MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • USA Travel Tips: అమెరికా వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలు ఇవే

USA Travel Tips: అమెరికా వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలు ఇవే

USA Travel Tips: అమెరికాకు తొలిసారి వెళ్తున్నారా? వీసా, ఖర్చులు, టిప్పింగ్, ట్రాన్స్‌పోర్ట్, ట్యాక్స్, డ్రైవింగ్ రూల్స్ సహా తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. 15 విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 10 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికా వెళ్లే భారతీయులకు అలర్ట్: ఫ్లైట్ ఎక్కే ముందే ఈ 15 విషయాలు మైండ్‌లో ఉంచుకోండి
Image Credit : Chatgpt

అమెరికా వెళ్లే భారతీయులకు అలర్ట్: ఫ్లైట్ ఎక్కే ముందే ఈ 15 విషయాలు మైండ్‌లో ఉంచుకోండి

ఉద్యోగం, ఉన్నత చదువులు, టూరిజం లేదా బంధువులను కలవడానికి తొలిసారి అమెరికా వెళ్తున్న భారతీయులు అక్కడి జీవన విధానం, రూల్స్ పై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంతో పోలిస్తే అమెరికాలోని చట్టాలు, రవాణా, ఖర్చులు, అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సరైన ముందస్తు ప్లాన్ లేకపోతే విమానాశ్రయం ల్యాండింగ్ దగ్గర నుంచే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అమెరికాకు చేరుకోవడానికి సరైన వీసా లేదా కొన్ని అర్హత కలిగిన దేశాల వారికి ఈఎస్టీఏ అవసరం. భారతీయులకు సాధారణంగా B1/B2, H-1B, F-1 వంటి వీసాలు ఉంటాయి. అయితే, కేవలం చేతిలో వీసా ఉంటే సరిపోదు. అమెరికా విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ ప్రయాణ ఉద్దేశం, తిరుగు ప్రయాణ, టికెట్, వసతి వివరాలకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే మీ పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల వాలిడిటీ కలిగి ఉండేలా చూసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైద్య ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రాధాన్యం
Image Credit : Gemini AI

వైద్య ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రాధాన్యం

అమెరికాలో వైద్య సేవలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. చిన్న డాక్టర్ సంప్రదింపుల నుంచి అత్యవసర చికిత్సల వరకు భారీగా ఖర్చువుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క రోజు హాస్పిటల్ స్టేకే వేల డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే కనీసం $50,000 నుంచి $100,000 కవరేజీ ఉన్న ప్రాపర్ ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకెళ్లడం చాలా అవసరం.

డాలర్ విలువ ఎక్కువగా ఉండటమే కాకుండా, అక్కడి జీవన వ్యయం కూడా గణనీయంగా ఉంటుంది. హోటల్స్, ఇళ్ల అద్దెలు, రెస్టారెంట్లు, రవాణా ఖర్చులు భారత్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. డబ్బుల విషయంలో సరైన ప్లానింగ్ లేకపోతే ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉంది.

35
షాపింగ్ ట్యాక్స్, టిప్పింగ్ సంస్కృతి
Image Credit : ChatGPT

షాపింగ్ ట్యాక్స్, టిప్పింగ్ సంస్కృతి

అమెరికా సంస్కృతిలో టిప్పింగ్ ఒక సామాజిక బాధ్యతగా ఉంటుంది. రెస్టారెంట్లు, క్యాబ్‌లు, బార్బర్ షాప్‌లు, డెలివరీ సర్వీసుల్లో సర్వీస్ అందించిన వారికి బిల్లులో సాధారణంగా 15% నుంచి 20% వరకు టిప్ ఇవ్వడం ఆనవాయితీ. ట్యాక్స్ కాకుండా అసలు బిల్లు మొత్తంపై ఈ టిప్‌ను లెక్కిస్తారు.

అలాగే సూపర్ మార్కెట్లు లేదా మాల్స్‌లో వస్తువులపై కనిపించే ప్రైస్ టాక్ ఫైనల్ ధర కాదు. బిల్లింగ్ కౌంటర్ వద్ద స్థానిక, రాష్ట్ర సేల్స్ ట్యాక్స్ అదనంగా తోడవుతుంది. దాంతో ప్రైస్ టాగ్ కంటే బిల్లులో ఎక్కువ మొత్తం కనిపిస్తుంది. రాష్ట్రాలను బట్టి ఈ టాక్స్ రేటు 0% నుంచి 10% వరకు ఉంటుంది.

45
రవాణా నిబంధనలు, డ్రైవింగ్ రూల్స్
Image Credit : Gemini AI

రవాణా నిబంధనలు, డ్రైవింగ్ రూల్స్

న్యూయార్క్, చికాగో, వాషింగ్టన్ డిసి వంటి పెద్ద నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగ్గా ఉంటుంది. కానీ మిగిలిన ప్రాంతాల్లో లేదా చిన్న నగరాల్లో ప్రజారవాణా సౌకర్యాలు తక్కువ. అక్కడికి వెళ్లేవారు సొంత కారు, రెంటల్ కార్ లేదా ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్-షేరింగ్ యాప్‌లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

కారు నడపాలనుకునే వారు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కలిగి ఉండాలి. అక్కడ వాహనాలు రోడ్డుకు కుడి వైపున నడుస్తాయి. స్పీడ్ లిమిట్స్, స్టాప్ సైన్, పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ వద్ద పాదచారులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. జెబ్రా క్రాసింగ్ లేని చోట రోడ్డు దాటడాన్ని 'Jaywalking' అంటారు, కొన్ని నగరాల్లో దీనికి భారీగా ఫైన్ విధిస్తారు.

55
కొలతల విధానం, ఆర్థిక చట్టాలు
Image Credit : Asianet News

కొలతల విధానం, ఆర్థిక చట్టాలు

అమెరికాలో మెట్రిక్ విధానం వాడరు, ఇంపీరియల్ సిస్టమ్ ఉపయోగిస్తారు. దూరాలను మైళ్ళు, బరువును పౌండ్లు, ఉష్ణోగ్రతను ఫారెన్‌హీట్, ద్రవాలను గ్యాలన్లలో కొలుస్తారు. దీనికి భారతీయులు ముందే అలవాటు పడటం మంచిది. అలాగే అక్కడ క్యాష్ వాడకం చాలా తక్కువ, క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు లేదా ఆపిల్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులే ఎక్కువ. విదేశీ లావాదేవీల ఛార్జీలు పడని కార్డ్‌లను వాడటం ఉత్తమం.

అక్కడ ప్లగ్ పాయింట్లు టైప్ ఏ/బీ తరహాలో ఉండి, విద్యుత్ సరఫరా 110V / 60Hz వద్ద పనిచేస్తుంది. కాబట్టి యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఎమర్జెన్సీ సమయంలో పోలీస్, ఫైర్ లేదా మెడికల్ హెల్ప్ కోసం తక్షణమే 911 నంబర్‌కు కాల్ చేయవచ్చు.

లిక్కర్ సేవించడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు. బహిరంగ ప్రదేశాల్లో అంటే రోడ్లు, పార్కులలో లిక్కర్ తాగడం నేరం. అలాగే వ్యక్తిగత ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. క్రమశిక్షణ, సమయపాలన, వరుసలో నిలబడటం, థాంక్యూ, సారీ చెప్పడం వంటి దైనందిన మర్యాదలు పాటించడం ద్వారా అమెరికా ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా, సురక్షితంగా మార్చుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Recommended image2
Two Headed Snakes: రెండు తలల పాము నిజంగానే ఉంటుందా? వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఇదే
Recommended image3
మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?
Related Stories
Recommended image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Recommended image2
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved