కన్నప్ప కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత..? ఫస్ట్ లుక్ ఎప్పుడు..?
వరుస పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తోన్న ప్రభాస్.. మంచు విష్ణు కన్నప్పలో కూడా కనిపించబోతున్నాడు. ఈసినిమాకోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

kannappa movie team offers
కల్కీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ప్రభాస్.. వరుసగా అరడజన్ సినిమాలు లైన్ లో పెట్టాడు. తన సొంత సినిమాలతో పాటు.. ప్రభాస్ కన్నప్ప లో కూడా నటిస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీమల్టీ స్టారర్ మైథలాజికల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి స్టార్స్ అంతా నటిస్తున్నారు.
kannappa movie
ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. అయితే ఈసినిమాలో ప్రభాస్ నటించడం అంటే.. ఆయన ఇప్పుడు ఉన్న స్థాయికి భారీగా రెమ్యునరేషన్ సమర్పించుకోవల్సి ఉంటుంది. సినిమాకు ఆయన 200 కోట్ల వరకూ తీసుకుంటున్నాడని టాక్. ఇక కన్నప్ప లో నటించినందుకు ప్రభాస్ ఎంత తీసుకుని ఉంటాడు అనేది టాపిక్. ఈసినిమాలో ప్రభాస్ శివుడు అని చాలా కాలం ప్రచారం జరిగింది.
కాని శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించడంతో ప్రభాస్ నందిపాత్రలో కనిపిస్తారని టాక్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ 40 నిమిషాల నివిడి పాత్ర చేస్తున్నారట. ప్రభాస్ ప్రతీ నిమిషం చాలా వ్యాల్యుబుల్. ఈలెక్కన్న 40నిమిషాలకు 50 కోట్లు పైనే ఛార్చ్ చేసే అవకాశం ఉంది. కాని విచిత్రం ఏంటంటే..ఈసినిమాను ఆయన తన స్నేహితుడి కోసం ఫ్రీగా చేశారట. ప్రమోషన్స్ లో కూడా ఫ్రీగా పాల్గొంటాను అని అన్నారట.
మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో ప్రభాస్ ఇలా ఓప్పుకున్నాడని టాక్. అయితే మంచు ఫ్యామిలీకి ప్రత్యేకంగా మంచు విష్ణుకు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ లేదు. దాంతో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నటించడం వల్ల తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకం.
ఈ సినిమాను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని పలు కారణాలవల్ల ఈసినిమాను ఈ ఏడాది ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు. ఏప్రెల్ లో భారీ స్తాయిలో ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నెలలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ వస్తుందని టాక్ వినిపిస్తుంది.మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.