- Home
- Entertainment
- ఆకులు వక్కలు పక్కలు...ఇదేగా నీ బతుకు ఊర కుక్కలా అరవకు... బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీనేత
ఆకులు వక్కలు పక్కలు...ఇదేగా నీ బతుకు ఊర కుక్కలా అరవకు... బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీనేత
ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ తో విరుచుకుపడగా.. నేడు సైరా ఘాటుగా స్పందించారు.

బండ్ల గణేష్ ట్వీట్స్ కి ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijay Sai Reddy)ఘాటు రిప్లై ఇచ్చారు. ఆకులూ, వక్కలు, పక్కలు ఇదేగా నీ బ్రతుకంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎవరో చెప్పారని పిచ్చి కుక్కలా అరుస్తున్నావు. నువ్వు ఎంత అరిచినా నీరసం రాబవడం తప్పితే బండ్లు ఓడలు కావు గణేశా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్ సోషల్ మీడియాలో సంచలంగా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విజయ సాయి రెడ్డి ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యర్ధులు చేసే ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా సంధానం చెబుతూ ఉంటాడు. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్స్ ఉంటాయి. రాష్ట్రంలోని ఒక వర్గాన్ని కించ పరిచేలా విజయ సాయి రెడ్డి చర్యలు ఉంటున్నాయని బండ్ల గణేష్ ఆరోపణలు చేయగా... విజయ సాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
విజయ్ సాయి రెడ్డి ఆయన ట్వీట్ లో... ''ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా!'' అంటూ కామెంట్ చేశారు. విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక బండ్ల గణేష్ (Bandla Ganesh) పై విజయ సాయి రెడ్డి ఈ తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు బండ్ల గణేష్ విజయ సాయి రెడ్డిని ఏమన్నారో చూద్దాం... ‘‘మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు’’ అని బండ్ల గణేష్ అన్నారు.
‘‘నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’’ అని బండ్ల ట్వీట్ చేశారు. తనకు వైఎస్సార్ అన్నా, సీఎం జగన్ అన్నా గౌరవమే అని చెప్పారు. కానీ విజయసాయి రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని విమర్శించారు. తమ కులాన్ని అన్ని విషయాల్లో ఎందుకు లాగుతున్నావ్ అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని.. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారని చెప్పారు.
చంద్రబాబుతో ఏదైనా ఉంటే ఆయనతో తేల్చుకోవాలని అన్నారు. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కోవాలని ఎద్దేవా చేశారు. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎవరైనా నచ్చకుంటే వారిని పేరు పెట్టి తిట్టాలన్నారు. కానీ కులాన్ని తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. వియయసాయి రెడ్డిని జైలుకు పంపింది కమ్మ వారు కాదు కదా అంటూ చురకలు అంటించారు.
త్వరలోనే సీఎం జగన్‌కు విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు. ఈ ట్వీట్స్ తర్వాత తనను విజయసాయిరెడ్డి ఎంత ఇబ్బంది పెడతాడో తెలుసని.. అన్నిటికీ సిద్ధపడే ఉన్నానని చెప్పుకొచ్చారు. కమ్మ వారిని తిట్టాడాన్ని తట్టుకోలేక పోతున్నానని బండ్ల గణేష్ చెప్పారు. నచ్చని వారిని పేరు పెట్టి తిట్టాలని విజయసాయిరెడ్డికి సూచించారు. దయచేసి కులాన్ని తిట్టవద్దని కోరారు. ఇదేనా సంస్కారం అని విజయసాయిని ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డి బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసునని.. ఎంపీగా అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను దగ్గరపెట్టుకోవద్దని సీఎం జగన్‌ను కోరారు. ఇలాంటి వ్యక్తులను దగ్గరపెట్టుకుని రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని అన్నారు. తనకు కుల పిచ్చి లేదని.. తన కులాన్ని తాను ప్రేమిస్తానని.. ప్రతి కులాన్ని గౌరవిస్తానని చెప్పారు.
తనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని.. అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా ఇష్టమని చెప్పారు. ‘‘విజయసాయిరెడ్డి నువ్వు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు.. అది నీకు మంచిది కాదు.. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.
తాము కష్టాన్ని నమ్ముకున్న రైతులమని బండ్ల గణేష్ అన్నారు. ‘‘ నువ్వు విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నవు... ఇది ప్రపంచానికి తెలుసు. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్‌కి జనం కారం పెట్టడం ఖాయం. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి’’ అని బండ్ల గణేష్ ట్వీట్స్ చేశారు.
ఇక, గత సర్కార్ తమ వర్గానికి చెందినవారికే ఉద్యోగాలు కల్పించేవారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అంతేకాదు టీడీపీ కుల పార్టీ అని విమర్శించారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలకు బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.