MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా సినిమాకి డేట్స్ ఇచ్చి చెప్పకుండా బిగ్ బాస్ కి వెళ్ళిపోయింది.. నటిపై శ్రీవిష్ణు కామెంట్స్

నా సినిమాకి డేట్స్ ఇచ్చి చెప్పకుండా బిగ్ బాస్ కి వెళ్ళిపోయింది.. నటిపై శ్రీవిష్ణు కామెంట్స్

ఈ చిత్రంలో శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి ముగ్గురూ ప్రధాన పాత్రల్లో నటించారు. కాబట్టి ముగ్గురి డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని షూటింగ్ చేయడం చాలా కష్టం అయిపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 21 2024, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
sri vishnu

sri vishnu

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.  గత ఏడాది శ్రీవిష్ణు 'సామజవరగమన' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. 

26

సామజవరగమన హిట్ తర్వాత శ్రీవిష్ణు తన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. వైవిధ్యం ఉన్న కథలతో పాటు తనకు బలం ఉన్న రొమాంటిక్ కామెడీ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్.. శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్ కావడం.. ఆల్రెడీ ట్రైలర్ వైరల్ కావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36

సైంటిస్ట్ లు కావాలని కలలు కనే ముగ్గురు విద్యార్థులు భైరవ పురం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీహర్ష దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎదురైనా సవాళ్ళని వివరించాడు. 

46

ఈ చిత్రంలో శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి ముగ్గురూ ప్రధాన పాత్రల్లో నటించారు. కాబట్టి ముగ్గురి డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని షూటింగ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ముగ్గురం బిజీగా ఉన్నాం. నేను ఉంటే దర్శి ఉండడు.. దర్శి ఉంటే రాహుల్ ఉండడు.. మేము ముగ్గురం ఉంటే హీరోయిన్ ఉండదు. 

56

హీరోయిన్ విషయంలో చాలా సమస్య అయినట్లు శ్రీ విష్ణు తెలిపాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అయేషా ఖాన్ నటించింది.మా చిత్రానికి డేట్స్ ఇచ్చాక తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయింది. మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఆ తర్వాత తెలిసింది.. ఆమె బిగ్ బాస్ కి వెళ్ళింది అని. దీనితో షూటింగ్ చాలా ఆలస్యం అయినట్లు శ్రీవిష్ణు తెలిపాడు. అయేషా ఖాన్ బిగ్ బాస్ 17 హిందీలో పాల్గొంది.

66

ఆమె మాత్రమే కాదు చాలా మంది నటులు మా చిత్రానికి వర్క్ చేస్తూ మధ్యలో బిగ్ బాస్ కి వెళ్లిపోయారని శ్రీవిష్ణు తెలిపారు. వాళ్లందరికీ ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. తమ సినిమాకి పనిచేస్తూ తెలుగు బిగ్ బాస్ కి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
హెవీ జ్యువెలరీలో రాకుమారిలా రష్మిక.. చూపు తిప్పుకోవడం కష్టమే!
Recommended image2
Vishnu Vinyasam Movie Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీవిష్ణు నవ్వించాడా? సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
రష్మిక మందన్న కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. 250 కోట్లకు పైగా వసులు చేసిన 5 మూవీస్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved