MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Credit Score: పడిపోయిన సిబిల్ స్కోర్ ను అమాంతం పెంచే సూపర్ ట్రిక్

Credit Score: పడిపోయిన సిబిల్ స్కోర్ ను అమాంతం పెంచే సూపర్ ట్రిక్

Credit Score: లోన్లు తీసుకుంటుంటారు గానీ సరిగ్గా EMI లు కట్టకపోవడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుంది. దాని వల్ల కొత్త లోన్లు రావు. అయినా కంగారు పడక్కర్లేదు. కట్టని EMIలు, సెటిల్ చేసిన ఖాతా వివరాల రిపోర్ట్‌లో 7 ఏళ్ల వరకు ఉన్నా స్కోర్‌ను పెంచేసుకోవచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 08 2026, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సిబిల్ స్కోర్ పడిపోయిందా ?
Image Credit : Credit Score\Twitter

సిబిల్ స్కోర్ పడిపోయిందా ?

మీరు లేటుగా కట్టిన EMIలు, సెటిల్ చేసిన అకౌంట్లు, రద్దు చేసిన లోన్ల వల్ల మీ CIBIL రిపోర్ట్‌లో 7 ఏళ్ల వరకు ఉంటుంది. దివాలా తీసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు. అయితే CIBIL మోడల్స్ అనేవి పాత తప్పుల కన్నా, మీ ప్రస్తుత ఆర్థిక లావాదేవీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ వల్ల త్వరగానే కోలుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి
Image Credit : Getty

ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి

ఆలస్యంగా కట్టిన EMI (నెల రోజుల ఆలస్యం): ఇది మీ స్కోర్‌ను వెంటనే 50 నుంచి 100 పాయింట్ల వరకు తగ్గిస్తుంది. కానీ రాబోయే 6 నెలల నుంచి ఏడాది వరకు వాయిదాలు కరెక్ట్‌గా కడితే, కోల్పోయిన పాయింట్లను తిరిగి పొందవచ్చు.

సెటిల్డ్ అకౌంట్: బ్యాంకులతో మాట్లాడి, అసలు కన్నా తక్కువ మొత్తం చెల్లించి అకౌంట్ క్లోజ్ చేయడం వల్ల మీరు డీల్‍ను బ్రేక్ చేశారని అర్థమవుతుంది. ఈ 'Settled' మార్క్ రిపోర్ట్‌లో 7 ఏళ్లు ఉంటుంది. సో డబ్బు ఇచ్చే సంస్థల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మినిమమ్ 18 నెలల నుంచి 3 ఏళ్ల వరకు పడుతుంది.

డీఫాల్ట్, రైట్-ఆఫ్: మీరు కట్టాల్సిన లోన్‌ను నష్టాల ఖాతాలో రాస్తే, మీ స్కోర్ 500 కంటే కిందకు పడిపోతుంది. మళ్లీ నమ్మకాన్ని సంపాదించి, స్కోర్‌ను 700 పైకి తీసుకెళ్లడానికి 3 నుంచి 5 ఏళ్ల ప్రయత్నం చాలా అవసరం.

34
స్కోర్ పెంచుకోవడానికి ప్రాక్టికల్ వే..
Image Credit : Getty

స్కోర్ పెంచుకోవడానికి ప్రాక్టికల్ వే..

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్: బ్యాంకులో డిపాజిట్ చేసి, దానిపై కార్డ్ తీసుకోండి. దాన్ని వాడుతూ, ప్రతి నెలా మొత్తం బకాయి లేకుండా కడితే, 12-18 నెలల్లో మంచి పేమెంట్ హిస్టరీ వస్తుంది.

క్రెడిట్ మిక్స్: ఒక చిన్న పర్సనల్ లోన్ తీసుకుని, దాన్ని సరైన వాయిదాల్లో తిరిగి చెల్లించండి. ఇది వివిధ రకాల అప్పులను మీరు మేనేజ్ చేయగలరని చూపి, స్కోర్‌ను పెంచుతుంది.

వాడుకం పరిమితి: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో ఎప్పుడూ 30% లోపే వాడండి. అలాగే, తక్కువ సమయంలో ఎక్కువ లోన్ల కోసం అప్లై(హార్డ్ ఎంక్వైరీ) చేయడం ఆపండి.

44
రిపోర్ట్ చెకింగ్, తప్పుల సవరణ
Image Credit : Getty

రిపోర్ట్ చెకింగ్, తప్పుల సవరణ

ప్రతి 3 నెలలకు ఒకసారి మీ CIBIL రిపోర్ట్‌ను ఫ్రీగా చెక్ చేసుకోండి. అందులో బ్యాంకు తప్పుల వల్ల ఏవైనా తప్పుడు నెగెటివ్ ఎంట్రీలు ఉంటే, వెంటనే CIBIL సైట్‌లో కంప్లైట్ చేసి సరిచేయించుకోండి. ఇది మీ రికవరీ సమయాన్ని బాగా తగ్గిస్తుంది. 30 లేదా 60 రోజుల్లో స్కోర్‌ను సరిచేస్తామని చెప్పే ఏజెన్సీల మాటలు నమ్మకండి, అవి ఫేక్ అయి ఉండొచ్చు. సో పాత మిస్టేక్స్ ని సరిదిద్దలేం, ఆర్థిక క్రమశిక్షణ వల్ల మాత్రమే ప్రభావాన్ని తగ్గించగలరు. ఓపికగా బిల్లులు కట్టాలి, తెలివైన అప్పుల నిర్వహణే CIBIL స్కోర్‌ను పెంచుకోవడానికి అసలైన, స్థిరమైన మార్గం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Recommended image2
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Related Stories
Recommended image1
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
Recommended image2
Bank Holidays : అరెరే..! ఈ వారం ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులున్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved