MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !

తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !

Telangana Maldives: విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. మాల్దీవులని తలపించే నీలిరంగు నీళ్లు, చుట్టూ గుట్టలు, పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలంగాణలోనే ఒక అద్భుతమైన డెస్టినేషన్ ఉంది. ఆ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 09 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇన్స్టాగ్రామ్ ను షేక్ చేస్తున్న తెలంగాణ మాల్దీవ్స్
Image Credit : Chatgpt

ఇన్స్టాగ్రామ్ ను షేక్ చేస్తున్న తెలంగాణ మాల్దీవ్స్

వారమంతా డెస్క్ ముందు కూర్చుని, ల్యాప్‌టాప్ స్క్రీన్లు చూస్తూ, సేమ్ రొటీన్ లైఫ్‌తో బోర్ కొట్టేసిందా? అయితే, వీకెండ్ మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఒక సూపర్ డెస్టినేషన్ రెడీగా ఉంది. బీచ్‌లు చూడటానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి వేరే రాష్ట్రాలకో లేక విదేశాలకో వెళ్లాల్సిన పని లేదు.

హైదరాబాద్‌కు జస్ట్ 150 నుంచి 170 కిలోమీటర్ల దూరంలో, కారు లేదా బైక్ స్టార్ట్ చేస్తే 3-4 గంటల్లో చేరుకునే రేంజ్‌లోనే 'తెలంగాణ మాల్దీవ్స్' వైబ్స్ వేయిటింగ్ చేస్తున్నాయి. అదే నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ – ఏలేశ్వరం గట్టు. చుట్టూ కొండలు, మధ్యలో నీలిరంగు అలలు, పచ్చని నల్లమల అడవులు.. ఒకే ఒక్క ట్రిప్‌లో వైల్డ్ లొకేషన్స్, బోటింగ్, హిస్టరీ, క్రూయిజ్ విజువల్స్ అన్నీ ప్యాక్ అయి ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లాంచ్ జర్నీ.. కృష్ణానది అలలపై నెక్స్ట్ లెవెల్ వైబ్
Image Credit : Gemini

లాంచ్ జర్నీ.. కృష్ణానది అలలపై నెక్స్ట్ లెవెల్ వైబ్

సాగర్ డ్యామ్ వద్దకు చేరుకోగానే అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ టూరిజం వాళ్లు ఆఫర్ చేసే లాంచ్ రైడ్‌లో కూర్చుంటే వచ్చే చల్లటి గాలులు, వాటర్ స్ప్లాషెస్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తాయి. దాదాపు 45 నిమిషాల పాటు సాగే ఈ మోటార్ బోట్ ప్రయాణంలో నీటి మధ్యలో నుంచి చూస్తుంటే చుట్టూ కనిపించే నల్లమల కొండల వ్యూస్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి.

నీటి మట్టం కరెక్ట్‌గా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు దాదాపు 120 కిలోమీటర్ల సుదీర్ఘమైన 6 గంటల క్రూయిజ్ ప్రయాణం కూడా అందుబాటులో ఉంటుంది. నందికొండ, ఏలేశ్వరం, సేలేశ్వరం, తూర్పు కనుమల మీదుగా సాగే ఈ వాటర్ ప్రయాణం ప్రశాంతతను వెతుక్కునేవారికి అల్టిమేట్ ఛాయిస్. లైఫ్ జాకెట్స్ తొడుక్కుని నీటి అలలపై ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్, ఫోటోలు దిగుతుంటే ఆ కిక్కే వేరని చెప్పాలి.

Related Articles

Related image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Related image2
Rainy Season Diet Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త !
36
నాగార్జునకొండ మ్యూజియం.. వాటర్ మధ్యలో ఒక హిస్టారికల్ వండర్
Image Credit : Instagram/vizag_colony

నాగార్జునకొండ మ్యూజియం.. వాటర్ మధ్యలో ఒక హిస్టారికల్ వండర్

బోటింగ్ కేవలం వ్యూస్ కోసమే అనుకుంటే పొరపాటే.. ఈ ప్రయాణం మిమ్మల్ని నేరుగా 'నాగార్జునకొండ' దీవికి తీసుకెళ్తుంది. నీటి మధ్యలో కొండపై రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం ఒక చారిత్రక అద్భుతం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో నీటిలో మునిగిపోయిన ప్రాచీన బౌద్ధ విహారాలు, స్థూపాలు, ఆచార్య నాగార్జునుడి కాలం నాటి రాతి శిల్పాలు, శాసనాలు, అరుదైన పురావస్తు నాణేలను ఇక్కడి మ్యూజియంలో చెక్కుచెదరకుండా భద్రపరిచారు. ఈ ప్లేస్ సందర్శించడం వల్ల రిక్రియేషన్‌తో పాటు మన ప్రాచీన చరిత్ర, బౌద్ధ సంస్కృతిపై ఒక క్లియర్ అవగాహన వస్తుంది. పిల్లలకు విజ్ఞానాన్ని, వీకెండ్ సరదాను ఒకే చోట అందించడానికి ఇది బెస్ట్ స్పాట్.

46
సాగర్ డ్యామ్ వ్యూ.. రాక్షస గేట్లు, తుంపరల జాతర
Image Credit : X/Harrshuuuuu

సాగర్ డ్యామ్ వ్యూ.. రాక్షస గేట్లు, తుంపరల జాతర

డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద నిలబడి చూస్తే మన కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. కృష్ణానదిపై 124 మీటర్ల ఎత్తుతో, 26 గేట్లతో నిర్మించిన ఈ భారీ మేసన్రీ డ్యామ్ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. వర్షాకాలం తర్వాత క్రస్ట్ గేట్లు తెరిచినప్పుడు ఆ ఎగిసిపడే నీటి ధారలు, చుట్టూ పొగమంచులా అల్లుకునే నీటి బిందువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. సాయంత్రం వేళ సూర్యాస్తమయం అవుతుంటే నీటిపై పడే బంగారు వర్ణం ఛాయలు ఫొటోగ్రఫీ లవర్స్‌కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయి. పక్కనే ఉండే ఎత్తిపోతల జలపాతం, బుద్ధవనం పార్కు కూడా ఈ వన్ డే ప్లాన్‌లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు.

56
తెలంగాణ మాల్దీవ్స్ ఏలేశ్వరం గట్టు.. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ స్పాట్
Image Credit : Gemini

తెలంగాణ మాల్దీవ్స్ ఏలేశ్వరం గట్టు.. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ స్పాట్

ఇక ఈ ట్రిప్‌కి అసలైన హైలైట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'ఏలేశ్వరం గట్టు'. బ్యాక్‌వాటర్స్ మధ్యలో నీలిరంగు నీళ్లు, కొండలు అమరి ఉన్న తీరు చూస్తే మనం ఇండియాలోనే ఉన్నామా లేక ఏదైనా కరిబియన్ ఐలాండ్ లేదా మాల్దీవ్స్‌లో ఉన్నామా అనే భ్రమ కలుగుతుంది. అందుకే టూరిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీనిని 'తెలంగాణ మాల్దీవ్స్' అని పిలుచుకుంటున్నారు. ప్రకృతి అందాలతో పాటు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. జలాశయం నడుమ ఉన్న ఏలేశ్వరస్వామి క్షేత్రానికి మహాశివరాత్రి లాంటి ప్రత్యేక సందర్భాల్లో లాంచీలు నడుపుతారు. మనసు ప్రశాంతంగా మారడానికి, ల్యాండ్‌స్కేప్ ఫోటోలకు ఇది పర్ఫెక్ట్ లోకేషన్.

66
వీకెండ్ ప్లాన్ ఇలా వేసుకోండి.. ట్రావెల్ గైడ్
Image Credit : Chatgpt

వీకెండ్ ప్లాన్ ఇలా వేసుకోండి.. ట్రావెల్ గైడ్

మీరు ఫ్యామిలీతో పర్ఫెక్ట్ వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్..

• టైమింగ్స్: మార్నింగ్ 6 గంటలకే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే, ఉదయం 10 కల్లా నాగార్జునసాగర్ చేరుకోవచ్చు.

• రూట్ ప్లాన్: మొదట బోటింగ్ టికెట్స్ తీసుకుని నాగార్జునకొండ, మ్యూజియం చూసేయండి. మధ్యాహ్నం తెలంగాణ టూరిజం హోటల్‌లో లంచ్ ఫినిష్ చేసి, సాయంత్రం డ్యామ్ వ్యూ, బుద్ధవనం కవర్ చేయవచ్చు.

• ముందస్తు జాగ్రత్తలు: నీటి మట్టం, సీజన్ బట్టి లాంచ్, క్రూయిజ్ టైమింగ్స్ మారతాయి కాబట్టి వెళ్లే ముందే తెలంగాణ టూరిజం అఫీషియల్ సైట్ లేదా లోకల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం మంచిది. మంచి కాటన్ డ్రెస్‌లు, క్యాప్, సన్‌గ్లాసెస్, వాటర్ బాటిల్స్ వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.

• ఒకే ఒక్క రోజులో లాంచ్ జర్నీ, మైండ్ బ్లోయింగ్ నేచర్, హిస్టారికల్ మ్యూజియం, డ్యామ్ వ్యూ, ఏలేశ్వరం గట్టు అందాలు.. ఇవన్నీ కవర్ అయ్యే బెస్ట్ డెస్టినేషన్ నాగార్జునసాగర్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Science Facts : తొమ్మిది కాదు ఎనిమిదే గ్రహాలు.. ప్లూటోను గ్రహాల లిస్ట్ లోంచి ఎందుకు తొలగించారు?
Recommended image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Recommended image2
Rainy Season Diet Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved