MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • లావుగా ఉందని బాడీ షేమింగ్‌ కామెంట్లు.. శ్రీముఖికి అండగా నిలిచిన అమ్మా.. స్టార్‌ యాంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్

లావుగా ఉందని బాడీ షేమింగ్‌ కామెంట్లు.. శ్రీముఖికి అండగా నిలిచిన అమ్మా.. స్టార్‌ యాంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్

తెలుగు యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరని దున్నేస్తుంది. బొద్దు అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా తన చిన్ననాటి ఫోటోలు పంచుకుని రచ్చ షురూ చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 08 2024, 09:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలుగు అందాల యాంకర్‌ శ్రీముఖి క్రేజ్ ఇప్పుడు మామూలు కాదు. సుమ డౌన్‌ కావడం, అనసూయ షోస్‌ వదిలేయడం, రష్మి ఒకటి రెండు షోస్‌కే పరిమితం కావడంతో ఇప్పుడు శ్రీముఖి జోరు కొనసాగుతుంది. ఆమె నాలుగైదు షోస్‌ కి యాంకరింగ్‌ చేస్తూ బిజీగా ఉంది. మిగిలిన యాంకర్లని మించిన పాపులారిటీతో దూసుకుపోతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఓ వైపు షోస్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అడపాదడపా పెద్ద తెరపై మెరస్తూ అలరిస్తుంది. తన కోరికని తీర్చుకుంటుంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులకు అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వారిని ఎంగేజ్‌ చేస్తుంది. దీంతో ఆమె ఫోటోలు నెటిజన్లకి విందు భోజనంలా పనిచేస్తాయి. 
 

38

ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతోపాటు ఆమె ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్నప్పటి పిక్స్ నెటిజన్లని అలరిస్తున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా తన అమ్మ లతా శ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మతో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది శ్రీముఖి. ఈ మేరకు ఆమె ఎమోషన్‌ పోస్ట్ పెట్టింది. 
 

48

చిన్నప్పుడు అమ్మతో ఉన్న ఫోటోలు ఇవి. ఇందులో శ్రీముఖి చిన్నప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది. ఆమె ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. అదే అల్లరి, చిలిపితనం కనిపిస్తుంది. శ్రీముఖి చిన్నప్పటి ఫోటోలు ఆమె అభిమానులను అలరిస్తూ, నెటిజన్లని గిలిగింతలు పెడుతున్నాయి. ఇక ఇందులో అమ్మ గురించి శ్రీముఖి రాసుకొచ్చిన పోస్ట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 
 

58

అమ్మ గురించి చెబుతూ, ఊహ తెలిసినప్పనుంచి నాకు తెలిసిన నేను చూసి అందమైన రూపం అమ్మ. మా అమ్మ ప్రయాణం మొదటి నుంచి చూశాను. ఆమె ఎక్కడో చిన్న స్థాయి నుంచి ఇంత వరకు వచ్చి నాకు స్ఫూర్తినచ్చింది. ఈ రోజులు తనకు ఇంత మంది ఫాలోవర్స్ కి దగ్గర చేసింది. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలను వెంట చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. అభిరుచి, దృఢ సంకల్పంతో అందాల కళ నేర్చుకుని బ్యూటీషియన్‌గా ఎదిగింద`ని పేర్కొంది. 
 

68

ఇంకా కొనసాగిస్తూ, నెమ్మదిగా, స్థిరంగా బ్యూటీషియన్‌ వృత్తిలో ప్రావీణ్యం పొందింది. ఈ రోజు చాలా మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింద. వారి జీవితాల్లో మార్పు తెచ్చింది. నాకు, నా కుటుంబానిఇక విలాసవంతమైన జీవితాన్ని అందించడానికి ఆమె లెక్కలేనని విరామం లేని రోజులు గడిపింది. ఎంతో త్యాగం చేసింది. ఒక్క సారి కూడా ఆమె నాకు నో చెప్పినట్టు గుర్తుకు లేదు.

78

నేను బొద్దుగా ఉండే యుక్త వయసులో ఉన్నా, ఇతరులు నన్ను బాడీ షేమ్‌ చేసినప్పుడు ఆమె ఎప్పుడు నా వెంటే ఉంది. ఆ క్లిష్ట సమయంలోనూ నన్ను ప్రోత్సహించింది. ప్రేమించింది, పాంపర్‌ చేసింది. ఇంకా నన్ను బలపరిచింది. త్వరలో ఆమెకి 50ఏళ్లు నిండుతాయి. ఆమె అడ్డంకులను ఛేదిస్తూ, ప్రతి రోజూ నన్ను మరింతగా ప్రేరేపిస్తుంది. నేను ఈ జీవితానికి రుణపడి ఉన్నాను అమ్మా.

88

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అమ్మా` అని పేర్కొంది శ్రీముఖి. ఎమోషనల్‌గా కామెంట్‌ చేసింది. ఇది వైరల్ అవుతుంది. ఇది చూసి నెటిజన్లు స్పందిస్తూ శ్రీముఖికి అందగా నిలుస్తున్నారు. ఆమె గ్రేట్‌ అంటూ కితాబిస్తున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved