
Agriculture : ఎకరాకు రూ.10 లక్షల లాభం..! ఇలా కదా వ్యవసాయం చేయాల్సింది, ఇది కదా రైతులకు కావాల్సింది
Recommended image2
Agriculture Loans: మీకు ఈ అర్హతలుంటే ఈజీగా లోన్ పొందవచ్చు .. ఇందుకోసం మీరు చేయాల్సిందిదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved