MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కృష్ణం రాజు పార్థివ దేహానికి స్టార్స్ నివాళి.. ప్రభాస్ కు చిరు, పవన్, మహేశ్, ఎన్టీఆర్, నాని, విజయ్ పరామర్శ..

కృష్ణం రాజు పార్థివ దేహానికి స్టార్స్ నివాళి.. ప్రభాస్ కు చిరు, పవన్, మహేశ్, ఎన్టీఆర్, నాని, విజయ్ పరామర్శ..

రెబల్ స్టార్ కృష్ణం రాజు  (Krishnam Raju) ఈరోజు వేకువ జామున తుదిశ్వాస విడిచారు. దీంతో వారి నివాసంలో టాలీవుడ్ స్టార్స్ ఆయన పార్థివ దేహానికి పూలమాలతో నివాళి అర్పించారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 11 2022, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కృష్ణం రాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  ఇప్పటికే ట్వీట్టర్ వేదికన  భావోద్వేగ ప్రకటన చేసిన ఆయన స్వయంగా ప్రభాస్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణం రాజుతో తనకున్న సంబంధాన్ని తెలియజేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇప్పటికే కృష్ణం రాజు మృతి పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సినీ ఇండస్ట్రీ, జనసేనా అధినేతగా కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుగదలకు కృష్ణం రాజు చేసిన సేవలను గుర్తు చేశారు.  

39

టాలీవుడ్ సీనియర్ నటులు మోహన్ బాబు (Mohan Babu), సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కలిసి కృష్ణం రాజు దేహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంత త్వరగా తమను విడిచి వెళ్లిపోవడం పట్ల చింతించారు. 

49

కృష్ణం రాజు మరణవార్త వినగానే దిగ్భ్రాంతికి గురైన సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి కృష్ణం రాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ప్రభాస్ ను పరామర్శించి, భరోసా వ్యక్తం చేశారు. 
 

59

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) స్వయంగా కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆయన మరణవార్త తెలుసుకొని ఉదయమే  సంతాపం వ్యక్తం చేసిన తారక్ తాజాగా ప్రభాస్ (Prabhas) మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెబల్ స్టార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. 
 

69

అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) కూడా కృష్ణం రాజు మరణవార్త వినగానే చలించిపోయారు. ఉదయమే సంతాపం వ్యక్తం చేసిన ఆయన తాజాగా కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు, ప్రభాస్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
 

79

ఇక సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణవార్తను జీర్ణించుకోలేకపోయారు. ఇండస్ట్రీలో ఎంతగానో ప్రోత్సహించే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళి అర్పించి, ప్రభాస్ కు ధైర్యం చెప్పారు. 
 

89

సమాచారం తెలుసుకున్న నేచురల్ స్టార్ నాని (Nani) వెంటనే ప్రభాస్ ఇంటికి చేరుకున్నారు. కృష్ణం రాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి, ప్రభాస్, కుటుంబికులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

99

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కృష్ణం రాజు ప్రాణాలు  కోల్పోవడం పట్ల చింతించారు. ఆయన కూడా తన టీంతో ప్రభాస్ ఇంటికి చేరుకొని కృష్ణం రాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రభాస్ ను పరామర్శించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
కృష్ణంరాజు
నాని (నటుడు)
పవన్ కళ్యాణ్
ప్రభాస్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved