బాలకృష్ణ కెరీర్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి. దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న ఈ హీరో.. 60 ఏళ్ళు దాటిన తరువాత కూడా దూకుడు చూపిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా డాకు మహరాజ్ సినిమాతో బాక్సాఫీస్ ను శేష్ చేసిన ఈ సంక్రాంతి హీరో.. తన కెరీర్ లో సాధించిన టాప్ కలెక్షన్ సినిమాలేంటో చూద్దాం.

Nandamuri Balakrishna Daku Maharaaj collection
డాకు మహరాజ్ (2025)
బాలయ్య కెరీర్ లో అద్భుతమైన సినిమా అని చెప్పవచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్ ను ట్రై చేశాడు. మెగా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబి ఈసినిమాను డైరెక్ట్ చేయగా.. ఈసినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. బాలయ్యకు 2025 మెమరబుల్ సంక్రాంతి ట్రీట్ అని చెప్పవచ్చు. ఈసినిమాకు 100 కోట్ల బడ్జెటన్ ను పెట్టారు. బాలయ్య కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా కాగా.. ఈసినిమా 200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ఉంది. భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.
వీర సింహా రెడ్డి (2023)
ఇక బాలయ్య సినిమాల్లో ఆయనకు హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈసినిమా కేవలం 85 కోట్ల బడ్జెట్ తో తెరెక్కింది. బాలయ్య నట విశ్వరూపం చూపించడంతో .. మరో సమరసింహారెడ్డి గుర్తుకు వచ్చాడు ఫ్యాన్స్ కు దాంతో ..వరల్డ్ వైడ్ గా 132 కోట్ల గ్రాస్ ను 80 కోట్ల వరకూ శేర్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీకి 73 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అయ్యింది.
అఖండ (2021)
బాలయ్య కెరీర్ లో అద్భుతం అంటే అఖండ సినిమా అని చెప్పాలి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా బడ్జెట్ కేవలం 50 కోట్లు మాత్రమే. ఈసినిమాలో డ్యూయల్ రోల్ చేశారు బాలయ్య, అఘోరాగా బాలకృష్ణ నట తాండవం చూసిన ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ వచ్చాయి. వన్ మాన్ షో చేసి.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు బాలయ్య.
ఇక ఈమూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 132 కోట్ల వసూళ్ళు సాధించింది. బాలయ్య కెరీర్ లో కలెక్షన్ల విషయంలో 100 కోట్లు దాటింది ఈసినిమాకే. ఈసినిమాతోనే వరుస ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఈసినిమాకు 57 కోట్ల శేర్ వసూళ్ళు రాగా.. 53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యింది.
Nandamuri Balakrishna Bhagavanth Kesaris
భగవంత్ కేసరీ (2023)
ఇక బాలకృష్ణ సినిమాల్లో మరో డిఫరెంట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ డాటర్ సెంటిమెంట్ సినిమా బడ్జెట్ 75 కోట్లు. కాని ఈమూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు 127 కోట్లు. వరల్డ్ వైడ్ షేర్70.1 కోట్లు. 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
గౌతమీ పుత్ర శాతకర్ణి (2017)
బాలయ్య కెరీర్ లో డాకుమహరాజ్ కంటే ముందు చేసిన హిస్టారికల్ క్యారెక్టర్ గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈసినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూడవచ్చు. 45 కోట్ల రూపాయలతో తెరెక్కిన ఈసినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 81.6 కోట్లు వసూలు చేసింది. 51 కోట్ల శేర్ ను రాబట్టింది. 50 కోట్ల ప్రీరిలీజ్ కూడా జరిగింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ.. బాలకృష్ణ కెరీర్ లో అద్భుంగా నిలిచింది.
Teachers Day Special
లెజెండ్ (2014)
బాలయ్యకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. నాయకుడిగా నడిపించిన సినిమాలకు బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమానే లెజెండ్. ఈసినిమాను కేవలం 35 కోట్లతో నిర్మించగా.. ప్రపంచ వ్యాప్తంగా 68 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. 41 కోట్ల శేర్ కలెక్షన్స్ రాగా.. దాదాపు 32 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈసినిమాను కూడా బోయపాటి డైరెక్ట్ చేశాడు.
సింహా (2010)
బాలకృష్ణ సినిమాల్లో సింహ సినిమాకు ప్రత్యేక ప్లేస్ ఉంటుంది. ఈసినిమా కూడా ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న నటసింహానికి మంచి ఫామ్ లోకి తెచ్చింది. 20 కోట్ల బడ్జెట్ తో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 53 కోట్లు వసూలు చేసింది. 30 కోట్లకు పైగా శేర్ ను రాట్టింది. 16 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అయ్యింది.
జై సింహా (2018)- 32కోట్లు
జై సింహా (2018)
ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కాని.. మంచి కలెక్షన్స్ సాధించిన బాలయ్య సినిమా జై సింహ. కే.ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమా బడ్జెట్ 30 కోట్లు. వరల్డ్ వైడ్ గ్రాస్ 52 కోట్లు, వరల్డ్ వైడ్ షేర్ 30.4 కోట్లు. ఇక జైసింహా ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్లు.
నరసింహా నాయుడు (2001)
నరసింహ నాయుడు (2001)
బాలయ్య సినిమాల్లో నరసింహనాయుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సమరసింహారెడ్డి ప్రభంజనం తరువాత నరసింహనాయుడు సినిమాకు అదే హైప్ వచ్చింది. కేవలం 7 కోట్లతో మాత్రమే నిర్మించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ఆడి.. 25 ఏళ్ల క్రిందట 38 కోట్లు కలెక్షన్ రాబట్టింది అంటే మాటలు కాదు. 20 కోట్లకు పైగా లాభాలు సాధించిన ఈసినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 8 కోట్లు.
ఎన్టీఆర్:కథానాయకుడు - థ్రియేటికల్ వాల్యూ 70కోట్లు- షేర్స్ 20.04కోట్లు(డిజాస్టర్)
ఎన్టీఆర్ కథానాయకుడు (2019)
నందమూరి తారక రాముడి బయోపిక్ గా తెరకెక్కిన సినిమాలో ఒకభాగం ఎన్టీఆర్ కథానాయకుడు. తన తండ్రి పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించిన ఈసినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా బడ్జెట్ 60 కోట్లు కాగా.. వరల్డ్ వైడ్ గ్రాస్ : 39 కోట్లు కాగా వరల్డ్ వైడ్ షేర్ 20 కోట్లు. 70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యింది.