MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Smoking: ప‌దే ప‌దే సిగ‌రెట్ తాగాల‌ని ఎందుకు అనిపిస్తుంది.? ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి.?

Smoking: ప‌దే ప‌దే సిగ‌రెట్ తాగాల‌ని ఎందుకు అనిపిస్తుంది.? ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి.?

Smoking: పొగాకు ఆరోగ్యానికి హానిక‌రం, క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని తెలిసినా.. పొగ‌రాయుళ్లు మాత్రం ఆ అల‌వాటును మానుకోరు. అయితే మ‌నిషి స్మోకింగ్‌కు అల‌వాటు ప‌డ‌డానికి అస‌లు కార‌ణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 01 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిగరెట్ తీసుకున్న వెంటనే శరీరంలో ఏమవుతుంది?
Image Credit : Getty

సిగరెట్ తీసుకున్న వెంటనే శరీరంలో ఏమవుతుంది?

సిగరెట్ పొగను లోపలికి తీసుకున్న క్షణంలో నికోటిన్ ఊపిరితిత్తుల నుంచి నేరుగా రక్తంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కేవలం 7 నుంచి 10 సెకన్లలోనే మెదడుకు చేరిపోతుంది. ఇంత వేగంగా పనిచేసే పదార్థాలు చాలా తక్కువ. అందుకే ఒక్క ప‌ఫ్‌తో వెంటనే ఊరట వచ్చినట్లు అనిపిస్తుంది.

25
నికోటిన్ మెదడులో ఎలా పనిచేస్తుంది?
Image Credit : Getty

నికోటిన్ మెదడులో ఎలా పనిచేస్తుంది?

మెదడుకు చేరిన నికోటిన్ అక్కడ ఉన్న నికోటీనిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్లను యాక్టివేట్ చేస్తుంది. ఇవి స్విచ్‌లా పనిచేస్తాయి. ఈ స్విచ్‌లు ఆన్ అవగానే మెదడులో కొన్ని కెమికల్ సంకేతాలు విడుదల అవుతాయి. మెదడు వీటిని అవసరమైనవిగా భావిస్తుంది.

Related Articles

Related image1
Ram charan: రామ్ చరణ్ సంతానం గురించి వేణు స్వామి ఏం చెప్పాడు, ఏం జరిగింది.? ట్రోలింగ్ మాములుగా లేదుగా
Related image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి పిచ్చి ప్రేమ‌.. అబ‌ద్ధాలు స‌హించ‌రు, పొసెసివ్‌నెస్ ఎక్కువ
35
డోపమిన్ విడుదలే అసలు కారణం
Image Credit : Meta AI

డోపమిన్ విడుదలే అసలు కారణం

నికోటిన్ ప్రభావంతో మెదడులో డోపమిన్ అనే కెమికల్ విడుదల అవుతుంది. ఇదే “ఫీల్ గుడ్” కెమికల్. దీనివల్ల ఆందోళన తగ్గుతుంది, చిరాకు తగ్గినట్లు అనిపిస్తుంది, మనసు కాస్త రిలాక్స్ అవుతుంది, అందుకే సిగరెట్ తాగిన వెంటనే కోరిక‌ తగ్గిపోయిన భావన కలుగుతుంది.

45
మెదడు నేర్చుకునే అలవాటు ఇదే
Image Credit : Freepik

మెదడు నేర్చుకునే అలవాటు ఇదే

ప్రతి సారి సిగరెట్ తీసుకున్నప్పుడు డోపమిన్ విడుదల కావడంతో మెదడు ఒక విషయం నేర్చుకుంటుంది. “సిగరెట్ అంటే రిలీఫ్” అని ఫిక్స్ అయిపోతుంది. అందుకే డోపమిన్ రిలీజ్ అవుతున్న క్షణంలోనే కోరిక‌ తీరిపోయినట్లు అనిపిస్తుంది. ఇది పూర్తిగా మెదడు చేసే ట్రిక్.

55
మళ్లీ మ‌ళ్లీ తాగాల‌ని ఎందుకు అనిపిస్తుంది.?
Image Credit : Freepik

మళ్లీ మ‌ళ్లీ తాగాల‌ని ఎందుకు అనిపిస్తుంది.?

నికోటిన్ ప్రభావం చాలా తక్కువ సేపే ఉంటుంది. కొంత సమయం తర్వాత రక్తంలో నికోటిన్ స్థాయి తగ్గిపోతుంది. దాంతో డోపమిన్ కూడా తగ్గుతుంది. అప్పుడు మెదడు మళ్లీ అదే అనుభూతిని కోరుకుంటుంది. అదే మళ్లీ సిగరెట్ తాగాలనే కోరిక‌ను ప్రేరేపిస్తుంది. మొత్తం మీద సిగ‌రెట్ మ‌న‌కున్న మాన‌సిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌దు. సిగరెట్ ముందుగా సృష్టించిన అసౌకర్యాన్ని తాత్కాలికంగా దాచుతుంది అంతే. ఈ సైకిల్‌ని అర్థం చేసుకోవడమే అలవాటు నుంచి బయటపడే మొదటి అడుగు.

గ‌మ‌నిక‌: స్మోకింగ్ ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం. మెజారిటీ క్యాన్స‌ర్ కేసుల్లో స్మోకింగ్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వ‌ర‌కు దీనికి దూరంగా ఉండ‌డ‌మే మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Budget 2026 : SIP Calculator
Monthly Investment
₹
Expected Annual Return
%
Investment Duration
Yr
Recommended Stories
Recommended image1
Ram charan: రామ్ చరణ్ సంతానం గురించి వేణు స్వామి ఏం చెప్పాడు, ఏం జరిగింది.? ట్రోలింగ్ మాములుగా లేదుగా
Recommended image2
Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే
Recommended image3
500 మంది కోసం 50 లక్షలు ఖర్చు పెట్టిన రామ్ చరణ్, మాట నిలబెట్టుకున్నమెగా పవర్ స్టార్
Related Stories
Recommended image1
Ram charan: రామ్ చరణ్ సంతానం గురించి వేణు స్వామి ఏం చెప్పాడు, ఏం జరిగింది.? ట్రోలింగ్ మాములుగా లేదుగా
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి పిచ్చి ప్రేమ‌.. అబ‌ద్ధాలు స‌హించ‌రు, పొసెసివ్‌నెస్ ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved