MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?

IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?

IPL 2026 Playoff Race: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్‌కు చేరింది. ఆర్‌సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్ అర్హత సాధించగా, నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, సీఎస్‌కే మధ్య రసవత్తర పోరు సాగుతోంది. నాలుగో ప్లేస్ ను దక్కించుకునేది ఎవరు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2026, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ క్లైమాక్స్: రేసులో నిలిచింది ఎవరు?
Image Credit : Gemini

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ క్లైమాక్స్: రేసులో నిలిచింది ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మార్చి 28న ప్రారంభమైన ఈ టీ20 క్రికెట్ పండగ మే 31 వరకు సాగనుంది. మొత్తం 74 మ్యాచ్‌ల ఈ ఐపీఎల్ టోర్నీలో ప్లేఆఫ్స్ రేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

పాయింట్ల పట్టికను ఒకసారి గమనిస్తే ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్ బెర్తులను అధికారికంగా కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క స్థానం. ఆ నాలుగో ప్లేస్ కోసం ఇప్పుడు నాలుగైదు జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. దీంతో లీగ్ మ్యాచ్‌ల క్లైమాక్స్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాప్‌లో దూసుకుపోతున్న ఆర్‌సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్
Image Credit : ANI

టాప్‌లో దూసుకుపోతున్న ఆర్‌సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్

ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఆర్‌సీబీ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 ఓటములతో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. రన్ రేట్ కూడా +1.065 తో చాలా బలంగా ఉంది.

ఇక ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు కూడా చెరో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. గుజరాత్ 13 మ్యాచ్‌ల్లో 8 గెలిచి +0.400 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉండగా, హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో +0.350 రన్ రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది.

35
నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్ గట్టి పోటీ
Image Credit : ANI

నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్ గట్టి పోటీ

ప్రస్తుతానికి నాలుగో స్థానంలో పంజాబ్ కింగ్స్ (PBKS) నిలిచింది. పంజాబ్ జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి, 6 ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో (NR) ఈ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. 

పంజాబ్ నెట్ రన్ రేట్ ప్రస్తుతం +0.227 గా ఉంది. ఈ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అందులో గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే పంజాబ్‌కు రాబోయే మ్యాచ్ డూ ఆర్ డై లాంటింది.

45
రేసులో నిలిచిన రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ
Image Credit : ANI

రేసులో నిలిచిన రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ

మరోవైపు ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. అందులో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు సాధించింది. రాజస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 ఓటములతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కూడా 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ రన్ రేట్ మైనస్ (-0.871) లో ఉండటం ఆ జట్టుకు పెద్ద మైనస్. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 12 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో రేసులో వెనుకబడి ఉంది.

55
ముంబై, లక్నో జట్లు టోర్నీ నుంచి అవుట్
Image Credit : ANI

ముంబై, లక్నో జట్లు టోర్నీ నుంచి అవుట్

ఈ ఐపీఎల్ సీజన్‌లో పెద్ద జట్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో పడిపోయింది.

లక్నో సూపర్ జెయింట్స్ కూడా 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పదో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, అవి గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. దీంతో నాలుగో స్థానం కోసం జరిగే ఈ రసవత్తర పోరులో ఎవరు నిలుస్తారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL 2026: చెపాక్‌లో సన్‌రైజర్స్ ఊచకోత.. సీఎస్‌కేపై విక్టరీతో ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్, గుజరాత్
Recommended image2
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved