MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Air hostess: మనదేశంలో ఎయిర్ హోస్టెస్‌కు జీతం ఎంతో తెలుసా? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఇవే

Air hostess: మనదేశంలో ఎయిర్ హోస్టెస్‌కు జీతం ఎంతో తెలుసా? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఇవే

Air hostess: ఎయిర్ హోస్టెట్ అవ్వాలని ఎంతో మంది అమ్మాయిలకు ఉంటుంది. కానీ వారి జీవితం ఎలా ఉంటుందో.. జీతాలు ఎలా ఉంటాయో మాత్రం చాలా మందికి తెలియదు. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేసేవారికి కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 10 2026, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎయిర్ హోస్టెస్ జీతాలు ఇలా ఉంటాయి
Image Credit : Gemini Ai

ఎయిర్ హోస్టెస్ జీతాలు ఇలా ఉంటాయి

విమానంలో ప్రయాణికులకు కావాల్సిన అవసరాలు చూస్తూ, వారి భద్రతను చూసే క్యాబిన్ క్రూ ఉద్యోగం ఎయిర్ హోస్టెస్. దీనికి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఉద్యోగంలో మంచి జీతంతో పాటు దేశ, విదేశాల్లో ప్రయాణించే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగులకు సాధారణంగా నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం ఉంటుంది. ఇది కేవలం ప్రారంభ జీతం. అంటే ఫ్రెషర్లకు ఇస్తారు. ఫ్లయింగ్ గంటలు, అలవెన్సులు కలిపితే ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది.

Skytech Aviation చెబుతున్న వివరాల ప్రకారం, ఇండిగో సంస్థలో ఒక ఎయిర్ హోస్టెస్ ప్రారంభ జీతం నెలకు సుమారు రూ.30 వేల నుంచి రూ.47 వేల వరకు ఉంటుంది. అదే ఎయిర్ ఇండియాలో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు, స్పైస్‌జెట్‌లో రూ.31 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. వీరి అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. మిడ్ లెవల్‌లో రూ.55 వేల నుంచి రూ.75 వేల వరకు అందుకుంటారు. అలాగే సీనియర్ స్థాయిలో రూ.75 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. సూపర్‌వైజర్ లేదా ఇన్‌ఫ్లైట్ మేనేజర్ స్థాయికి చేరితే నెలకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు ఉండొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మరెన్నో అదనపు బెనిఫిట్స్
Image Credit : Pixabay

మరెన్నో అదనపు బెనిఫిట్స్

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగులకు కేవలం జీతమే కాదు అదనపు సౌకర్యాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల సమయంలో ఫ్లయింగ్ అలవెన్స్, లేఓవర్ సమయంలో రోజువారీ భత్యం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే నెలకు చేతికొచ్చే డబ్బు అధికంగా ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్లే విమానాల్లో పనిచేసే సిబ్బందికి హోటల్ వసతి, రవాణా వంటివి అంతా ఉచితే. కొన్ని ఎయిర్‌లైన్ సంస్థలు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు విమాన టికెట్లు ఇస్తాయి. అలాగే వారు అందంగా కనిపించేందుకు గ్రూమింగ్ ఖర్చులకు కూడా అదనపు డబ్బును చెల్లిస్తారు. వీటితో హెల్త్ ఇన్సూరెన్స్, వైద్య సదుపాయాలు, పనితీరు ఆధారంగా బోనస్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

విదేశాలకు వెళ్లే విమానాల్లో పనిచేసే సిబ్బందికి జీతం ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఉదాహరణకు ఎమిరేట్స్ క్యాబిన్ క్రూకు నెలకు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.54 లక్షల వరకు, కతార్ ఎయిర్‌వేస్‌లో సుమారు రూ.95 వేల నుంచి రూ.1.8 లక్షల వరకు ఉంటుంది. అయితే విదేశీ ఉద్యోగాలకు వీసా, పని అనుమతి ఉండాలి.

33
ఎయిర్ హోస్టెస్ ఎలా అవ్వాలి?
Image Credit : Pixabay

ఎయిర్ హోస్టెస్ ఎలా అవ్వాలి?

ఎయిర్ హోస్టెస్ లేదా క్యాబిన్ క్రూ కావాలంటే ముందుగా 12వ తరగతి పూర్తి చేయాలి. అర్హతలు ఎయిర్‌లైన్‌ సంస్థను బట్టి మారుతాయి. ఉదాహరణకు ఇండిగో ప్రస్తుతం కొత్తగా క్యాబిన్ క్రూలో చేరే మహిళా అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలని నిర్ణయించింది. అలాగే 12వ తరగతి పూర్తి చేయాలని, ఇంగ్లిష్, హిందీలో స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం ఉండాలని అడుగుతోంది. అలాగే 155 సెంటీమీటర్ల ఎత్తు, శరీర బరువు ఎత్తుకు తగినట్లుగా ఉండాలని కోరుతోంది. బయటికి కనిపించేలా శరీరంపై టాటూలు ఉండకూడదనే నిబంధన కూడా ఉంది. ఎయిర్ ఇండియా కూడా దాదాపు ఇలాంటి అర్హతలే పెట్టింది. ఎంపికైన అభ్యర్థులకు విమానంలో భద్రత, ప్రయాణికుల సేవలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉద్యోగంలో చేరే ముందు సుమారు మూడు నెలల శిక్షణ ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
Reliance Smart Bazaar : MRP కంటే తక్కువకే సరుకులు..! స్మార్ట్ బజార్ లో ఏ వస్తువు ఎలా కొంటే లాభమో తెలుసా?
Recommended image3
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Related Stories
Recommended image1
Cheapest Petrol: అక్కడ లీటర్ పెట్రోల్ చాలా చీప్, 3 రూపాయలు కూడా ఉండదు .. ఎక్కడో తెలుసా?
Recommended image2
Dinner: ఎక్కువకాలం బతకాలంటే రాత్రి భోజనం ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved