MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Train Owner: మనదేశంలో రైలుకు యజమాని అయినా ఏకైక వ్యక్తి.. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే

Train Owner: మనదేశంలో రైలుకు యజమాని అయినా ఏకైక వ్యక్తి.. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే

Train Owner: కార్లకు, బస్సులకు, చివరకు విమానాలకు కూడా సొంత యజమానులు ఉంటారు. కానీ మన దేశంలో ఒక రైలుకు యజమాని ఉండడం చాలా వింత. ఒక రైతు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 19 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పంజాబ్ రైతే రైలు యజమాని
Image Credit : Chat gpt

పంజాబ్ రైతే రైలు యజమాని

పంజాబ్ లోని లూథియానా జిల్లా కటానా గ్రామానికి చెందిన రైతు సంపూరణ్ సింగ్. భారతీయ రైల్వేకు చెందిన ప్రసిద్ధ స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్‌ రైలుకు తానే యజమాని అయ్యాడు. సాధారణంగా రైళ్లు ప్రభుత్వ ఆస్తిగానే మనదేశంలో ఉంటాయి. కానీ మన దేశంలో మొదటిసారి రైతు చేతికి రైలు వెళ్ళింది. ఇది ఇప్పటికీ చెప్పుకునే ఆశ్చర్యపరిచే ఘటనగానే మిగిలిపోయింది. ఈ ఘటన 2007లో జరిగింది. లూథియానా - చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ సంపూరణ్ సింగ్ భూమిని తీసుకుంది. అప్పట్లో ఆయనకు ఎకరాకు పాతిక లక్షల రూపాయల వరకు పరిహారాన్ని అందించారు. అయితే అదే ప్రాంతంలో ఇతర రైతులకు మాత్రం ఎకరాకు 71 లక్షల వరకు చెల్లించినట్లు సంపూరణ్ సింగ్‌కు తెలిసింది. దీంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రైలును జప్తు చేసిన కోర్టు
Image Credit : Getty

రైలును జప్తు చేసిన కోర్టు

కోర్టులో విచారణ జరిగిన తర్వాత సంపూరణ్ సింగ్ వాదనలు నిజమేనని న్యాయస్థానం కూడా భావించింది. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన పరిహారాన్ని భారీగా పెంచింది. సుమారు ఎకరాకు కోటి 47 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ రైల్వే శాఖ ఆ డబ్బు చెల్లించలేకపోయింది. కొంత మొత్తం మాత్రమే అతనికి ఇచ్చి మిగతా డబ్బును ఇవ్వకుండా ఆపేసింది. దీంతో మళ్లీ రైతు కోర్టుకు ఎక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. రైల్వే శాఖ డబ్బు మొత్తం ఇచ్చేవరకు స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును జప్తు చేయాలని ఆదేశించింది. అంటే అది సంపూరణ్ సింగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతేకాదు లూథియానా రైల్వే స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా ఈ జప్తుకు అటాచ్ చేసారు. అంటే ఆ కార్యాలయం కూడా ఈ రైతు చేతికి వచ్చింది.

34
రైలు స్వాధీనం చేసుకున్న రైతు
Image Credit : Getty

రైలు స్వాధీనం చేసుకున్న రైతు

కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టుకొని సంపూరణ్ సింగ్ తన న్యాయవాదితో కలిసి లూథియానా రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అక్కడ కోర్టు ఉత్తర్వులను అందజేశారు. ఆ రైలుకు యజమాని అయ్యారు సంపూరణ్ సింగ్. రైల్వే శాఖ తిరిగి డబ్బులు ఇచ్చే వరకు ఆ రైలుకు యజమాని సంపూరణ్ సింగ్. దాన్ని ఆయన ఎన్నిరోజులైన కదలకుండా ఆపగలరు. అయితే అప్పటికే ఆ రైలులో ప్రయాణికులు నిండిపోయి ఉన్నారు. దీంతో ఆ రైతు ప్రయాణికుల కోసం ఆలోచించి కొద్ది గంటలు మాత్రమే ఆపారు. తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడి రైలును వదిలేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఘటనను ఎవరూ మర్చిపోలేరు.

44
పదేళ్ల పాటూ యజమాని
Image Credit : Getty

పదేళ్ల పాటూ యజమాని

ఈ ఘటన జరిగిన తర్వాత రైల్వే శాఖ మరికొంత డబ్బును సంపూరణ్ కు అందించింది. చివరకు 2017 మేలో స్వర్ణ శతాబ్ది రైలుపై ఉన్న జప్తు ఆదేశాలను కోర్టు ఎత్తివేసింది. నిజానికి అంతవరకు కూడా ఆ రైలుకు యజమానిగా సంపూర్ణ సింగ్‌నే. 2017లో తిరిగి రైలు పూర్తిగా రైల్వే శాఖ అధీనంలోకి వెళ్ళింది. ఈ ఘటన మాత్రం భారత రైల్వే చరిత్రలో అరుదైనదిగా అలా నిలిచిపోయింది. రైతుల సమస్యలు నిర్లక్ష్యం చేస్తే కోర్టు ఎంత కఠినంగా స్పందిస్తుందో ఈ కేసు నిరూపించింది. సంపూర్ణ సింగ్ మాత్రం భారత దేశంలో రైలుకు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా ఇప్పటికీ నిలిచిపోయాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Related Stories
Recommended image1
Buttermilk: మజ్జిగలో ఈ పొడి చిటికెడు వేసుకుని తాగండి చాలు, షుగర్ కంట్రోల్ అవుతుంది
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved