MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్.. అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వబోతున్నాడా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్.. ?

రామ్ చరణ్.. అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వబోతున్నాడా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్.. ?

ఇటు పాన్ఇండియా స్టార్ గా సినిమాలు.. అటు వ్యాపారాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగ ఆయన మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎంటా వ్యాపారం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 15 2026, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమాలు, వ్యాపారాలతో రామ్ చరణ్ బిజీ..
Image Credit : Instagram

సినిమాలు, వ్యాపారాలతో రామ్ చరణ్ బిజీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్లిన ఈ హీరో.. అటు సినిమాలు చేస్తూ.. ఇట వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. బిజినెస్ ను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వ్యాపారాలలో భాగస్వామ్యంగా ఉన్న ఆయన ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామ్ చరణ్ స్టూడియో నిర్మించబోతున్నాడా?
Image Credit : Asianet News

రామ్ చరణ్ స్టూడియో నిర్మించబోతున్నాడా?

తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఒక కొత్త స్టూడియోను నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖుల కుటుంబాలకు ఇప్పటికే తమ సొంత స్టూడియోలు ఉన్నాయి. అక్కినేని కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియో, నిర్మాత రామానాయుడు కుటుంబానికి రామానాయుడు స్టూడియోలు, గతంలో కృష్ణకు పద్మాలయా స్టూడియో ఉంది, నందమూరి కుటుంబం రామకృష్ణ స్టూడియో ను నడిపించింది. అలాగే రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘అల్లు స్టూడియో’ పేరుతో ఒక స్టూడియోను నిర్మించే పనుల్లో ఉన్నారు.

35
హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్..
Image Credit : our own

హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్..

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఒక స్టూడియోను నిర్మించి దాన్ని చిత్రీకరణల కోసం అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలోనే చిరంజీవి స్టూడియో కట్టాలని ప్రయత్నాలు కూడా చేశారట. వైజాగ్ లో స్టూడియో కట్టాని చూసినట్టు సమాచారం. సినిమా రంగంలో స్టూడియోలు వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలను అందిస్తాయని భావించి ఈ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం... షూటింగ్స్ కోసం హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడికి వస్తుండటంతో.. రామ్ చరణ్ పెద్ద స్టూడియో ప్లాన్ చేశారట.

45
అల్లు అర్జున్ కు చరణ్ పోటీ ఇవ్వబోతున్నాడా?
Image Credit : X

అల్లు అర్జున్ కు చరణ్ పోటీ ఇవ్వబోతున్నాడా?

ప్రస్తుతం సినిమానే ఒక పెద్ద పరిశ్రమగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగానికి సంబంధించిన వ్యాపారాలు కూడా మంచి స్థాయిలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా సినిమాతో పాటు సినిమా సంబంధిత వ్యాపారాల్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియో ప్రాజెక్ట్ కోసం ఆయన భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టుతున్నట్లు సమాచారం.

అదేవిధంగా ఈ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొంత మంది భాగస్వాములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ భాగస్వాములు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈయితే రామ్ చరణ్ స్టూడియోతో అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వబోతున్నాడా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

55
అధికారికంగా ప్రకటించలేదు..
Image Credit : Asianet News

అధికారికంగా ప్రకటించలేదు..

అయితే రామ్ చరణ్ స్టూడియోపై ఇప్పటి వరకూ ఎటువంటి అఫీషియల్ అప్ డేట్ లేదు. ఇందులో నిజం ఎంతో కూడా తెలియదు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది.

ఈ చిత్రం వచ్చే నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెగా ఫ్యామిలీ సత్తా మరోసారి చూపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ది తరువాత సుకుమార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. ఈమూవీకి సబంధించిన భారీ అప్ డేట్ ఈ నెలలో రామ్ చరణ్ బర్త్ డే అయిన 27న వచ్చే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
మెగా కోడలు మిస్ అయిన విజయ్ దేవరకొండ సినిమా ఏదో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
10 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్ లో ఒంటరిగా హీరోయిన్, అనన్య పాండే కొత్త ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved