MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Best Roads In The World: అమెరికాా కాదు.. చైనా కాదు.. ప్రపంచంలో బెస్ట్ రోడ్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే !

Best Roads In The World: అమెరికాా కాదు.. చైనా కాదు.. ప్రపంచంలో బెస్ట్ రోడ్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే !

Best Roads In The World: ప్రయాణానికి రోడ్లు చాలా ముఖ్యం. మరి ప్రపంచంలోనే బెస్ట్ రోడ్ నెట్‌వర్క్ ఉన్న టాప్ 10 దేశాలు ఏవో మీకు తెలుసా? వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్టు ప్రకారం ఆ దేశాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ దేశాల్లో రోడ్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Image Credit : Gemini

ఈ దేశాల్లో రోడ్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మంచి రోడ్లు ఉండాలి. రోడ్డు బాగుంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్, సేఫ్టీ, మెయింటెనెన్స్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, కనెక్టివిటీ ఆధారంగా రోడ్ల నాణ్యతను లెక్కిస్తారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలోనే అత్యుత్తమ రోడ్డు నెట్‌వర్క్ ఉన్న టాప్ 10 దేశాల జాబితా విడుదలైంది. ఇందులో ఇండియా కానీ, చైనా కానీ లేవు. మరి ఆ టాప్ దేశాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. సింగపూర్, స్విట్జర్లాండ్
Image Credit : Gemini

1. సింగపూర్, స్విట్జర్లాండ్

ప్రపంచంలోనే నంబర్ వన్ క్వాలిటీ రోడ్లు ఉన్న దేశం సింగపూర్. ఇక్కడ రోడ్డు నాణ్యత స్కోరు 7 కి గాను 6.5 గా ఉంది. ఈ దేశంలో మొత్తం 3,500 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. ఇక్కడి స్మూత్ అర్బన్ రోడ్లు, అడ్వాన్స్‌డ్ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ చాలా ఫేమస్. జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ చాలా తక్కువ. రియల్ టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్స్ వల్ల ట్రాఫిక్ ఫ్లో అస్సలు ఆగదు.

ఇక రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. దీని రోడ్డు నాణ్యత స్కోరు 7 కి గాను 6.3 గా ఉంది. మొత్తం 71,500 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఇక్కడ ఉంది. ఇక్కడి కొండల మధ్య ఉండే హైవేలు, టన్నెల్స్ ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఆల్ప్స్ పర్వతాల గుండా సాగే ప్రయాణం చాలా సేఫ్ గా ఉంటుంది. భారీగా మంచు కురిసినా సరే, అడ్వాన్స్‌డ్ క్లీనింగ్ సిస్టమ్స్ వల్ల రోడ్లు ఎప్పుడూ క్లియర్ గానే ఉంటాయి.

36
2. యూఏఈ, నెదర్లాండ్స్
Image Credit : Gemini

2. యూఏఈ, నెదర్లాండ్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో చాలా అడ్వాన్స్‌డ్ గా ఉంది. దీని స్కోరు 6.1 నుండి 6.3 మధ్య ఉంటుంది. ఇక్కడ దాదాపు 18,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. దుబాయ్, అబుదాబి లాంటి నగరాల్లో స్మార్ట్ లైటింగ్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్న విశాలమైన రోడ్లు కనిపిస్తాయి.

నాల్గో ప్లేస్ లో నెదర్లాండ్స్ ఉంది. దీని స్కోరు 6.1 కాగా, రోడ్డు నెట్‌వర్క్ 139,000 కిలోమీటర్లు. సైక్లింగ్ ట్రాక్‌లతో కలిసి ఉండేలా ఇక్కడి రోడ్లను డిజైన్ చేశారు. చిన్న దేశమే అయినా యూరప్‌లోనే అత్యంత బలమైన రవాణా వ్యవస్థ దీని సొంతం. వరదలు లేదా నీటి వల్ల రోడ్లు పాడవకుండా ఉండేలా డ్రైనేజీ సిస్టమ్స్ వాడారు.

46
3. జపాన్, ఆస్ట్రియా
Image Credit : Gemini

3. జపాన్, ఆస్ట్రియా

టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అయిన జపాన్ ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది. జపాన్ రోడ్డు నాణ్యత స్కోరు 6.0 కాగా, ఏకంగా 1.23 మిలియన్ కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశం కావడంతో, ఇక్కడి ఎక్స్‌ప్రెస్‌వేలను ఎర్త్‌క్వేక్-రెసిస్టెంట్ ఇంజనీరింగ్‌తో నిర్మించారు. సిటీల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా మేనేజ్‌మెంట్ చాలా పక్కాగా ఉంటుంది. క్లీన్‌నెస్‌కు జపాన్ పెట్టింది పేరు.

ఆరో స్థానంలో ఆస్ట్రియా ఉంది. దీని స్కోరు 5.9 కాగా, దాదాపు 200,000 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. యూరప్‌లో ఇదొక ఇంపార్టెంట్ ట్రాన్సిట్ హబ్. ఇక్కడి ఆల్పైన్ రోడ్లు, టన్నెల్స్ ఎంతటి కఠినమైన కొండ ప్రాంతాల్లోనైనా ఏడాది పొడవునా సేఫ్ జర్నీని అందిస్తాయి.

56
4. ఫ్రాన్స్, జర్మనీ
Image Credit : Gemini

4. ఫ్రాన్స్, జర్మనీ

ఫ్రాన్స్ 5.8 స్కోరుతో ఏడో స్థానంలో ఉంది. ఇక్కడ 1.1 మిలియన్ కిలోమీటర్ల భారీ రోడ్డు నెట్‌వర్క్ ఉంది. ఇక్కడి ఫేమస్ టోల్ హైవేస్ ఆటోరూట్స్ వాటి స్మూత్ సర్ఫేస్, హై మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కు ఇవి పర్ఫెక్ట్.

ఎనిమిదో స్థానంలో జర్మనీ ఉంది. దీని స్కోరు 5.7 నుండి 5.9 మధ్య ఉంది. ఇక్కడ 830,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇక్కడి ఫేమస్ ఆటోబాన్ నెట్‌వర్క్ హై-స్పీడ్ ట్రావెల్‌కు కేరాఫ్ అడ్రస్. జర్మన్ రోడ్లు చాలా మన్నికైనవి. సిటీలకు, ఇండస్ట్రియల్ ఏరియాలకు కనెక్టివిటీని పెంచేందుకు నిరంతరం అప్‌గ్రేడ్స్ చేస్తుంటారు.

66
5. అమెరికా, ఒమన్
Image Credit : Gemini

5. అమెరికా, ఒమన్

ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు నెట్‌వర్క్ ఉన్న యునైటెడ్ స్టేట్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. దీని నాణ్యత స్కోరు 5.5 నుండి 5.7 మధ్య ఉంటుంది. అమెరికాలో ఏకంగా 6.6 మిలియన్ కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. ఇక్కడి ఇంటర్‌స్టేట్ హైవే సిస్టమ్ ప్రతి మేజర్ సిటీని కనెక్ట్ చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు, సరుకు రవాణాకు ఈ హైవేలే కీలకం.

చివరిగా పదో స్థానంలో ఒమన్ నిలిచింది. దీని స్కోరు 6.0 కాగా, 62,000 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. గత కొన్నేళ్లుగా ఒమన్ ప్రభుత్వం భారీగా ఇన్వెస్ట్ చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మార్చేసింది. ఎడారిలో ఉండే విపరీతమైన వేడిని తట్టుకునేలా ఇక్కడి ఎక్స్‌ప్రెస్‌వేలను డిజైన్ చేశారు. ఇవి నగరాలు, ఓడరేవులు, కొండ ప్రాంతాలను కలుపుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Monthly Budget Plan : ఇలా జీతం రాగానే అలా ఖర్చయిపోతోందా? ఈ ప్లాన్ ఫాలో అవ్వండి, డబ్బులు ఎలా మిగలవో చూద్దాం!
Recommended image2
Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Related Stories
Recommended image1
World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !
Recommended image2
Normal Petrol vs Power Petrol: నార్మల్ పెట్రోల్ vs స్పీడ్ vs పవర్ పెట్రోల్ మధ్య ఉన్న తేడాలు ఏంటి? మీ వాహనానికి ఏది బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved