- Home
- Entertainment
- Movie Reviews
- శంకర్ ఇక మార్పు రాదా..? ఇండియన్ 3 కోసం మరో ప్రయోగానికి రెడీ అవుతున్న గేమ్ ఛేంజర్ డైరెక్టర్
శంకర్ ఇక మార్పు రాదా..? ఇండియన్ 3 కోసం మరో ప్రయోగానికి రెడీ అవుతున్న గేమ్ ఛేంజర్ డైరెక్టర్
వరుస డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్. అయినా సరే తగ్గేది మాత్రం లేదంటున్నాడు. సినిమాల విషయంలో ప్రయోగాలు చేయడం మానడంలేదు శంకర్. ఈ ట్రెండ్ కు తగ్గట్టు మారనంటున్నాడు. ఇండియాన్ 3 కోసం ఆయన ఏం చేయబోతున్నారోతెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
డైరెక్టర్ శంకర్.. సౌత్ సినిమాకు దేశవ్యాప్తం గుర్తింపు తెచ్చిన దర్శకుడు. రాజమౌళికంటే ముందు సౌత్ ఇండియాలో హవా నడింపించిన స్టార్ డైరెక్టర్. ఓటమెరుగని ఫిల్మ్ మేకర్ గా ఉన్న శంకర్.. గత దశాబ్ధ కాలంగా వరుసగా ప్లాప్ లు ఇస్తూనే ఉన్నాడు. 2010 లో వచ్చిన రజినీకాంత్ రోబో తరువాత శంకర్ కు సాలిడ్ హిట్ పడ్డింది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఈ ట్రెండ్ కు తగ్గట్టు మంచి స్క్రీన్ ప్లే తో సినిమాను అందించలేకపోతన్నాడు శంకర్.
తాజాగా రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యి ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అంతకు ముందు ఇండియాన్ 2 కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలా వరుసగా ప్లాప్ లు చూస్తున్నారు శంకర్. ఇక నెక్ట్స్ ఆయన లిస్ట్ లో ఇండియన్ 3 మూవీ ఉంది. ఈసినిమా కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారట శంకర్. ఈ దర్శఖుడి సినిమాలు చాలా కాస్ట్లీ పాటల కోసమే కోట్లు ఖర్చు పెడతారట శంకర్. ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుందట సినిమాలకు.
shankar says the planning for indian 3 kamal haasan
ఈక్రమంలో ఇండియన్ 3 కోసం గట్టిగా ప్లాన్ చేశాడట శంకర్. కొత్త టెక్నాలజీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడట శంకర్. 2024 లో రిలీజ్ అయిన ఇండియన్ 2 డిజాస్టర్ అయ్యింది. ఇక కమల్ హాసన్ తో ఇండియాన్ 3 తెరకెక్కించి సక్సెస్ కొడతానంటూ శంకర్ ధీమాగా ఉన్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడట. ఇండియన్ 3 కోసం కొత్తగా జపాన్ టెక్నాలజీని వాడబోతున్నట్టు తెలుస్తోంది.
new schedule may happen soon for indian 3 kamal haasan shankar lyca productions
ఏది ఏమైనా శంకర్ తన కథల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, స్క్రీన్ ప్లే కూడా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. కాని వాటిపై శంకర్ పెద్దగా దృష్టి పెట్టలేదు అంటున్నారు. మరి ఈసారైనా శంకర్ ఫామ్ లోకి వస్తారా..? ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది చూడాలి.