- Home
- Entertainment
- 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. 40 ఏళ్లు దాటినా సరే పెళ్ళి పెటాకులు లేకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అనుష్క నుంచి టబు వరకూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోయిన్స్ ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోయిన్లు
హీరోలకంటే హీరోయిన్ల కెరీర్ లైఫ్ టైమ్ చాలా తక్కువ. వారి సినీ జీవితం చాలా చిన్నది. 10 - 15 ఏళ్ల వరకే సినిమా అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత వయసును కారణంగా చూపి వాళ్లను పక్కన పెడతారు. చాలా వరకు 30 ఏళ్లు దాటిన తర్వాత నటీమణులకు సినిమా అవకాశాలు పెద్దగా రావు.
అలా వచ్చినా అక్క లేదా అమ్మ పాత్రలే దక్కుతాయి. అందుకే నటీమణులు 30 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకుని స్థిరపడిపోతారు. అలా 35 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్యాచిలర్ హీరోయిన్లు ఎవరంటే..?
Also Read: శంకర్ ఇక మార్పు రాదా..? ఇండియన్ 3 కోసం మరో ప్రయోగానికి రెడీ అవుతున్న గేమ్ ఛేంజర్ డైరెక్టర్
అనుష్క శెట్టి
అనుష్క
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనుష్క వయసు 42 ఏళ్లు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. బాహుబలి నటుడు ప్రభాస్, ఓ వ్యాపారవేత్తతో ఆమె ప్రేమాయణం నడిపిందనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పటికీ ఏ విషయం తేలలేదు.
Also Read: బాలకృష్ణ కెరీర్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు
త్రిష
త్రిష
20 ఏళ్లకు పైగా సౌత్ ఇండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది త్రిష. వయసు 41 ఏళ్లు. రానా, వరుణ్ మణియన్‌తో ప్రేమ విఫలమవడంతో ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.
Also Read: ఓటీటీల్లో ఏకంగా 15 సినిమాలు వస్తున్నాయ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు వీకెండ్ పండగే..
టబు
టబు
తెలుగులో కూలి నెంబర్ 1, ఆవిడ మా ఆవిడే, నిన్నె పెళ్ళాడతా లాంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న టబు ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. 52 ఏళ్లు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్ళితో పనేంటి అంటోంది.
Also Read: కన్నప్ప కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత..? ఫస్ట్ లుక్ ఎప్పుడు..?
కిరణ్ రాథోడ్
కిరణ్
తెలుగులో జెమిని, విన్నర్, తిరుమల వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న గ్లామర్ నటి కిరణ్. ఆమె వయసు 43 ఏళ్లు. అజిత్, విజయ్ సినిమాల్లో నటించిన ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.
Also Read: మావారికి సిగ్గు ఎక్కువ, మ్యారీడ్ లైఫ్, భర్త పై కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్
శృతి హాసన్
శృతి హాసన్
కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో ప్రేమాయణం నడిపిన శృతి.. అతన్నే పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, మనస్పర్థల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు.
నగ్మా
నగ్మా
రజనీకాంత్‌తో కలిసి బాషా సినిమాలో నటించిన నగ్మా వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. జ్యోతిక సోదరి అయిన ఆమె సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లో కొనసాగుతోంది. 50 ఏళ్లు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.
కోవై సరళ
కోవై సరళ
హాస్యనటి కోవై సరళ వయసు ప్రస్తుతం 60 దాటింది. పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంది.
ఆండ్రియా
ఆండ్రియా
నటి ఆండ్రియా వయసు 38 ఏళ్లు. తనకంటే 6 ఏళ్లు చిన్నవాడైన సంగీత దర్శకుడు అనిరుధ్‌ను ప్రేమించింది. వయసు తేడా కారణంగా వాళ్ల ప్రేమ ఫలించలేదు. ప్రేమ విఫలమైన తర్వాత ఇద్దరూ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నారు.